Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

Published by
bharani jella

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: విక్కీ పద్మావతి పెళ్లి రోజుకి, రాజ్ కావ్య ఇద్దరు వస్తారు. కావ్య పద్దు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి సంగతులు అని అడుగుతుంది కావ్య. నువ్వే చెప్పాలి అని అంటుంది పద్దు. ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్ అని అడుగుతుంది పద్దు మ్యారేజ్ లైఫ్ కి ఏం సూపర్ గా ఉంది అని అంటుంది కావ్య. ఏ ఆడపిల్ల అయినా ఎలాంటి భర్త కావాలనుకుంటుందో అలాంటి వార్త వచ్చింది నాకు అని అంటుంది కావ్య. బావగారు నేను ఎలా చూసుకుంటున్నారు అని అడుగుతుంది పద్దు. నా మనసులో ఏముందో ముందే తెలుసుకొని అది చేసేస్తారు, ఇలా చూసుకోవాలని ప్రతి అమ్మాయి అనుకునే అంత బాగా చూసుకుంటారు అని అంటుంది కావ్య. అబద్దాలు బాగా చెప్తున్నావ్ కావ్య అని అంటుంది పద్దు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా అని అంటుంది. పెద్దవాళ్లకంటే అర్థం కాకపోవచ్చు నేను నీ ఏజ్ అమ్మాయినే కదా నాకు నువ్వు చెప్పే అబద్ధం అర్థం అవుతుంది కదా అని అంటుంది పద్దు. నీకు బావగారికి మధ్య ఉన్న దూరం, బాగా దగ్గరైనట్టు అనిపించింది అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 30 2024 Episode 611 highlights

ఇక మరోవైపు విక్కీని రాజ్ పక్కకు తీసుకొస్తాడు. ఏంటి బ్రో ఇక్కడికి తీసుకొచ్చావు అని విక్కీ అడిగితే నిజం తెలుసుకోవడానికి అంటాడు. నిజం బ్రో ఇవాళ మా పెళ్లి రోజే అని అంటే అయితే నువ్వు పద్మావతిని ఇంకా సరిగా అర్థం చేసుకోవట్లేదా అని అడుగుతాడు. నిన్నటిదాకా అలానే అనుకున్నాను, నేనే తనని అపార్థం చేసుకున్నాను కానీ తను నాపై ప్రాణం కూడా ఇచ్చే అంత ప్రేమ ఉందని తెలిసిన తరువాత, తను నా భార్య అయినందుకు ఆనందంగానూ చాలా గర్వంగానే ఉంది. అని అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావ్ అని అడుగుతాడు విక్కీ. నీ మాటలు చెప్పే ఆనందాన్ని నీ ముఖంలో కనిపించట్లేదు అని అంటాడు రాజ్. నీకు అందరిలో ఉన్న ఏదో తెలియని బాధ నీ ఫేస్ లో కనిపిస్తుంది అని అంటాడు రాజ్. చెప్పు బ్రో, ఏమైంది? ఎందుకు నువ్వు అలా ఉన్నావు అని అడుగుతాడు.

Nuvvu Nenu Prema Today Episode April 30 2024 Episode 611 highlights

నథింగ్ బ్రో అని అంటాడు విక్కీ నాతో కూడా చెప్పవా అని అంటాడు రాజ్. అంతేలే బ్రో పిలిచిన వెంటనే వచ్చాను కదా అందుకే నీకు చులకన అని అంటాడు రాజ్. అందుకే అడిగినా చెప్పకుండా నన్ను పక్కన పెడుతున్నావ్ కదా సరేలే అని అంటాడు. నువ్వు నా బ్రదర్ వే కాదు, బెస్ట్ ఫ్రెండ్ వి కూడా అని అంటాడు. అయితే నాకు నిజం చెప్పు అని అంటాడు. ఇక మరోవైపు కావ్య కూడాపద్దుకి నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అనుకోకుండా మా మధ్య దూరం పెరిగిపోయింది మొదటి నుంచి మా మధ్య ప్రేమగా పలకరింపుల కంటే గిలి కజ్జాలు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు మా మధ్యలోకి ఒక బాబు వచ్చాడు అని అంటుంది కావ్య. ఎవరు అని నిలదీస్తే, రాజ్ నుండి వచ్చిన సమాధానం ఆ బాబు తన కన్న కొడుకుని ఏం మాట్లాడుతున్నావ్ కావ్య అని అంటుంది పద్దు అవును పద్దు ఇది నిజమే అని అంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటుంది పద్దు. బావగారు అలాంటివాళ్లు కాదు ఎక్కడ ఏదో తప్పు జరిగింది అని అంటుంది పద్దు. ఆ బాబు బావ గారి కొడుకు అంటే నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతుంది.

