Teenmar Mallanna : మల్లన్న పోరాటం యువతకు ఒక పెద్ద పాఠం!

Published by
Comrade CHE

Teenmar Mallanna : ఒక సామాన్యుడు తెగించి రాజ్యం మీద తిరుగుబాటు చేస్తే, దానికి సాంకేతికతను ఉపయోగించుకుని ఎలా ముందుకు వెళ్లవచ్చు అన్నదే చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న విషయం లో అర్థమవుతుంది. ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఎలాంటి ప్రచారం లేకుండా కేవలం తన స్వశక్తి నమ్మి ఎన్నికల్లో దూసుకు వెళ్లారు. ఏకంగా అధికార పార్టీ అభ్యర్థికి చెమటలు పట్టించే వరకూ వెళ్లిన మల్లన్న చివరిగా ఓడిపోయినా… ప్రజల మనసులు మాత్రం గెలవగలిగారు.

Teenmar Mallanna

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి వచ్చిన మల్లన్న ఇప్పటికే రెండు సార్లు ఎన్నికల్లో పోటీచేశారు. ఇదే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి దాదాపు పదివేల ఓట్లు పొందారు.2019లో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత నాలుగు నెలల నుంచి ఉమ్మడి నల్గొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజల్లోకి వెళ్లారు. స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేవిధంగా ప్రజలను చైతన్యవంతం చేశారు. సుదీర్ఘంగా సాగిన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడంతో ఆయనపై కొంత సానుభూతి పెరిగింది.

ఎన్నికల సరళిని పరిశీలిస్తే చాలా వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓట్లు వేసిన వారిలో ఎక్కువమంది మల్లన్నకు ద్వితీయ ప్రాధాన్య ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆలేరు, భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో ఆయనకు భారీగా ఓట్లు పడ్డాయని తెలిసింది. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా గుర్తించి తనకు ఓట్లు వేశారని తీన్మార్‌ మల్లన్న అన్నారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోసం ఇప్పటివరకు తాను చేసింది తక్కువేనని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని ఆయన అన్నారు.

సుమారు 96 మంది అభ్యర్థులు పోటీపడినా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తీన్మార్ మల్లన్న జాతీయ పార్టీల అభ్యర్థులను పక్కకునెట్టి టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి పూర్తి పోటీ ఇవ్వగలిగారు. ఒక దశలో మల్లన్న గెలుస్తారు అన్న నమ్మకం కూడా ఏర్పడింది. అయితే ఎక్కువ మంది పట్టభద్రులు మల్లన్నకు ద్వితీయ ప్రాధాన్యత ఓటుకు మొగ్గు చూపడంతో మల్లన్న అనూహ్యంగా వెనుకబడ్డారు. మహామహుల అందరూ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్నారు మల్లన్న మాత్రం తన ఓట్ల తో ముందుకు దూసుకు వెళతారు తప్ప ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మూడు రోజుల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో ప్రతిరోజు మల్లన్న పేరు మార్మోగిపోయింది. చివరకు చాలా స్వల్ప మెజారిటీతో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలవగా ప్రజల హృదయాలను మాత్రం మల్లన్న గెలుచుకో గలిగారు.

ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా సాధ్యమే. అందులోనూ ప్రస్తుతం యువత రంగంలో వస్తున్న మార్పులను గమనించి ముందుకు వెళితే రాజకీయాల్లో రాణించడం పెద్ద కష్టమేమీ కాదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలను తప్పయితే తప్పు అని పైకి ఒప్పు అని నిర్భయంగా చెప్పగలిగేవారు కావాలి. ప్రస్తుతం మీడియా అంతా పలు రాజకీయ పార్టీలకు వేదిక కావడం తో ప్రజలు దేనిని నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో మల్లన్న ల యువకులు ఆయన మార్గదర్శకంలో… నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకు వచ్చి వారి తరఫున పోరాటం చేయగలిగే సత్తా ఉంటే కచ్చితంగా ప్రజాస్వామ్యంలో కొత్త మలుపు తిరిగినట్లే..

This post was last modified on March 22, 2021 1:04 pm

Comrade CHE

Recent Posts

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

SIT: ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది.… Read More

May 18, 2024

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

EC: ఏపీలో ఎన్నికల సందర్భంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు కలెక్టర్ తో పాటు మూడు జిల్లాల ఎస్పీలపై… Read More

May 18, 2024

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More

May 18, 2024

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న ‌యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More

May 18, 2024

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది.… Read More

May 18, 2024

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More

May 18, 2024

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More

May 18, 2024

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More

May 18, 2024

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Prasanna Vadanam: తెలుగు ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన న‌టుల్లో సుహాస్ ఒక‌రు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More

May 18, 2024

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More

May 18, 2024

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More

May 18, 2024

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More

May 18, 2024

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024