హైకోర్టు తీర్పు యొక్క హైలెట్స్ ను టీవీలు బ్రేకింగ్ న్యూస్ గా వేయగానే నిమ్మగడ్డ లో అత్యుత్సాహం కట్టలు తెంచుకుంది. కోర్టు తీర్పులకు సంబంధించి మామూలుగా టీవీల్లో పూర్తిగా చూపించరు. వారికి కావలసిన బ్రేకింగ్ పాయింట్స్ జనాలను ఆకర్షించేందుకు వేసుకొని అసలైన విషయాన్ని వివరించరు. అంతేకాకుండా అందరికన్నా ముందుగా తామే ఈ న్యూస్ జనాలకు చేరవేయాలని ప్రతి రిపోర్టర్ ఉన్న విషయాన్ని తమకు నచ్చిన రీతిలో అర్థం చేసుకుని చెప్పేస్తుంటారు.
సరే అసలు ఈ గొడవంతా ఎందుకు అంటే…. అసలు జడ్జి తన తీర్పులో ఏమి చెప్పారు అన్న విషయం కాపీ బయటకు వస్తే కానీ తెలియని పరిస్థితిలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ పదవి కాలం తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసిందని బ్రేకింగ్ న్యూస్ రూపంలో వచ్చిన వెంటనే నిమ్మగడ్డ హుటాహుటిన ఎన్నికల కమిషన్ కార్యదర్శి కి ఫోన్ చేసి హైదరాబాద్ లోని తన నివాసానికి వాహనాలను పంపమన్నారు.
ఇంకా అక్కడితో ఆగాడా…? కోర్టు తీర్పు ప్రకారం తానే కమిషనర్ గా వస్తున్నట్లు జిల్లాలో అన్నింటికీ సర్కులర్ పంపమని ఆదేశించి పనిలో పనిగా తాను బాధ్యతలోకి దిగి పోయినట్లు కూడా ప్రెస్ మీట్ పెట్టేశారు. అంతేకాకుండా స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ ప్రభాకర్ ను రాజీనామా చేయమని ఆదేశించి…. అతనికి కొద్ది వ్యవధి కూడా ఇచ్చే అవకాశం లేదని హూంకరించాడు. ఇక ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ గా నియమితులైన కనకరాజు వెంటనే తప్పుకోవాలని హుకుం జారీ చేసిన ఆయన పైన తతంగం అంతా పూర్తి చేసేసరికి సాయంత్రం అయింది. ఈ లోపల సాయంత్రం హైకోర్టు నుండి తీర్పు కాపీ వచ్చింది. అడ్వకేట్ జనరల్ శ్రీరాం దానిని మీడియా వారి ముందు పెట్టిన తర్వాత కానీ నిమ్మగడ్డకు అసలు విషయం బోధపడలేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని చెబుతూ అవసరమైన ఏర్పాట్లు చేయమని కోర్టు చెప్పింది కానీ అందుకు ప్రభుత్వానికి ఎటువంటి గడువు విధించలేదు. అదే సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయమై హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో మళ్లీ కౌంటర్ పిటీషన్ వేసుకోవచ్చు అని కూడా స్పష్టం చేసింది. కోర్టు వారు ఎటువంటి గడువు ఇవ్వలేదు కాబట్టి మిన్నగడ్డను పదవిలో నియమించేందుకు రెండు నెలల వ్యవధి ప్రభుత్వానికి ఇంకా ఉందని జస్ట్ శ్రీరామ్ వివరించారు.
హై కోర్పు తీర్పుపై తాము సుప్రింకోర్టులో పిటీషన్ వేయబోతున్నట్లు చెప్పగానే నిమ్మగడ్డతో పాటు చంద్రబాబు అండ్ కో మొత్తం అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. హై కోర్టులో కేసు ఓడిపోతే సుప్రింకోర్టుకు వెళ్ళటం మామూలే కదా ? అంతెందుకు హైకోర్టులో నిమ్మగడ్డే ఓడిపోయుంటే సుప్రింకోర్టుకు వెళ్ళేవాడు కాదా ? ఇంత చిన్న లాజిక్ కూడా మిస్సయిన నిమ్మగడ్డ ఇపుడు గోల ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావటం లేదు. మరో వైపు జగన్ మాత్రం నిమ్మగడ్డ చూపిన అత్యుత్సహంతో ఇప్పుడు పవర్ అంతా తన చేతుల్లో ఉందని గ్రహించి సుప్రీం కోర్టుకు మరింత ఉత్సాహంతో వెళుతున్నాడు.
This post was last modified on June 2, 2020 2:02 pm
Nagarjuna: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'కుబేర' సినిమా నుంచి అక్కినేని నాగార్జున ఫస్ట్ లుక్ విడుదలైంది. తమిళ హీరో… Read More
Guppedanta Manasu May 2 2024 Episode 1064: మహేంద్ర అనుపమ వసుధార ఒక లాయర్ ని తీసుకుని మను… Read More
Mamagaru May 2 2024 Episode 200: హోల్సేల్ గా ఎంతకు అమ్ముతావో చెప్పు కొంటాను అని చంగయ్య అంటాడు.… Read More
Jagadhatri May 2 2024 Episode 220: దేవా జగదాత్రి వాళ్ళని షూట్ చేస్తాడు. జగదాత్రి కేదార్ దాక్కుంటారు. ఉన్నక్కా… Read More
YSRCP: రాజధాని ప్రాంతంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎన్నికల వేళ మరో కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు. పల్నాడు… Read More
Naga Panchami: జ్వాలా వాళ్ళ ఇంట్లోకి చేరుకున్న గరుడ రాజు నిద్రిస్తున్న జ్వాలా గర్భంలోకి సూక్ష్మ రూపంగా మారి ప్రవేశిస్తాడు.తెల్లవారింది… Read More
Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: కరుణ బలవంతంగా అమరేంద్ర గదిలోకి భాగమతిని నెట్టేస్తుంది. సారీ… Read More
Malli Nindu Jabili May 2 2024 Episode 637: ఆ టాబ్లెట్లు మార్చింది నేను వాడిని అడిగితే వాడికి… Read More
Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ మనం ఇలా మళ్లీ కలుస్తామని నేను అసలు అనుకోలేదు చాలా… Read More
AP Elections 2024: జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కేసులో కూటమికి హైకోర్టులో ఊరట లభించలేదు. జనసేనకు కేటాయించిన… Read More
Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: అభి చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది మంగమ్మ కేసు పెడితే… Read More
Trinayani May 2 2024 Episode 1229: అసలు నీడ వచ్చిందని సీసీ కెమెరాలు చూద్దామంటే సీసీ కెమెరాలు సాయంత్రం… Read More
OTT: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమాలలో మంజుమ్మల్ బాయ్స్ కూడా… Read More
Happy Ending OTT: యశ్ పురి, అపూర్వ రావ్ హీరో మరియు హీరోయిన్గా నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం… Read More
Aha OTT: అభినవ్, గోమట్టం టైటిల్ పాత్రలో నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటిటిలో రికార్డు వ్యూస్ సాధిస్తుంది.… Read More