Nuvvu Nenu Prema Today Episode April 30 2024 Episode 611 highlights

ఇక మరోవైపు విక్కీ నిజం చెప్పమని రాజ్ బలవంతం చేస్తాడు. ఎలా చెప్పాలో తెలియట్లేదు అంటే ఎలాగైనా పర్వాలేదు నిజం మాత్రం చెప్పు అంటాడు రాజ్. అక్కడ డేంజర్ లో ఉందిరా అని చెప్తాడు విక్కీ. అక్కడెంజరులో ఉండడమేంట్రా అని అంటాడు రాజ్. నువ్వేమో అక్కడ డేంజర్ లో ఉంది అంటున్నావు బక్క బాబా ఇద్దరు ఫంక్షన్ లో కనిపించట్లేదు ఏమైంది నిజం చెప్పు అంటాడు. అందరూ అనుకుంటున్నట్టు మా బావ మంచివాడు కాదు రాక్షసుడు. అసలు పద్మావతిని నేను అపార్థం చేసుకోవడానికి తన నుంచి విడిపోవాలని కారణం మా భావే అని చెప్పేసరికి రాజ్ ఏమీ అర్థం కాదు ఇక మరోవైపు కావ్య పద్దుతో చెప్తూ ఉంటుంది. మొదట్లో రాజ్ మీద నాకు చాలా నమ్మకం ఉండేది. ఆయన ప్రేమ కోపం నాకు తెలుసు, ఆయన ఏ తప్పు చేయలేదు. కానీ సమాజంలో తప్పు చేసిన వాడిలా మిగిలిపోతున్నాడు ఆ బాబు ఎవరు అనేది ఎన్నిసార్లు అడిగినా గోల చేసిన, తన బిడ్డ అని అబద్ధం చెబుతున్నారు అదే నాకు బాధని కోపాన్ని తెప్పిస్తున్నాయి అని అంటుంది. బాధపడకు కావ్య ఇంటి జరిగిన నువ్వు బావగారిని అనుమానించట్లేదు చూడు ఇది చాలు మీ ఇద్దరు త్వరలో ఒకటవతారం చెప్పడానికి అని అంటుంది పద్దు.

Nuvvu Nenu Prema Today Episode April 30 2024 Episode 611 highlights

ఏదో బలమైన కారణం ఉండబట్టే బావగారి ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది. మరోవైపు విక్కీ నా తప్పు నేను తెలుసుకొని నేను పద్మావతి తో కలిసి పోతానని నన్ను చంపడానికి కూడా వెనకాలేదు ఆ రాస్కెల్ అని అంటాడు. కానీ పద్మావతి తన ప్రాణానికి తెగించి మరీ నన్ను కాపాడింది అని అంటారు. ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు రాజ్. సమస్యలన్నీ తొలగిపోయి అందరం సంతోషంగా ఉండాలి అని అనుకునే టైమ్ కి, ఆ రాస్కెల్ నేనే వాని ఏమైనా చేస్తానని, అక్కని ఎవరికి చెప్పకుండా ఎక్కడ దూరంగా తీసుకెళ్లి అక్కని దాచి పెట్టాడు అని అంటాడు. నువ్వు చెప్పింది నిజమేనా అంటే నిజమే కానీ ఇంట్లో ఎవరికీ తెలీదు అని అంటాడు. ఈ విషయం తెలిస్తే నేనే తట్టుకోలేకపోయాను ఇక ఇంట్లో వాళ్ళు ఎలా తట్టుకుంటారు అని అంటాడు. పోనీ అక్కకి వాడి గురించి నిజం తెలుసు అంటే తెలీదు అని అంటాడు. అక్క ఇంకా పని చేయడానికి కొలుస్తుంది అని అంటాడు. అక్కకి ఒకసారి ఫోన్ చెయ్ వాడు ఎక్కడుందో కనుక్కుందాం అని అంటే అక్కకి ఏ కమ్యూనికేషన్ లేకుండా చేసాడు వాడు తెలివిగా అని అంటాడు విక్కీ.

