Nuvvu Nenu Prema: విక్కీ అన్నమాటలకి చనిపోవాలనుకున్న పద్మావతి.. నిజం చెప్పిన విక్కీ..షాక్ అయిన పద్మావతి..

Published by
bharani jella

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, కుచలతో పద్మావతికి గొడవ జరుగుతుంది. పద్మావతికుచలకి సారీ చెప్పను అని చెప్తుంది.కోపంలో విక్కీ పద్మావతిని కొడతాడు.ఇంట్లో నుంచి వెళ్లిపోమంటాడు.ఎవరికీ చెప్పకుండా పద్మావతి ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది.పద్మావతి నీ కృష్ణ ఆపుతాడు. కృష్ణకి వార్నింగ్ ఇచ్చి పద్మావతివెళ్ళిపోతుంది.పద్మావతిని వెతకడానికి అరవిందా విక్కీని పంపిస్తుంది.

Nuvvu Nenu Prema today episode 25 september 2023 episode 424 episode highlights

ఈరోజు424 వఎపిసోడ్ లో, పద్మావతిని వెతకడానికి విక్కీ వెళ్తూ ఉండగా, దారిలో కృష్ణ అడ్డుపడి, విక్కీ తో గొడవపడతాడు. అసలు పద్మావతి మీద ప్రేమ లేనప్పుడు నువ్వు ఎందుకు తనని తీసుకురావడానికి వెళ్తున్నావు అని అంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవా పద్మావతి గురించి ఆలోచించడం మానే తను నా భార్య అని అంటాడు విక్కీ. నేను దాన్ని ప్రేమిస్తున్నాను తనతోనే ఉండాలనుకుంటున్నాను, మధ్యలో నువ్వు చెప్పినంత మాత్రాన మానేస్తానా విక్కి అని అంటాడు కృష్ణ.

Nuvvu nenu prema: పద్మావతి మీద చేయి చేసుకున్న విక్కి..ఇంట్లో నుంచి వెళ్లిన పద్మావతి ప్రమాదంలో పడనుందా?

Nuvvu Nenu Prema today episode 25 september 2023 episode 424 episode highlights

విక్కీ మనసు విరిచిన కృష్ణ..

ఆ మాటలకు విక్కీ కోపంతోకృష్ణ మీద చేయి చేసుకోపోతాడు.కృష్ణ విక్కీ చేతిని పట్టుకొని నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావు కదా నాకు పద్మావతికి ఇంతకుముందే ఎంగేజ్మెంట్ అయింది. మొదట ఎంగేజ్మెంట్ చేసుకున్న నా భార్య నే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అంటాడు. ఇలాంటి మాటలు చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావా అంటాడు విక్కీ. నేను అబద్ధం ఎందుకు చెప్తాను ఇలా చెప్తే నువ్వు ఎందుకు నమ్ముతావు అని రింగ్ తీసి చూపిస్తాడు. ఈ రింగు పద్మావతి నాకు ప్రేమగా ఎంగేజ్మెంట్లో తొడిగిన రింగు అని చెప్తాడు. విక్కీ నమ్మడు ఇలాంటివి ఎన్ని చూపించిన నేను నమ్మను అంటాడు. అయితే నువ్వు నమ్మే సాక్షాన్ని చూపిస్తాను అని పద్మావతి కృష్ణకు ఎంగేజ్మెంట్ అయిన ఫోటోలను చూపిస్తాడు. అవి చూసి విక్కీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడైనా నమ్ముతావా విక్కీ నన్ను పద్మావతి ప్రేమించింది నేను పద్మావతిని ప్రేమించాను మా ఇద్దరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని ఎంగేజ్మెంట్ కూడా చేశారు కానీ చివరి క్షణంలో నువ్వు వచ్చి అంతా తారుమారు చేశావు. ఇప్పటికీ పద్మావతి నన్ను ప్రేమిస్తుంది. అలాంటిది నువ్వు చెప్పావని ఇప్పుడు నా పద్మావతి నేను దూరం చేసుకోనా అని అంటాడు. కృష్ణ అన్న మాటలకు విక్కీ ఏం సమాధానం చెప్పాలో తెలియదు సాక్షాలు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాక కోపంతో కారు ఎక్కి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari: కృష్ణ ముందే మురారి నీ అలా చూసిన ముకుంద..

Nuvvu Nenu Prema today episode 25 september 2023 episode 424 episode highlights

పద్మావతిని అవమానించిన విక్కీ..

