Categories: న్యూస్

తస్మాత్ జాగ్రత్త జగన్ ! ప్లస్ అయ్యేదే మైనస్ అవుతోంది !

Published by
Yandamuri

మంచి పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రుల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడవ స్థానాన్ని  దక్కించుకోవడం ఏపీకి గర్వకారణమే.గతసారి నాలుగో ర్యాంక్ వచ్చిన జగన్ ఈసారి మూడవ ర్యాంక్ కి ఎగబాకారు.

becarefull ys jagan plus becomes minus

హేమాహేమీలు సీఎంలుగా ఉన్న ఈ దేశంలో ఏడాది పసిబిడ్డ సీఎం ఇంత ఉన్నత స్థాయికి ఎదగడం ఎంతైనా విశేషం. అదే సమయంలో జగన్ కు ఈ ర్యాంకింగ్ ఎలా దక్కింది అన్నది చర్చనీయాంశం అయింది.జగన్ చేతికి ఎముక లేనట్లుగా నిధులు కుమ్మరిస్తున్నారు. తన హామీలలో తొంబై శాతం అమలు చేసిన సీఎంగా ఉన్నారు. అదే విధంగాఖజానాకు వచ్చిన ప్రతీ పైసా కూడా జనం ఖాతాలోనే వేస్తున్నారు.

జగన్ కే గుర్తులేని ఎన్నో స్కీములను ఆయన అమలు చేశారు.అందువల్లనే ఏపీలో పాలన ఎలా ఉంది అంటే పైసలు చేతిలో పడిన వారంతాబాగానే ఉందని చెబుతారు. ఈ కారణం వల్లే ఆయనకు మూడో స్థానం లభించింది అని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఇలాంటి పథకాలు ఏవి జగన్ అంత స్థాయిలో అమలు చేయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగికి ర్యాంకింగ్లో 24%, ద్వితీయ స్థానంలో నిలిచిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు 15% ఓటింగ్ రావడాన్ని ఇక్కడ గమనించాలి. ఫొటోస్ స్థానంలో నిలిచిన జగన్మోహన్రెడ్డికి 11 శాతం ఓటింగ్ మాత్రమే వచ్చింది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన సీఎంలు సంక్షేమ పథకాలతో పాటు వారి వారి రాష్ట్రాలను అభివృద్ధి పరిచారు కాబట్టే అంత స్థాయిలో ఓటింగ్ లభించింద౦టున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కేవలం సంక్షేమ పథకాలు అమలు తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడా కానరావడం లేదు అన్నది ఒక విశ్లేషణ.జగన్ ఏడాది పాలనలో కొత్తగా ఒక్క ఇటుక రాయి పడలేదు, గట్టి ప్రాజెక్టు ఒకటి లేదు, ఇక యాక్షన్ ప్లాన్ అంటూ కూడా సిధ్ధం కాలేదు. అంటే వచ్చిన డబ్బు అంతా చిల్లరగా జగన్ ఖర్చు చేస్తున్నారు తప్ప శాశ్వతమైన అభివృధ్ధికి మాత్రం సుపరిపాలకుడిగా కేటాయించడంలేదని విశ్లేష‌ణలు ఉన్నాయి. అందుకే జగన్ కి అది మైనస్ గా కనిపిస్తోంది. ఇది ప్రమాదకరమని ఎప్పుడైతే జగన్ సంక్షేమ పథకాల అమలును కాస్త తగ్గించినా,

నిధులు ఇవ్వడం నిలిపివేసినా జనాలకు డబ్బు దొరకని పరిస్థితి ఏర్పడితే మాత్రం ప్రజలు ఆయనకు వ్యతిరేకమయిపోతారు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏకకాలంలో అమలు జరగాలని అప్పుడే ఏ ప్రభుత్వానికైనా దీర్ఘకాలిక మనుగడ ఉంటుందని వారు చెబుతున్నారు. మంచి ర్యాంకింగ్ వచ్చిందని సంబరపడడానికి బదులు 1,2 ర్యాంకింగ్ ఎందుకు రాలేదని జగన్ ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది.

This post was last modified on August 9, 2020 5:32 pm

Yandamuri

Share
Published by
Yandamuri

Recent Posts

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024