Nuvvu Nenu Prema Today Episode April 30 2024 Episode 611 highlights

ఇక మరోవైపు పద్దు, మా మధ్య కూడా ఇలాంటివి చాలా జరిగాయి కాకపోతే చివరికి ఇలా ఇంత సంతోషంగా ఉన్నాం అని అంటుంది. ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు అంటుంది పద్దు. నువ్వు ఏదో ప్రాబ్లం లో ఉంటావులే అని చెప్పలేదు ఇంతకీ మీ లైఫ్ బాగుంది కదా అని అడుగుతుంది. అన్ని క్లియర్ అయినట్టే కావ్యా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటుంది. ఆల్మోస్ట్ మేము విడిపోతామేమో అని అనుకునే టయానికి, ఆ శ్రీనివాసం దయ వల్ల ఒకరినొకరు అర్థం చేసుకుని ఇప్పుడు నా అసలైన జీవితాన్ని మొదలవుతుంది అనిపిస్తుంది. అంటే నీ ప్రేమకు ఇది పునర్జన్మ లాంటిది అంటావు అని అంటుంది కావ్య. ఒక రకంగా అలాంటిదే అని అంటుంది పద్దు. అపార్ధాలతో జరిగిన మీ పెళ్లి ఇప్పుడు ఆనందంగా మారబోతుందన్నమాట అని అంటుంది కావ్య. ఇది నీకు అసలైన పెళ్లి రోజు అని అంటుంది. నాలాగే మీ ఇద్దరు కూడా త్వరలో ఒకటవ్వాలని నేను కోరుకుంటున్నాను అంటుంది పద్దు. ఇక మరోవైపు విక్కీ మా అక్కకి తెలియకుండా మురళి గాడుహౌస్ అరెస్ట్ చేశాడు అని చెప్తాడు.నేను హ్యాపీగా ఉన్న ఈ మూమెంట్లో తన నాతో లేకుండా పోయిందని బాధపడతాడు. తను ఎక్కడుందని వాడిని అంత అడిగినా వాడు చెప్పట్లేదు. తన అసలే కడుపుతో ఉంది ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది అని అంటే అక్కకి ఏమీ కాదు బ్రో, నువ్వు ఏమైనా చేస్తావని భయంతోనే అలా వాడు తీసుకెళ్లి ఉంటాడు అంతేగాని ఏ హాని తలపెట్టడు అని అంటాడు. అక్క వస్తేనే అసలైన ఆనందం అని అంటాడు. ఆ నీచుడు ఎక్కడ దాచి పెట్టింది చెప్పట్లేదు అని అంటాడు. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళకి నేను మాట్లాడి అక్క ఎక్కడున్నా తెలిసేలా చేస్తాను అని అంటాడు రాజ్. సంతోషంలో కాదు కష్టాల్లో కూడా మనందరం ఒకటే అర్థమైంది కదా అని అంటాడు రాజ్. థాంక్స్ రా అని అంటాడు విక్కీ.

