Naga Panchami : కంత్రి తంత్రీకి పంచమిని చూపించి ఆ అమ్మాయిని మి మంత్ర విద్యలతో బాగా భయపెట్టాలి అని చెబుతుంది కరాలి. ఓ అంతేనా అని కంత్రి అంటాడు. ముందు పంచమి ఎక్కడుందో కనిపెట్టి మీ శక్తుల్ని ప్రయోగించండి నేను ఇక నుంచే చూస్తూ ఉంటాను అని కరాలి చెబుతుంది. మీరే చూస్తారు గా మెచ్చుకునేలా చేస్తాం అంటూ కంత్రి తంత్రీ మాయమైపోతారు. కట్ చేస్తే,
ఇల్లంతా చూశాం పంచమి కనిపించట్లేదు అని తంత్రి అంటాడు. పంచమి వచ్చేదాకా కిచెన్ లో ఉన్నవి అన్ని తినేద్దాం అని కంత్రి అంటాడు. ఈ మనుషులని మనమెక్కడ తింటాం రాత్రికి స్మశానానికి వెళ్లి శవాలని తిందాం అని కంత్రి అంటాడు. ఇంతలో మోక్ష పంచమి ఇంటికి వస్తారు. ఎవరికి ఏమీ తెలియనట్టే ఉండు పంచమి అ కరాలికి భయపడి బతకాల్సిన అవసరం లేకుండా మనిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం అని మోక్ష కారు దిగి లోపలికి వెళ్ళిపోతాడు. మోక్ష బాబు మళ్లీ మొదటికి వచ్చాడు పెళ్లికి ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు అని పంచమి కారు దిగుతూ ఉండగా కంత్రీ తంత్రి మంటలు సృష్టిస్తారు. పంచమి కాలి కింద పెడుతూ ఉండగా మంటలు కాళ్లకు తగిలి పంచమి కారులోనే కూర్చుంటుంది. ఏమైంది పంచమి కారు దిగు అని మోక్ష వెనకకు వచ్చి అంటాడు. మంటలు ఉన్నాయి మోక్ష బాబు అని పంచమి అంటుంది. ఇక్కడ మంటలు ఎక్కడున్నాయి పంచమి అని మోక్ష అంటాడు. నేను దిగబోతుంటే మంటలు ఎగసి పడుతున్నాయి అని పంచమి అంటుంది. నువ్వేమీ దిగొద్దు నువ్వు అలాగే ఉండు నిన్ను ఎత్తుకొని తీసుకు వెళ్తాను అని మోక్ష పంచమి ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్తాడు. అది చూసి కంత్రి త0త్రి నవ్వుకుంటారు. కట్ చేస్తే,
ఏంటి మోక్ష పంచమికి ఏమైంది ఎత్తుకొచ్చావు అని మేఘన అడుగుతుంది.ఊరికే సరదా కోసం ఎత్తుకున్నాను అని మోక్ష పంచమిని దించబోతూ ఉంటాడు. వద్దు మోక్ష బాబు మంటలు అక్కడ రాక్షసి ఉంది చూడు నన్ను తినబోతుంది నన్ను దించొద్దు అని పంచమి భయపడుతుంది. ఏమైంది పంచమి నీకు అని కరాలి అంటుంది. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. పంచమి కి ఏమైంది రా అని శబరి అడుగుతుంది. ఏంటి పంచమి ఒళ్ళంతా చెమటలు పట్టి ఉన్నాయి అని మీనాక్షి అడుగుతుంది. తనకు కళ్ళు తిరుగుతున్నాయంట అని మోక్ష అంటాడు. ఏంట్రా ఈ పిచ్చి చేష్టలు మళ్లీ ఇది ఒక కొత్త నాటకమా అని వైదేహి అంటుంది. కోసేపు పడుకుంటే సరిపోతుంది అని మోక్ష పంచమిని తీసుకొని వెళుతూ ఉండగా తంత్రి తన మాయాజాలంతో మోక్ష కాలనీ గట్టిగా పట్టేస్తాడు. అడుగు ముందుకు వేయలేని మోక్ష పంచమిని కింద పడేసి తను కింద పడిపోతాడు. పంచమి లే పంచమి అని మోక్ష లేపుతూ ఉంటాడు. నా చుట్టూ రాక్షసులు ఉన్నారు నన్ను చంపేస్తారు నేను కళ్ళు తెరవను అని పంచమి అంటుంది. పంచమి లే ఒక్కసారి నన్ను చూడు అని మోక్ష అంటాడు. పంచమి లేచి కూర్చుంటుంది. ఒక్కసారి సుబ్బు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది పంచమి. పంచమి నువ్వేమీ భయపడకు నేను ఉన్నంతవరకు నీకేమీ కానివ్వను అని మోక్ష అంటాడు. నిన్ను నా నుంచి ఎవరు వేరు చేయలేరు ఏడవద్దు పంచమి అని మోక్ష పంచమి కన్నీళ్లు తుడుస్తాడు. పంచమి మోక్షని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ సంఘటన చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కట్ చేస్తే,
మోక్ష దీనికి పిచ్చి పట్టి ఉంటే తీసుకువెళ్లి పిచ్చి ఆసుపత్రిలో వదిలేయ్ ఇది నాటకం అని నాకు తెలిస్తే మాత్రం దీన్ని చంపేస్తాను అని వైదేహి అంటుంది. పంచమి ఇక్కడే ఉంటుంది మీరంతా వెళ్ళండి అని మోక్ష అంటాడు. మోక్ష పంచమిని తీసుకొని వెళ్తూ ఉండగా మోక్ష దాన్ని ఇప్పటికిప్పుడే బయటికి పంపించేసేయ్ అని వైదేహి అంటుంది. ఈ పిచ్చిది ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని వైదేహి అంటుంది. పంచమి ఇక్కడే నాతోటే ఉంటుంది అని మోక్ష పంచమిని తీసుకొని వెళ్ళిపోతాడు. పంచమికి ఏదో అయినట్టుంది ఎవరికైనా చూపెడితే బాగుండు అని మేఘన అంటుంది.