విక్కీ కృష్ణ చెప్పిన మాటలన్నీ తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ పద్మావతి ఉన్న ప్లేస్ కి వస్తాడు. పద్మావతిని చూసి తన దగ్గరికి వెళ్ళబోయి కూడా కృష్ణ అన్న మాటలు గుర్తుకు వచ్చి వెనక్కి తిరగాలనుకుంటాడు కానీ అరవింద్ కి ఇచ్చిన మాట కోసం పద్మావతి దగ్గరికి వెళ్తాడు. వచ్చి కారుకు అని అంటాడు పద్మావతి నేనెందుకు రావాలి అని అంటుంది. అన్నీ తెలిసి ఇలా చేయకు పద్మావతి వచ్చి కారుకు అని అంటాడు.మీరు పొమ్మన్నప్పుడు పోవడానికి రమ్మన్నప్పుడు రావడానికి నేనేమన్నా బొమ్మను అనుకుంటున్నారా నాకు మనసుంది దానికి ఒక అభిమానం ఉంటుంది అని అంటుంది.అవును ఆత్మ అభిమానం నీకు ఒక్కదానికే ఉన్నట్టు చేయకు అసలు నీలాంటి తప్పు పని చేసే వాళ్ళకి ఈ మాత్రం చేయడం కరెక్టేలే అని అంటాడు. మళ్లీ అదే మాట మాట్లాడుతున్నారు అసలు నేనేం తప్పు చేశాను చెప్పరు నన్ను కొట్టి అందరి ముందు అవమానించారు అవమానానికి నేను ఇలా బయటికి వచ్చేసాను అసలు జరిగిందేంటో మీరు తెలుసుకోవాలి అని అనుకోరు కదా అని అంటుంది. నేను కొట్టిన ఒక్క దెబ్బకే నువ్వు ఇంత ఫీల్ అయితే నా జీవితం మీద నువ్వు కొట్టింది దెబ్బకి నేను అంత ఫీల్ అవ్వాలి పద్మావతి అని అంటాడు. మళ్లీ అదే మాట మాట్లాడుతున్నారు సారు అసలు నేనేం చేశాను చెప్పండి నా తప్పేం లేదు, నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంది మీరు అని అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema today episode 25 september 2023 episode 424 episode highlights

నీళ్లలోకి దూకిన పద్మావతి..

అవసరానికి తగిన మాటలు మాట్లాడుతూ నీకు అవసరం ఉన్నట్టుగా మనుషుల్ని మలుచుకుంటూ ఇలా నయవంచకంగా చేయడం నాకు చేతకాదు అది నీకు మాత్రమే సాధ్యం అంటాడు విక్కీ. అయినా నీ ప్లేస్ లో నేను ఉంటే ఎప్పుడో చనిపోయే వాడిని అని అంటాడు. ఇప్పుడు కూడా నీ మీద ప్రేమతో రాలేదు మా అక్క చెప్పిందని వచ్చాను అని అంటాడు. ఆ మాటలకి పద్మావతి మనసులో ఇక ఎప్పటికీ ఈ తింగరోడు మారడు నన్ను ఏదో ఒకటిఅనడం అలవాటైపోయింది ఇప్పుడు ఇంత మాట మాట్లాడిన తర్వాత కూడా నేను ఎవరి కోసం బతకాలి అని వెళ్లి నీళ్లలో దూకేస్తుంది పద్మావతి.పద్మావతిని ఆపుదామని విక్కీ వెనకాలే వెళ్తాడు అప్పటికే పద్మావతి నీళ్లలో దూకేస్తుంది. పద్మావతి అని విక్కీ కూడా నీళ్లలో దూకేసి పద్మావతిని కాపాడి బయటకు తీసుకొస్తాడు ఇదంతా దూరం నుంచి కృష్ణ చూసి నేను ఎప్పుడు ప్లాన్ వేసినా అది రివర్స్ అవుతుంది మళ్లీ ఇప్పుడు కూడా ప్లాన్ వేస్తాం అనుకుంటే అది కాస్త రివర్స్ అయింది పద్మావతిని విక్కీ కాపాడేశాడు అని అనుకుంటాడు. పద్మావతిని బయటికి తీసుకొచ్చి నీకు అసలు బుద్ధుందా ఏంటి ఇలాంటి పని చేశావు అంటాడు నన్ను ఎందుకు కాపాడారు సారు నన్ను చావనివ్వండి మీరే కదా చనిపోమని చెప్పారు మళ్ళీ ఎందుకు కాపాడారు అని అంటుంది. నీ ప్లేస్ లో ఎవరున్నా కాపాడతాను అని అంటాడు విక్కీ. తప్పు చేసింది కాక దానికి శిక్ష నువ్వేసుకుంటున్నాం అనుకుంటున్నావా అంటాడు విక్కీ. నేనేం తప్పు చేయలేదు అంటుంది పద్మావతి మళ్లీ అదే మాట మాట్లాడుతున్నావ్ పద్మావతి నువ్వు చేసిన తప్పుకి నేనేం చేయాలో నాకు తెలియడం లేదు అంటాడు విక్కి. మీరు తప్పు చేసి నా మెల్లో ఈ తాలి ఎందుకు కట్టారు. నా ప్రాణానికి నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని అంటుంది పద్మావతి. నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించడానికి ఆ తాళి కట్టాను అంటాడు విక్కి.నీలాగా నాటకాలు అడ్డం నాకు రాదు అంటాడు విక్కి, నేనెప్పుడూ నాటకాలు ఆడలేదు, ఉన్నది ఉన్నట్టుగానే ఉన్నాను మనసులో ఏది ఉంటే అలానే చేశాను, అయినా కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంది పద్మావతి. అందుకే కదా మా అక్క పెళ్లి మీరు ఆపుతా అంటే తనకోసం నేను మీతో తాళి కట్టించుకున్నాను అని అంటుంది.

