అమరజీవికి అవమానం

Published by
sharma somaraju

అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తొలి సారిగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలో అమరజీవి పొట్టి శ్రీరాములుకు చోటు కల్పించకపోవడం  విమర్శలకు దారి తీస్తున్నది.

రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నవంబర్ ఒకటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సంకల్పించింది. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హజరుకానున్నారు.

వేడుకలను ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించాలని నిర్ణయించడం బాగానే ఉంది కానీ ప్రభుత్వం ముద్రించిన ఆహ్వాన పత్రంపై ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం 58రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఫోటో ముద్రించకపోవడంపై పలువురు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.

ఆహ్వాన పత్రంపై మహాత్మా గాంధీ,  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, , పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోటోలను మాత్రమే ముద్రించారు. అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవనంలో జరిగే వేడుకలకు సంబంధించి ముద్రించిన ఆహ్వాన పత్రంలోనూ పొట్టి శ్రీరాములు చిత్రాన్ని ముద్రించలేదు. ఈ ఆహ్వాన పత్రంపై ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో పాటు తెలుగుతల్లి ఫోటోలను మాత్రమే ముద్రించారు. రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన రెండు ఆహ్వాన పత్రికల్లోనూ అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రం లేకపోవడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు.

దీనిపై టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా స్పందించి ప్రభుత్వాన్ని విమర్శించారు.

‘వెనకటికి ఒకడు పెళ్లి కొడుకు లేకుండా పెళ్లికి సిద్ధమయ్యాడట, అలాగే ఈ రోజు ఆంధ్రావతరణ దినోత్సవ పోస్టర్‌లో అసలు సూత్రధారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఫోటో ఏది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘ఆసలు ఆయన గురించి మీ ప్రభుత్వానికి తెలుసా’ అని ప్రశ్నించారు. ‘ఆయన ఆత్మ త్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్రవతరణ అని తెలుసుకోండి’ అని వర్ల రామయ్య అన్నారు.

 

This post was last modified on October 31, 2019 11:16 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

ఏపీ సీఎం జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ కుమార్… Read More

May 18, 2024

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని… Read More

May 18, 2024

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

Telangana EAPCET: తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్… Read More

May 18, 2024

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

SIT: ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది.… Read More

May 18, 2024

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

EC: ఏపీలో ఎన్నికల సందర్భంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు కలెక్టర్ తో పాటు మూడు జిల్లాల ఎస్పీలపై… Read More

May 18, 2024

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More

May 18, 2024

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న ‌యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More

May 18, 2024

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది.… Read More

May 18, 2024

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More

May 18, 2024

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More

May 18, 2024

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More

May 18, 2024

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Prasanna Vadanam: తెలుగు ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన న‌టుల్లో సుహాస్ ఒక‌రు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More

May 18, 2024

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More

May 18, 2024

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More

May 18, 2024

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More

May 18, 2024