అది బాగానే ఉంది నా కొడుకు ను పిచ్చివాడిని చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది ఏదో ఒకటి చేసి దాని ఇంట్లో నుంచి పంపించేయాలి లేదంటే నా కొడుకు నాకు దక్కడు అని వైదేహి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంటికి ఏదో అరిష్టం పట్టినట్టుంది అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని శబరి అంటుంది.ఒక పెద్ద మాంత్రికుని పిలిపించి పూజ జరిపిద్దాం అని మీనాక్షి అంటుంది. ఏదో ఒకటి చేయకపోతే ఒకరి కొకరు కొట్టుకొని చస్తారు అని శబరి వెళ్ళిపోతుంది. ఆ పంచమి ఏదో పెద్ద ప్లాన్ వేసింది చిత్ర అని జ్వాల అంటుంది. నీకు దండం అక్క ఆ పంచమిని కంటే నిన్ను చూస్తేనే భయంగా ఉంది అంటూ చిత్ర వాళ్ళ ఆయనని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,
పంచమి సుబ్బు ఇచ్చిన నెమలి పించని పట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంటుంది. పంచమి జరిగినవన్నీ మరిచిపో నీకు తెలియకుండా ఎవరో నీ మీద ప్రయోగం చేస్తున్నారని పిస్తుంది అని మోక్ష అంటాడు. అంతా కరాలి చేయిస్తుంది తన శక్తులు నాకు తెలుసు నన్ను అంతం చేసి మిమ్మల్ని దక్కించుకోవాలని చూస్తుంది నిన్ను నాకు దూరం చేస్తానని ఛాలెంజ్ చేసింది అందులో భాగమే నాపై జరిగిన ఈ మాయాజాలం దాడి అని పంచమి అంటుంది. ఆ కరాలి గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావు పంచమి అని మోక్ష అంటాడు.వాళ్ళ అన్నను చంపాననినా మీద పగ పట్టింది నిన్ను సొంతం చేసుకుని ఏవో శక్తులు సంపాదిస్తానంటుంది అని పంచమి అంటుంది. నాకు ఫణీంద్ర మీద అనుమానంగా ఉంది పంచమి తన నాగశక్తితో నిన్ను భయపెట్టి తన వెంట తీసుకుపోవాలనుకుంటున్నాడేమో అని మోక్ష అంటాడు.
నేను నాగలోకపు యువరాణిని నన్ను కాపాడాలని చూస్తారు కానీ హాని తల పెట్టాలని చూడరు తను నాకు కోపం వచ్చే పని చేస్తే నేను నాగ దేవతను పూజించి చెబితే నాగదేవత శిక్షిస్తుందని అలాంటి పని చేయడు అని పంచమి అంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం పంచమి అని మోక్ష అంటాడు. సుబ్రహ్మణ్య స్వామి ఈ నెమలి పించని నాకు ప్రసాదించాడు ఏమీ కాదు మీరు భయపడకండి అని పంచమి అంటుంది. దీనికి అంత శక్తి ఉంటే కరాలి నీ మీద మంత్ర శక్తిని ఎలా ప్రయోగించింది అని మోక్ష అంటాడు. కరాలి మంత్రి శక్తిని ప్రయోగించిన నేను మామూలుగా ఉన్నాను అంటే ఈ నెమలి పించం కాపాడి ఉంటుంది మోక్ష బాబు అని పంచమి ఉంటుంది. నెమలి పించం నీ దగ్గర ఉంది ఆ స్వామి మీద అపారమైన నమ్మకం ఉంది అలాంటప్పుడు ఏ శక్తులు నిన్ను అడ్డుకోకూడదు కదా అని మోక్ష అంటాడు. ఆ స్వామి నాకు హెచ్చరించినట్టు ఉంది ఆ కరాలి నుండి నిన్ను కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండమని చెప్పినట్టు అనిపిస్తుంది మోక్ష బాబు అని పంచమి అంటుంది..
Krishna Mukunda Murari May 17 2024 Episode 472: భవానీ దేవి పంతులు గారిని పిలిచి ముకుందా ఆదర్శ… Read More
Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: విక్కీ ఉద్యోగ ప్రయత్నంలో చాలా ఆఫీసులకి తిరుగుతాడు. కానీ… Read More
Brahmamudi May 17 2024 Episode 412: దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More
May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More
EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More
AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More
CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More
Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More
పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More
OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More
Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More
Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More
Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి… Read More
Devara: మే 20వ తారీకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. బ్యాక్ టు బ్యాక్ హిట్… Read More