గన్నవరంలో వంశీ భలే స్కెచ్… జగన్ సై అంటే చాలు…!

Published by
Srinivas Manem

వల్లభనేని వంశీ సూపర్ ప్లాన్ వేశారు. తన మేడలో పూర్తిగా వైసీపీ కండువా వేసుకోడానికి విప్.., తప్పు లాంటి ఆటంకాలు రాకుండా స్కెచ్ గీశారు. టీడీపీ గాలి పూర్తిగా తీసేసి తన ప్రతిష్ట నిలుపుకోడానికి పెద్ద ప్లాన్ వేశారు. జగన్ సై అంటే ఇక అమలు చేసేయడమే. నేరుగా రంగంలోకి దూకడమే. ఆ ఆసక్తికర ప్లాన్ ఏంటి..? వంశీ ఏం చేయనున్నారు..? అనేది చూద్దాం..!!

ఆ ప్లాన్ చెప్పుకోడానికి చాల సింపుల్ : రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లడమే..! కానీ దీనిలో ఉద్దేశాలు, ప్రణాళికలు, గెలుపు వ్యూహాలు తెలుసుకుంటేనే సిసలైన మజా ఉంటుంది. అదేమిటంటే.
* ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా చేస్తారు. స్పీకర్ ఆమోదిస్తారు. ఎన్నికల కమీషన్ ఆరునెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహిస్తుంది. దీనిలో వైసీపీ తరపున వంశీ పోటీ చేస్తారు. గెలిస్తే ఇక తిరుగులేదు. తాను పూర్తికాలం ఈ నాలుగేళ్లు వైసీపీ మొనగాడిగా కొనసాగవచ్చు. “ఆ పార్టీపై గెలిచారు, ఈ పార్టీ మారారు, పార్టీ కండువా కూడా వేసుకోకుండా దొంగచాటుగా ఉంటున్నారు…, ద్రోహం చేసారు. మోసం చేసారు” అనే ఆరోపణలు, విమర్శలకు సమాధానం ఇదేనని ఆయన వ్యూహం. అప్పుడు నాలుగేళ్లు ఇక ఆ నియోజకవర్గంలో టీడీపీ సైలెంట్ అవుతుంది. వంశీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఒకవేళ ఓడితే సైలెంట్ అయిపోతారు, రాజకీయాలకు స్వస్తి చెప్పేస్తారు.

 

గెలుపు వ్యూహాలు కీలకమే…!

గన్నవరం ఒక సామజిక వర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గం. వంశీ దానికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ వైసీపీ గుర్తుతో, జగన్ బ్రాండ్ తో, వంశీ ఛరిష్మాలతో గెలవాలి అంటే కచ్చితమైన వ్యూహం, ప్రణాళిక ఉండాలి. అది వంశీ రెడీ చేసుకున్నారు. 1 . వైసీపీ నుండి తనకు పూర్తి మద్దతు ఉండేలా యార్లగడ్డ వర్గం మొత్తంతో మాట్లాడుకున్నారు. 2 . టీడీపీలో తనకి బాగా సన్నిహితంగా మండలాల స్థాయిలో పట్టున్న నాయకులను దారిలో పెట్టుకున్నారు. అన్నిటికీ మించి గన్నవరంలో తనకున్న అర్ధ, అంగబలంతో పాటూ అధికారం తోడుతుంది. సో.., గెలుపు నల్లేరుపై నడకేనని వంశీ అనుకుంటున్నారు. అందుకే అంతా ఒకే అనుకుంటే రెండు, మూడు రోజుల్లోనే జగన్ ని కలిసి తన వ్యూహం చెప్పి, పోటీకి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది అంటూ గన్నవరంలో వినిపిస్తుంది. జగన్ కూడా దీనికి ఏ మాత్రం అడ్డు చెప్పే అవకాశం లేదు. తన పార్టీ గుర్తుతో గెలిస్తే తాను ముందు నుండి చెప్తున్నది అదే కాబట్టి అభ్యంతరం పెట్టకపోవచ్చు.

టీడీపీ ఏం చేస్తుంది…??

ఒకవేళ వంశీ రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయి. గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 2009 లో దాసరి బాలవర్ధనరావు.., 2014 , 2019 లో వంశీ వరుసగా టీడీపీ నుండి గెలిచారు. పార్టీ గాలి రాష్ట్రం మొత్తం వేయకపోయినా గన్నవరంలో మాత్రం టీడీపీ బాగానే నెట్టుకొస్తోంది. అందుకు కారణం క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉండడమే. ఇప్పుడు వంశీ రాజీనామా చేస్తే టీడీపీ దీటైన అభ్యర్థిని రంగంలోకి దించుతుంది. ఇప్పటికే ఆ పార్టీ అక్కడ పోటీలోకి దించేందుకు రకరకాల వ్యూహాలను కూడా సిద్ధం చేస్తుంది. లోకేష్ ని పోటీలోకి దించాలని, లేదా పక్కనే దెందులూరులో ఓడిపోయినా గన్నవరంలోనూ మంచి పట్టున్న చింతమనేని ప్రభాకర్ ని తీసుకురావాలని…, దేవినేని ఉమాని పోటీలోకి దించాలని… ఇలా అనేక ప్రతిపాదనలు వేసుకుంటుంది. సో… ఉప ఎన్నిక వస్తే గన్నవరంలో పోటీ మాత్రం భలే రసవత్తరంగా మారుతుంది.

Srinivas Manem

Recent Posts

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024