Salaar: భారతీయ చలనచిత్ర రంగంలో గత కొన్ని సంవత్సరాల నుండి సౌత్ ఫిలిం ఇండస్ట్రీ హవా సాగుతోంది. ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ పేరు మారుమ్రోగేది. కానీ ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీ పేరు మారుమొగుతుంది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎస్.ఎస్.రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా తమ చిత్రాలతో బాలీవుడ్ ఇండస్ట్రీని దడదడలాడిస్తున్నారు. ఈ డైరెక్టర్ల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే బాలీవుడ్ లో సినిమా అదే టయానికి విడుదల చేయడానికి ఆలోచించే పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉంది. దీంతో సౌత్ హవాని బాలీవుడ్ మీడియా తట్టుకోలేకపోతోంది. ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ మీడియా ఎగతాళి చేసే పరిస్థితి ఉండేది.
ఇప్పుడు సౌత్ నుండి సినిమాలు విడుదలవుతున్నాయి అంటే భయపడుతుంది. ఇలాంటి పరిస్థితులలో బాలీవుడ్ బాద్షా షారుక్..పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తమ సినిమాలతో ఒక్కరోజు వ్యవధిలో బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు. వీరిద్దరి సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో విడుదలైన క్రమంలో మంచి పోటీ వాతావరణం నెలకొంది. డిసెంబర్ 21న షారుఖ్ “డంకీ”, డిసెంబర్ 22న “సలార్”..విడుదల అయ్యాయి. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో “డంకీ”.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎమోషనల్ నేపథ్యంలో కామెడీ తరహాలో పరవాలేదు అనిపించింది. అయితే “డంకీ” విడుదలైన మరుసటిరోజే ప్రభాస్ నటించిన “సలార్” రిలీజ్ కావటం జరిగింది. “సలార్” మొదటి బెనిఫిట్ షో పడిన తర్వాతే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో “డంకీ” కలెక్షన్స్ పడిపోయాయి. ప్రభాస్ సినిమా హిట్ దెబ్బకి షారుక్ సినిమా మూట ముళ్ళు సర్దేసింది. “జవాన్” అదేవిధంగా “పఠాన్” తర్వాత హ్యాట్రిక్ అందుకుందామన్న షారుక్.. “డంకీ” సినిమాతో చతికిలపడ్డారు.
మాస్ కమర్షియల్ మూవీ “సలార్” తో పోటీ నేపథ్యంలో… ఎమోషనల్ కంటెంట్ కలిగిన “డంకీ” సినిమాని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆశించినంతగా కలెక్షన్లు సాధించలేదు. తాజాగా “డంకీ” 9వ రోజు దేశవ్యాప్తంగా కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. తొమ్మిదవ రోజు ఈ సినిమా కేవలం తొమ్మిది కోట్లు మాత్రమే సాధించింది. ఇప్పటివరకు “డంకీ”కి దేశవ్యాప్తంగా ₹160కి పైగా కోట్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 305 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే రాబట్టింది. మరోపక్క ప్రభాస్ “సలార్” విడుదలయ్యి వారం రోజులు గడవక ముందే 500 కోట్ల రూపాయలు సాధించటం జరిగింది. 2023 ఏడాదిలో విడుదలైన అన్ని సినిమాల్లో కంటే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ కలెక్షన్స్ “సలార్” రాబట్టి 2023 చివరిలో సరికొత్త రికార్డు సృష్టించింది.
This post was last modified on December 30, 2023 12:00 pm
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More