పట్టాభిషేకం రేపే!

Published by
Siva Prasad

వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం తన కల అని చెప్పుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల సాకారం కానుంది. బుధవారం ఆయన విజయవాడలో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం అందుకు వేదిక కానుంది.

స్వామీ స్వరూపానంద్రేంద్ర నిర్ణయించిన ముహూర్తం మధ్యాహ్నం 12:23 గంటలకు జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు.

2009లో కాంగ్రెస్‌ వీడి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచీ అధికారం పీఠం చేజిక్కించుకునేంత వరకూ ఈ తొమ్మిదేళ్లలో జగన్ చాలా దూరం పయనించారు. ఈ ప్రయాణంలో ఆయన ఎదురుదెబ్బలు ఎన్నో తిన్నారు. అయితే ఏనాడూ గుండె నిబ్బరం కోల్పోలేదు. పట్టువదలని విక్రమార్కుడి లాగా ఒదార్పు యాత్ర చేశారు. మధ్యలో అవినీతి కేసులలో సిబిఐ అరెస్టు చేయడంతో 16 నెలలు జైలు జీవితం గడపాల్సివచ్చింది.

జైలు నుంచి విడుదల అయి వచ్చిన తర్వాత మళ్లీ ఓదార్పు యాత్ర కొనసాగించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికలలో గెలుపు తధ్యం అన్న ధీమాతో పోటీ చేశారు. అయితే నవ్యాంధ్రకు కెప్టెన్‌గా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయడు ఉంటే బావుంటుందని అప్పుడు మెజారిటీ ప్రజలు నిర్ణయించడంతో జగన్ కల నెరవేరలేదు.

ఒక ప్రాంతీయ పార్టీ పోటీ చేసిన మొదటి ఎన్నికలలో విజయం సాధించకపోతే ఇక దాని మనుగడ దాదాపుగా కష్టం. కానీ ఆంద్రప్రదేశ్‌లో విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పూర్తిగా నేలమట్టం కావడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తున్న వైసిపి ఆ ఇబ్బందిని అధిగమించింది. మధ్యలో చంద్రబాబు వైసిపి శాసనసభ్యులను తన పార్టీలోకి ఫిరాయింపజేయడం జగన్ నాయకత్వానికి సవాలుగా నిలిచింది. ఆయన దీనిని చంద్రబాబుపై ఎదురుదాడికి ఉపయోగించుకున్నారు. చంద్రబాబు నైతిక విలువలు లేని రాజకీయం చేస్తున్నాడంటూ మొత్తం వైసిపి శాసనసభా పక్షం  అసెంబ్లీని బహిష్కరించింది.

పార్టీని అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు 2017లో జగన్ తన తండ్రి బాట ఎంచుకున్నారు. నవంబర్ ఆరవ తేదీన ప్రజాసంకల్ప యాత్ర మొదలయింది. చివరికి అది అప్పటికి మరెవరూ చేయనంత దీర్ఘపాదయాత్రగా మారింది. 3600 కిలోమీటర్లకు పైగా నడిచిన జగన్ ఈ సంవత్సరం జనవరి పదవ తేదీన తన యాత్రను ముగించారు.

తన ఎన్నికల ప్రణాళికను ఆయన పాదయాత్రలోనే ప్రకటించారు. ఆయన ఇచ్చిన తొమ్మిది ప్రధానమైన హామీలకు నవరత్నాలు అని పేరు పెట్టారు. 2014 ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ 2019 ఎన్నికలలో దేనినీ తేలికగా తీసుకోలేదు. ఆయన ముందే ఎంపిక చేసుకున్న ఎన్నికల నిపుణుడు ప్రశాంత్ కిషోర్ దేనినీ తేలికగా తీసుకోనివ్వలేదు. టికెట్ల ఖరారులో కూడా ఆయన చెప్పిన సలహకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. అన్నీ లెక్క ప్రకారం చేశారు. ఎన్నికల నిర్వహణలో దిట్ట అన్న పేరున్న చంద్రబాబును మించి పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ ముగించారు. ఫలితం అందరికీ తెలిసిందే. కనీవినీ ఎరుగని మెజారిటీ. పార్టీని అందలం ఎక్కించిన జగన్ మోహన్ రెడ్డి తద్వారా తన కలను సాకారం చేసుకోగలిగారు.

Siva Prasad

Recent Posts

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024