Brahmamudi సెప్టెంబర్ 23 ఎపిసోడ్ 208: రుద్రాణి రాహుల్ ప్లాన్ ని రివర్స్ చేసిన రాజ్. కావ్యకి ఇచ్చిన మాటని రాజ్ నిలబెట్టుకుంటాడా?

Nuvvu Nenu Prema today episode 25 september 2023 episode 424 episode highlights

నిజం చెప్పిన విక్కీ..

మీరు ఎంత చెప్పినా మారని నాకు అర్థం అయింది అసలు మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు నాకు ఇప్పుడే తెలియాలి అంటుంది పద్మావతి. నువ్వు ఎంత అరిచి గీపెట్టినా నేను చెప్పను ఎందుకంటే నువ్వు చేసింది ఏంటో నీకు తెలియకుండా ఉంటుందా అంటాడు విక్కీ. మళ్లీ అదే మాట మాట్లాడుతున్నారు నాకు తెలియదు నేను ఏ తప్పు చేయలేదు అంటుంది పద్మావతి. అయినా విక్కీ ఏం మాట్లాడకుండా ఉంటాడు పద్మావతి మీరు ఇప్పుడు నిజం చెప్తారా లేదంటే నా తల గోడకేసి కొట్టుకొని చచ్చిపోమంటారా అని అంటుంది. పద్మావతి నిజంగానే అక్కడ ఉన్న బండరాయి కేసి తల ని భాదుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వెళ్లి విక్కీ పద్మావతిని పట్టుకొని గట్టిగా పక్కకు తిప్పి ఏం చేస్తున్నావ్ అని అంటాడు. చెప్పాను కదా మీరు నిజం చెప్పకపోతే చనిపోతానని అంటుంది. నువ్వు మా బావ ప్రేమించుకున్న విషయం నా దగ్గర దాచి పెట్టావు కదా అంటాడు. మీరిద్దరూ పెళ్ళిలో ఒకరికొకరు కౌగిలించుకోవడం మా అక్కని వదిలేయమని నువ్వు చెప్పడం. నేను అన్ని చూశాను పద్మావతి అంటాడు విక్కీ. వెంటనే పద్మావతి షాక్ అవుతుంది. అన్ని గుర్తు చేసుకుంటుంది. మీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు సారు మీ బావ ఒక దుర్మార్గుడి మీ అక్కని కాపాడానికే నేను అలా ప్రవర్తించాను అని అంటుంది పద్మావతి. ఏంటి అంతా తెలిసిపోయింది నాటకాలు ఆడుతున్నావా అంటాడు విక్కీ. అవునా మరి నీకు మా బావకి ఎంగేజ్మెంట్ అయింది కదా దాని గురించి ఏం చెప్తావ్ అంటాడు. వాళ్ల నాన్న మంచం మీద ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో పద్మావతి కృష్ణ ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. అవన్నీ గుర్తు చేసుకుంటుంది పద్మావతి. అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు అని అంటుంది పద్మావతి అవన్నీ నాకు అనవసరం పద్మావతి నువ్వు మా బావతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావా లేదా ఎస్ ఆర్ నో అంతే చెప్పు అంటాడు అవునంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema today episode 25 september 2023 episode 424 episode highlights

రేపటి ఎపిసోడ్లో పద్మావతి గుడి దగ్గరికి వెళ్లి నీ దర్శనానికి వచ్చినందుకు నాకు ఒక మంచి దారి చూపించావు తల్లి నా భర్తని ఎలా నేను మార్చుకోవాలో నాకు ఒక మార్గాన్ని చూపించావు. తన ద్వేషాన్ని కూడా నేను ప్రేమగా మలుచుకొని తనకు దగ్గర అవుతాను అనుకుంటుంది. మొత్తానికి ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకుంటున్న నిజాన్ని పద్మావతి తెలుసుకుంది.

bharani jella

Recent Posts

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024