ఇక మరోవైపు అరవింద రెడీ అవుతూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. నీకు సైట్ వేస్తున్నాను రానమ్మ అని అంటే ఏంటండీ ఆ మాటలు అంటుంది. మనకి పెళ్లి చాలా ఏళ్లయింది రేపు మా పో మనకి పాప కూడా పట్టబోతుంది. ఇప్పుడు మీరు సైట్ వేస్తున్నారా అని అంటుంది. నీ మీద ప్రేమ మరీ పెరిగిపోతుంది అందుకని అని అంటాడు. నీ ప్రేమ నా మీదనా పుట్టబోయే బిడ్డ మీదనా అని అంటే, ఏదైనా నీ తరువాతే రానమ్మ అని అంటాడు. పుట్టింటికి అనగానే ముఖం వెలిగిపోతుంది అని అంటాడు కృష్ణ. అందరూ ఆడపిల్లలకి ఇంతే అండి ఎన్ని బంగ్లాలు ఉన్నా ఎంత డబ్బున్న పుట్టిల్లు అంటే చాలు అందరూ ఇలానే హ్యాపీగా ఫీల్ అవుతారు కాదని మీరు అంటారా అని అంటే చంపేస్తాను అని అంటాడు కృష్ణ ఆ మాటకి ఒక్కసారిగా అరవింద షాక్ అవుతుంది . ఎవరైనా తప్పు అని అంటే వాళ్ళని చంపేస్తాను అని అంటాడు కృష్ణ. నువ్వెక్కడున్నా ఆనందంగా ఉండడమే నాకు కావాలి రానమ్మ అని అంటాడు. నేను దూరంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావని తెలిస్తే నేను దూరం అవ్వడానికి కూడా సిద్ధమే అని అంటాడు. నా ప్రాణాలైనా నీకోసం ఇచ్చేస్తాను అని అంటాడు. మీరు నాకు దూరం అవ్వడం ఏంటండీ? అయినా ఈ మాటలు ఏంటి అని అంటుంది అరవింద. మీరు నా ప్రాణం నేను చనిపోయిన తర్వాతే మిమ్మల్ని నన్ను వేరు చేయగలరు. ఇదేనే నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నేను ఏ స్టెప్ అయినా వేయాలంటే నువ్వు నన్ను గుడ్డిగా నమ్మితేనే కదా అని అనుకుంటాడు మనసులో, ఏంటండీ అలా చూస్తున్నారు అని అంటే నువ్వు భార్యగా దొరకడం నా అదృష్టం అని అంటాడు. మీరు చూపించే ప్రేమలో నా ప్రేమ ఎంత అని అంటే, ఇక సరే రెడీ అవ్వు బయలుదేరుదాం అని అంటాడు. అయినా అంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంటే నాకు చెప్పకుండా మీకు మాత్రమే విక్కి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని అడుగుతుంది. దీనికి అనుమానం వచ్చింది అని మనసులో అనుకుంటాడు. ఫంక్షన్ కి అందర్నీ ఇన్వైట్ చేయడంలో కొంచెం బిజీగా ఉన్నారు లే రానమ్మ అని అంటాడు. మీ తమ్ముడు నీకు చెప్తేనే ఫంక్షన్ కి వస్తావా ఏంటి అని అంటాడు. అబ్బాయిలు పెళ్లయిన తర్వాత మారిపోతారు రానమ్మ, ఇంట్లో వాళ్లతో పాటు భార్య కూడా ప్రేమ పంచాలి కదా ఆ సిచువేషన్ లో మర్చిపోయి ఉంటాడులే అని అంటాడు. మావికి అలాంటివాడు కాదు వాడికి అక్కంటే ప్రాణం అని అంటుంది అరవింద. అసలు సిసలు ఆట నేను ఈరోజు ఆడబోతున్నాను. ఆటలు ఆట బొమ్మవి నువ్వే కాబోతున్నావ్, ఇదంతా తెలియక గొర్రె కసాయి వాడి నమ్మినట్టు నువ్వు నన్ను నమ్ముతున్నావు అని అనుకుంటాడు.

