TSRTC: ‘బస్ డ్రైవర్ పై రైతు ఆరోపణలు అవాస్తవం..’ అసలు విషయం ఇదీ..!

Published by
Muraliak

TSRTC: ఇటివల తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ ఒక బొప్పాయి పండ్ల రైతు నుంచి బొప్పాయి పండ్లు ఉచితంగా ఆశించి.. రైతు తిరస్కరించడంతో బస్సు ఎక్కించుకోలేదని.. కోపంతో రైతు ఆ బస్సును కదలనీయకుండా బస్సు ఎదుట కూర్చుని నిరసన తెలిపాడనే వార్త సంచలనం రేపింది. దీంతో ఆర్టీసీపై, ఉద్యోగులపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. సహజంగానే పత్రికల్లో వచ్చే వార్త.. ఒక్కోసారి ఫొటో కూడా వార్త ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. ఈ వార్తలో కూడా ఫొటో అంతటి తీవ్రతనే వ్యక్తం చేసింది. ఇందులో నిజమే ఉందని భావించారు. కానీ.. సంఘటనపై టీఎస్ఆర్టీసీ జరిపిన విచారణలో అసలు విషయం బయటకొచ్చింది.

farmer false protest on tsrtc

డ్రైవర్ పై వచ్చిన ఆరోపణ..

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలంలోని మారుమూల గ్రామం మారేడు మాన్ దిన్నె గ్రామం నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఈ గ్రామానికి రోజూ అచ్చంపేట డిపో  నుంచి ఒకటే బస్సు సర్వీసు నడుస్తుంది. గ్రామానికి చెందిన గోపయ్య అనే రైతు తన పొలంలో పండించే బొప్పాయి పండ్లను నిత్యం సమీపంలోని కొల్లాపూర్ పట్టణానికి ఇదే బస్సులో తీసుకెళ్లి అమ్మి జీవనం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలోనే గత శుక్రవారం బొప్పాయిని బస్సులో తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే.. ఆర్టీసీ డ్రైవర్ ఉచితంగా పండ్లు ఆశించాడని.. రైతు తిరస్కరించడంతో బస్సు ఎక్కించుకోకుండా వెళ్లిపోయాడని.. తీవ్ర ఆవేదనకు గురైన రైతు బస్సు కొల్లాపూర్ నుంచి తిరిగి వచ్చే సమయంలో రోడ్డుపై బొప్పాయి పండ్ల బుట్టలు అడ్డుపెట్టి గంటసేపు నిరసన వ్యక్తం చేశాడనే వార్త ఫోటోతో వైరల్ అయింది.

జరిగిన వాస్తవం ఇదీ..

దీంతో సంస్థ చేపట్టిన విచారణలో డ్రైవర్ తప్పేమీ లేదని తేలింది. అచ్చంపేట డిపో మేనేజర్ మాటల్లో.. ‘ఆరోజు రైతు పండ్ల బుట్టలతో తాను బస్ ఎక్కుండా.. బుట్టలను మాత్రమే ఎక్కిస్తూ.. తనకు రావడం కుదరదని.. కొల్లాపూర్ లో తనవాళ్లు దించుకుంటారని చెప్పాడు. అందుకు బస్ సిబ్బంది ఒప్పుకోలేదు. సరుకుతోపాటు వ్యక్తి వస్తేనే తాము అనుమతించాలి.. లేదంటే కార్గో ద్వారానే రవాణా చేయాలని చెప్పారు. దీంతో గోపయ్య కావాలనే బుట్టలు అడ్డుపెట్టి లోకల్ గా డ్రైవర్ పై నిందలు వేసి ప్రచారం చేశాడు. డ్రైవర్ బొప్పాయి పండ్లు ఆశించడం.. రైతు తిరస్కరించి బస్సు ఎక్కంచుకోకపోవడం అవాస్తవం’ అని తెలిపారు. రైతు చేసిన పనికి సంస్థపై విమర్శలు రావడం బాధాకరమే..!

 

Muraliak

Recent Posts

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024