వికేంద్రీకరణపై శివరామకృష్ణన్ ఏమన్నారంటే..

Published by
Mahesh

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టంగా తెలిపింది. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరికాదని సూచించింది. అభివృద్ధి ఒకే ప్రాంతంలో ఉండరాదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ గతంలో చేసిన ప్రతిపాదనలకు సంబంధించిన వీడియోలను వైసీపీ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఒక భారీ నగరాన్ని నిర్మించాలనుకోవడం, అక్కడే అభివృద్ధిని కేంద్రీకరించాలనుకోవడం సమస్యకు పరిష్కారం కాదని శివరామకృష్ణన్ పేర్కొన్నారు. ఏడాదికి మూడు పంటలు పండడం ఓ వరం అని, అలాంటి గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతంలో నిర్మాణాలు చేపడితే ఆహార భద్రతకు ముప్పు ఉంటుందని, 21వ శతాబ్దంలో అభివృద్ధి అన్నది వికేంద్రీకరణ, నగరాల అనుసంధానం, సాంకేతిక అనుసంధానంపై ఆధారపడి ఉంటుందని సదరు వీడియోలో వివరించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 6ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించి జూన్ 2న ఏర్పడిన నూతన ప్రభుత్వ అభిప్రాయాలను కూడా తీసుకొని కేంద్రానికి నివేదిక అందజేసింది. 31 ఆగస్టు 2014న తన నివేదికను విడుదల చేసింది. రాజధాని కోసం కొన్ని ప్రాంతాలను ప్రతిపాదిస్తూ.. వాటికున్న లోటుపాట్లను ప్రస్తావించింది. అయితే, ఏ ఒక్క ప్రాంతాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. భూముల లభ్యత, ఇతర కారణాలను మాత్రమే ప్రస్తావించింది. నాటి చంద్రబాబు ప్రభుత్వం ఈ నివేదిక రాకముందే పాలనను విజయవాడ నుంచి మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేసింది. అయితే, శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ రాజధానిగా ఏర్పాటు చేసే అంశంపై విముఖత వ్యక్తం చేసింది. రాజధాని ప్రాంత ఎంపికపై కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మంత్రి నారాయణ నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేసింది. 2014 జులై 21న నాటి పురపాలక మంత్రి నారాయణ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. రాజధాని నిర్మాణంలో భాగంగా అసెంబ్లీ, సచివాలయం, ఇతర నిర్మాణాలను ఎక్కడెక్కడ, ఏ రీతిన నిర్మించాలన్న అంశాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వానికి ఈ కమిటీ సలహాలు ఇస్తుందని నాటి ప్రభుత్వం పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టంగా తెలిపింది. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రచారం చేస్తున్నట్లుగా విజయవాడ, గుంటూరు నగరాల మధ్య పెద్ద రాజధాని నిర్మాణం కూడా సరికాదని ఆ నివేదికలో తెలియచేసింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగరి అర్బన్‌ డవలప్‌మెంట్‌ ఏరియా గోవా రాష్ట్రాని కంటే రెండు రెట్లు పెద్దవని కమిటీ తన నివేదికలో తెలిపింది. దేశంలోనే అత్యుత్తమ సాగు భూములు ఉన్న ఈ ప్రాంతంలో రైతు కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వీరంతా ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతారని పేర్కొంది. కొన్ని వర్గాల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొనడమే కాకుండా.. కృత్రిమంగా రియల్‌ వ్యాపారం పెరుగుతుందని కూడా కమిటీ చెప్పింది. దీనివల్ల సామాజికంగా కూడా ఎన్నో అనర్థాలు జరుగుతాయని హెచ్చరించింది. విజయవాడ, గుంటూరు నగరాలు సహజంగా అభివృద్ధి చెందుతున్నాయి. రెండు నగరాల మధ్య ప్రాంతం కూడా తనంతట తానే అభివృద్ధి చెందుతోంది. ఇటువంటి సమయంలో అక్కడ రాజధాని పేరుతో భారీ నిర్మాణాలు చేపట్టి, భారీ ఎత్తున ప్రజల్ని అక్కడ దింపడం సరికాదని తెలిపింది. రాజధానికి వ్యవసాయ భూముల్ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తీసుకోవాలని సూచించింది.

