సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి!

Published by
Mahesh

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఆసియాలోనే ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థ కలిగిన సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి పడింది. వనపర్తి జిల్లా శంకరమ్మపేట వద్ద కరకట్ట తెగిపోవడంతో నీరంతా బయటకు పోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ఆటోమేటిక్‌గా గేట్లు తెరుచుకొనే సైఫన్ సిస్టమ్ ఈ జలాశయానికి ప్రత్యేకతగా ఉంది. అయితే, నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉన్నా గేట్లు ఆటోమేటిక్‌గా తెరుచుకోకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. గండి పడడంతో జలాశయంలో ఉన్న దాదాపు అర టీఎంసీ నీరు దిగువకు తరలిపోతోంది. గతంలో కరకట్ట నుంచి పలు చోట్ల లీకేజీలు గుర్తించినా అధికారులు పట్టించుకోలేదని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. గండి నేపథ్యంలో సమీప ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఘటనా స్థలానికి వ్యవసాయ మంత్రితోపాటు, జిల్లా కలెక్టర్‌, అధికారులు చేరుకొని పరిశీలించారు. నీరు బయటకు పోతుండడంతో ఇప్పుడు కరకట్టకు మరమ్మతులు చేయలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. జలాశయంలోని నీరంతా బయటకు పోయాక, కరకట్ట పునర్నిర్మాణం చేపట్టే అవకాశముంది. సరళా సాగర్ ప్రాజెక్టుకు కింద పది వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నీరు సరళాసాగర్ జలాశయం నుంచి కొత్తపల్లి వాగు, రామన్ పాడు డ్యాంలోకి చేరుతుంది. దీంతో రామన్ పాడు రిజర్వాయర్ 10 గేట్లను ఎత్తివేశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సరళాసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. సరళా సాగర్‌ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది ఆటోమేటిక్‌ సైఫన్‌ సిస్టమ్‌. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు వచ్చిన వెంటనే ఆపరేటర్‌ సహాయం లేకుండానే గాలి ఒత్తిడితో సైఫన్‌లు తెరుచుకొని కిందకు విడుదల చేస్తాయి. ఇలాంటి సాంకేతికత ఉన్న ప్రాజెక్టుల్లో ఆసియా ఖండంలో ఇదే మొదటిది. ప్రపంచంలోనే రెండవది సరళా సాగర్‌ కావడం విశేషం. మదనాపురం మండల పరిధిలోని ఊకశెట్టు వాగుపై 1947లో వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్‌రావు తన తల్లి సరళమ్మ పేరు మీద సరళాసాగర్‌ ప్రాజెక్టును నిర్మించారు. దీనిని 1949లో ప్రారంభించారు. కృష్ణానదికి ఉపనది అయిన చిన్నవాగుపై దీనిని నిర్మించారు. అర టీఎంసీ నీటి సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు కింద సుమారు పది వేల ఎకరాలకు సాగు నీరందుతోంది.

ప్రాజెక్టులో నాలుగు ప్రైమరీ సైఫన్లు, 17 ఉడ్‌ సైఫన్లు ఉన్నాయి. పూర్తి స్థాయిలో నీరు వచ్చిన వెంటనే ప్రైమరీ సైఫన్‌లు తెరుచుకుంటాయి. క్రమేణా ఇన్‌ఫ్లో ఎక్కువగా కొనసాగుతుంటే ఉడ్‌ సైఫన్ల ద్వారా నీరు కిందకు ప్రవహిస్తుంది. ఒక్క ప్రైమరీ సైఫన్‌ 500 క్యూసెక్కులు, ఒక్క ఉడ్‌ సైఫన్‌ 2450 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తాయి. చివరి సారిగా 2009 సంవత్సరం సెప్టెంబర్‌లో సైఫన్‌ల ద్వారా నీరు విడుదలైంది. మట్టికట్ట పొడువు 3,537 అడుగులు, రాతికట్ట పొడువు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 ఫీట్లు, నికర నీటి నిలువ 22 అడుగులు, 491.37 ఎంసీఎఫ్‌టీ, నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడి కాలువ 8 కి.మీ., ఎడమ కాలువ 20 కి.మీ.లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. ఇప్పుడు గండి పడి నీరంతా బయటకు పోతుండడంతో ఇక తమకు సాగునీరు ఇబ్బందవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