ఇక మరోవైపు పార్టీలో రాజ్ మాట్లాడుతూ ఉంటాడు. తల్లి బిడ్డలది ఒక బంధం అయితే తోడబుట్టిన వాళ్లది ఒక బంధం అన్ని బంధాల కన్నా భార్యాభర్తల బంధమే విలువైనది అని అంటాడు. ఆ మాట చేతలలో చూపిస్తే బాగుంటుంది అని అంటుంది కావ్య. భార్య భర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని రాజ్ అంటాడు. మైకు పట్టుకుని అందరికీ సలహాలు ఇచ్చే వాళ్ళు తప్ప, వాళ్ళని పాటించే వాళ్లే లేరు అని అంటుంది కావ్య. నిజం చెప్పకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇలానే ఉంటుంది అని అంటుంది కావ్య. బాబు గురించి ఎందుకు నిజం చెప్పట్లేదు అని అడుగుతుంది కావ్య. అదిగో వీళ్ళు మళ్ళీ బాబు గురించి మాట్లాడుతున్నాడు. అసలు బాబు ఎవరి బాబు అని అడుగుతుంది కుచల. ఈ హ్యాపీ మూమెంట్లో మన ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల అబద్దాలు కూడా ఆడకూడదు అని అడుగుతుంది కావ్య. నా చేత నిజం చెప్పించాలని కంకణం కట్టుకున్నట్టు ఉంది అనిఅనుకుంటాడు రాజ్.ఏంటి బావగారు మా కావ్య అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు అని అంటే,బ్రహ్మముడితో ఒకటైన దంపతులు వాళ్ళు, కళతలు లేని వాళ్లకు కాపురాన్ని మించిన సమాధానం ఏముంటుంది అని అంటాడు విక్కీ. ఓకే ఓకే ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం అని అంటాడు రాజ్. మూడుముళ్ల తోటి ఏడు అడుగుల తో ఏర్పడిన అను ఆర్యాల వైవాహిక జీవితం, ఈరోజు తో మొదటి వసంతం పూర్తిచేసుకుని రెండవ వసంతంలోకి అడుగుపెడుతుంది. సో మనం ముందుగా ఆర్య అనులని స్టేజి మీదకి పిలుద్దాం అని అంటాడు. వెంటనే కోటీశ్వరుడైన అల్లుడు దొరికారని తెగ సంబరపడిపోతున్నారు అని అంటుంది కుచల. నేనేం అనలేదు కదా అని అంటుంది నారాయణ వైపు తిరిగి. ఏమీ అనకపోవడం ఏంటి మనసులో అనుకోవాల్సింది పైకే అన్నావు కదా అని అంటాడు నారాయణ. క్లాస్ పీకకు క్లాప్స్ కొట్టు అని అంటుంది కుచల. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు అని అంటాడు రాజ్. మీ మ్యారేజ్ అయిన ఇవన్నీ ఇయర్లో మీ ఇద్దరి మధ్య ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి నేను ఒక టెస్ట్ పెడతాను అని అంటాడు రాజ్. ఇంతకీ ఏంటా టెస్ట్ అని అడుగుతాడు ఆర్య. ఇద్దరికీ రెండు పేపర్స్ పెన్ను ఇస్తాడు. నీకు ఇచ్చిన పేపర్లో మీ లైఫ్ పాట్నర్ కి ఏ కలర్ ఇష్టమో మీరు రాయండి అని అంటాడు. నెక్స్ట్ మీ లైఫ్ పార్టనర్ కి ఏ ఫ్లవర్ అంటే ఇష్టమో రాయండి. ఇది వాళ్ళ ప్రేమకు పరీక్ష మీరు రాయండి అని అంటారు కావ్య వాళ్ళు, ఆర్య అను ఇద్దరు రాస్తూ ఉంటారు.ఇష్టమైన ఫుడ్ గురించి రాయండి. ఇక రాయడం అయిపోయింది ఇటు ఇవ్వండి అని తీసుకుంటారు. ఆర్యా కి ఇష్టమైనవి అను రాల్సింది అనుకి ఇష్టమైనవి ఆర్య రాశాడు అని అంటారు కావ్య. ఇద్దరు వాళ్ళకి పెట్టిన దాంట్లో ఫెయిల్ అయ్యారు అని చదువుతూ ఉంటాడు. ఆర్య కిష్టమైన కలరు అనుకిష్టమైన కలర్ వేర్వేరుగా రాశారు. ఫుడ్ కూడా అలానే రాశారు ఫ్లవర్ కూడా అలానే రాశారు. ఇక అందరూ, ఆర్యవాలు తప్పుగా రాసినందుకు ఫీలవుతూ ఉంటారు. ఇదేంటి బ్రో మీరిద్దరూ ఎందులోనూ మ్యాచ్ అవ్వలేదు ఈ సంవత్సరం నుంచి ఎలా ఉంటున్నారు అని అడుగుతాడు రాజ్.అవసరాన్ని బట్టి మారే అభిరుచులు అవసరం లేదు అని అంటుంది కావ్య. ఇక రాజ్ పోలీసులకి ఫోన్ చేసి, నాకు మీరు ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతాడు. ఏంటో చెప్పండి అని పోలీసులు అడిగితే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క నాకు సిస్టర్ తో సమానం తను ఎక్కడుందో మీరు కనుక్కోవాలి అని చెప్తాడు అప్పుడే దివ్య కూడా వింటుంది. దివ్య షాక్ అవుతుంది ఇదేంటి పోలీసులకు ఫోన్ చేశాడు రాజ్ అని అనుకుంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

bharani jella

Recent Posts

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024