అయితే, శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ సూచ‌న‌ల‌ను తోసిపుచ్చిన నాటి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం 2014 డిసెంబ‌ర్లో అమ‌రావ‌తి కేంద్రంగా రాజ‌ధాని నిర్మించ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఆ వెంట‌నే ఆరు నెల‌లకు ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌ని వీడి పాల‌న‌ను అమ‌రావ‌తి ప్రాంతానికి త‌ర‌లించారు. దానికి త‌గ్గ‌ట్టుగా స‌చివాల‌యం, అసెంబ్లీ వంటివి తాత్కాలిక ప్రాతిప‌దిక‌న నిర్మించారు. అదే స‌మ‌యంలో రాజ‌ధాని కోసం ల్యాండ్ ఫూలింగ్ విధానంలో 33 వేల ఎక‌రాల‌ను రైతుల నుంచి సేక‌రించారు. 22 అక్టోబర్ 2015న రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాన మంత్రి మోదీ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి కృష్ణా జిల్లాలోని ఉద్దండరాయునిపాలెంలో ఆయన భూమి పూజ చేశారు. ఒకవైపు రాజధాని నిర్మాణ పనులు జరుగుతుండగా.. తాజాగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. రాజధాని మార్పుపై చర్చలేవనెత్తింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై అధ్యయనం చేయడానికి 2019 సెప్టెంబర్ 13న వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ జి.నాగేశ్వరరావు (జీఎన్ రావు) కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీ డిసెంబర్ 20న కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందించింది.

125 పేజీలతో కూడిన ఈ నివేదికలో అమరావతిలో శాసన రాజధాని (లెజిస్లేటివ్ క్యాపిటల్), విశాఖలో పరిపాలన రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో న్యాయ రాజధాని (జ్యుడీషియల్ క్యాపిటల్) ఏర్పాటు చేయాలని సూచించింది. నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. బోస్టన్ గ్రూప్ కూడా ఇదే తరహా నివేదిక ఇచ్చింది. అయితే, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం అంశాలపై జీఎన్ రావు కమిటీ, బోస్టస్ గ్రూప్ ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు అయిన హైలెవల్ కమిటీ కూడా తన నివేదికను దాదాపుగా సిద్ధం చేసింది. ఈ నెల 20న జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చించి.. అనంతరం దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

This post was last modified on January 18, 2020 5:13 pm

Mahesh

Recent Posts

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

Nuvvu Nenu Prema:అరవింద గుడిలో పద్మావతి చెప్పిన మాటలు విని ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ కోసం వెతుకుతుంది కొంతసేపటికి ఇంట్లో… Read More

May 21, 2024

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

కీల‌క‌మైన ఏపీ ఎన్నిక‌ల్లో ఏయే అంశాలు ప‌నిచేశాయి? ఏయే అంశాలు ప్ర‌ధాన పాత్ర పోషించాయి? ఎవ‌రి మాట‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సించారు?… Read More

May 21, 2024

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

Krishna Mukunda Murari:ముకుందా తను అబార్షన్ చేయించుకున్నానని కృష్ణ మురారిలకు చెప్పడంతో కధ కొత్త మలుపు తిరుగుతుంది. కృష్ణ మురారి… Read More

May 21, 2024

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

వైసీపీ తాజా ఎన్నిక‌ల్లో ఎవ‌రిపై ఎక్కువ‌గా ఆధార‌ప‌డిందంటే.. ఎలాంటి అనుమానం లేకుండా.. వ‌లంటీ ర్లు, గృహ‌సార‌థుల‌పైనే ఆధార‌ప‌డింద‌నే మాట వినిపిస్తుంది.… Read More

May 21, 2024

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

ఏపీ సీఎం జ‌గ‌న్ లెక్కే వేరుగా ఉంటుంది. ఆయ‌న చాలా వ్యూహాత్మ‌కంగా మాట్లాడ‌తార‌నే పేరుంది. మీడి యా ముందుకు ఒకే… Read More

May 21, 2024

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

ఎన్నిక‌ల‌కు ముందు ఆ నియోజ‌క‌వ‌ర్గం గ‌రం గ‌రం. ఇక్క‌డ ఓటింగ్ హోరా హోరీగా జ‌రుగుతుంద‌ని అనుకున్న‌ట్టే జ‌రిగింది. పైగా.. భిన్న‌మైన… Read More

May 21, 2024

May 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 21: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 21: Daily Horoscope in Telugu మే 21 – వైశాఖ మాసం – మంగళవారం- రోజు వారి… Read More

May 21, 2024

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

Trivikram Ram: తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో త్రివిక్రమ్ పేరు ఒకప్పుడు వినబడేది. కానీ "గుంటూరు కారం"… Read More

May 20, 2024

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

Lok Sabha Elections: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల ఐదో… Read More

May 20, 2024

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి గా జయ… Read More

May 20, 2024

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకుపైగా కొనసాగిన… Read More

May 20, 2024

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More

May 20, 2024

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More

May 20, 2024

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More

May 20, 2024

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More

May 20, 2024