Aha OTT: అభినవ్, గోమట్టం టైటిల్ పాత్రలో నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటిటిలో రికార్డు వ్యూస్ సాధిస్తుంది. ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ కామెడీ చిత్రంలో శాలిని కొండేపూడి హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంఖీధర్, శశాంక్ కీలక పాత్రలు పోషించారు. మై డియర్ దొంగ చిత్రానికి బిఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించారు. థియేటర్లను షేర్ చేస్తూ ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా విడుదల వారం దాటిన ఆహా ఓటీటీలో టాప్ ఫైవ్ ట్రెండింగ్ లిస్టులో నుంచి మాత్రం వెళ్లడం లేదు.
ఈ సందర్భంగా బుధవారం మై డియర్ దొంగ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ కమ్ రైటర్ షాలిని మాట్లాడుతూ.. మై డియర్ దొంగ మూవీ కి వస్తున్న రివ్యూలు మరియు రెస్పాన్స్ చాలా అందాన్ని కలిగిస్తున్నాయి. ఎంత గొప్ప రెస్పాన్స్ ఊహించలేదు. మంచి కంటెంట్ నమ్మి హానెస్ట్ గా సినిమా చేస్తే విజయం తప్పకుండా వస్తుందా అని మై డియర్ దొంగ నిరూపించింది. నేను రాసిన కథని దర్శకుడు గొప్పగా అర్థం చేసుకుని మరియు గొప్పగా స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. అందరికీ రికమెండ్ చేసే చిత్రం ఇది. యూత్ నుంచి ఫ్యామిలీస్ వరకు ప్రతి ఒక్కరు మూవీని ఎంజాయ్ చేస్తారు... అంటూ తెలిపింది.
నిర్మాత మహేందర్ రెడ్డి కూడా మాట్లాడుతూ.. మై డియర్ దొంగ విజయం పై మొదటి నుంచి చాలా నమ్మకంగా ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. అభినవ్ గోమట్టం కామెడీని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు.. అని తెలిపారు. ఇక ఆ తరువాత అభినవ్ మాట్లాడుతూ.. చిన్న సినిమాకు ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించారు. తొలి సినిమాతోనే రైటర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకుంది షాలిని. గొప్ప ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ కు మా సినిమా నచ్చడం ఆనందంగా ఉంది.. అంటూ తెలిపాడు. ఏక వరుసగా ఈ మధ్యకాలంలో అభినవ గోమట్టం నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతున్న సంగతి తెలిసిందే.
సేవ్ ది టైగర్స్ వంటి సినిమాలు తో ప్రేక్షకుల ముందుకి వస్తూ మంచి విజయాలని తన ఖాతాలో వేసుకుంటున్నాడు అభినవ గోమట్టం. ఇటీవల సేవ్ ది టైగర్స్ 2 సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అభినవ్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మస్తు షేడ్స్ ఉన్నాయి రా మూవీ కూడా అభినవ్‌కి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలా 2023 నుంచి 2024 వరకు అభినవ్ గోమట్టం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఇరగదీస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకెన్ని విజయాలు అందుకుంటాడో చూడాలి మరి. మొత్తానికి అయితే ప్రస్తుతం రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది మై డియర్ దొంగ మూవీ. ఈ మూవీ మరికొన్ని రోజులు ఇలానే కొనసాగితే టాలీవుడ్ బడా హీరోల సినిమాలని కూడా తలదన్నుతుందని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.