This post was last modified on December 31, 2019 12:29 pm

Mahesh

Recent Posts

CM Revanth Reddy: కీరవాణి స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

CM Revanth Reddy:  తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ కు సంగీతం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి… Read More

May 26, 2024

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

Poll Violence In Tadipatri: పోలింగ్ అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రిలో హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… Read More

May 26, 2024

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Jaya Badiga: అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు సంతతి వ్యక్తులు అనేక కీలక పదవులు చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా విజయవాడకు… Read More

May 26, 2024

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

ఉత్తరాంధ్రలో సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు తన బినామీలతో 800 ఎకరాలు కాజేశారని విశాఖ జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి… Read More

May 26, 2024

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

రాష్ట్రంలో కౌంటింగ్‌కు రోజులు స‌మీపిస్తున్నాయి. మ‌రో 8 రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. వ‌చ్చే నెల 4 వ తేదీన… Read More

May 26, 2024

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

ఎన్నికల‌లో గెలుపు-ఓట‌ములు స‌హ‌జం. గెలిస్తే నేరుగా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తారు. ఓడితే.. తిరిగి ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతారు. ఇది ఒక‌ప్ప‌టి లెక్క.… Read More

May 26, 2024

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

కేంద్రంలో ఉన్న బీజేపీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఏపీ రాజ‌కీయాల‌పై ఆది నుంచి కూడా ద్వంద్వ విధానాన్ని అనుస‌రిస్తున్న… Read More

May 26, 2024

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

వ‌చ్చే ఐదేళ్ల‌పాటు ఏపీ అసెంబ్లీ ర‌ణ రంగాన్ని త‌ల‌పించ‌నుందా? ఎవ‌రు అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌తిపక్షం ధాట‌కి చెమ‌ట‌లు క‌క్కాల్సిందేనా? ప్ర‌తిప‌క్షం… Read More

May 26, 2024

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

ఆలూలేదు.. చూలూ లేదు... అప్పుడే ఏంటి ఈ గోల‌? అని అనుకుంటున్నారా? ఎవ‌రి పిచ్చి వారికి ఆనం దం. ఏదో… Read More

May 26, 2024

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Aa Okkati Adakku OTT: అల్లరి నరేష్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్… Read More

May 26, 2024

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Sudigali Sudheer: పలు కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఈటీవీ.. మరో కొత్త షోను మొదలుపెట్టింది. సుడిగాలి సుదీర్ యాంకర్… Read More

May 26, 2024

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Anand Devarakonda: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ప్రజెంట్ మూవీ గం గం గణేశా మూవీ త్వరలోనే… Read More

May 26, 2024

Rathnam OTT: ఓటీటీ ని షేక్ చేస్తున్న తమిళ్ యాక్షన్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Rathnam OTT: యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా వచ్చిన తమిళ్ యాక్షన్ థ్రిల్లర్… Read More

May 26, 2024

Netflix: నెట్ఫ్లిక్స్ లో తప్పక వీక్షించాల్సిన 5 సినిమాలు ఇవే.. ఫ్యామిలీతో చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా..!

Netflix: ఓటిటి ప్రేక్షకులు టెస్ట్ కు తగ్గట్లుగానే విభిన్నమైన కాన్సెప్ట్లతో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను అందించేందుకు ప్రయత్నిస్తుంది… Read More

May 26, 2024

Malayalam OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మరో బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Malayalam OTT: ఈమధ్య కాలంలో మలయాళ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తున్నాయి. ప్రేమలు మరియు బ్రహ్మయుగం వంటి… Read More

May 26, 2024