Nuvvu Nenu Prema: కృష్ణ నిజస్వరూపం తెలిసిన ఆర్య ఏం చేయనున్నాడు? పద్మావతి చేసిన పనికి ఆశ్చర్యపోయిన విక్కీ?

Published by
bharani jella

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కి, దాంపత్యవ్రతం చేస్తూ ఉంటారు. ఆ వ్రతాన్ని చెడగొట్టడానికి కృష్ణ పద్మావతికి గాయం అయ్యేలా చేస్తాడు. అయినా ఎక్కడ వ్రతం ఆగకుండా, పద్మావతి వాళ్లు చేస్తారు. కృష్ణ మీద ఆర్యకి అనుమానం వస్తుంది. కుచల పద్మావతి వాళ్లు మాత్రమే వ్రతం ఎందుకు చేస్తున్నారు ఆర్య వాళ్ళు ఎందుకు చేయట్లేదని చిలకమ్మ ద్వారా నిజం రాబట్టాలనుకుంటుంది. కానీ ఆండాలు అందుకు అడ్డుపడి, కుశలకు సరైన సమాధానం చెబుతుంది. దాంపత్య వ్రతంలో రెండు కార్యక్రమాలు జరిగి మూడవ కార్యక్రమం చివరి కార్యక్రమంలోనికి ఈరోజు విక్కీ పద్మావతి చేయనున్నారు.

Nuvvu Nenu Prema Today Episode December 07 2023 Episode 487 Highlights

ఈరోజు ఎపిసోడ్ లో, పంతులుగారు మీరు బట్టలు మార్చుకొని వచ్చి ఈ శివపార్వతుల కళ్యాణం జరిపిస్తే, మీకు అంతా మంచే జరుగుతుంది మీ దంపతులు ఇరువురు ఈ కళ్యాణాన్ని, ఏ విజ్ఞాలు లేకుండా జరిపి దాంపత్య వ్రతం సంపూర్ణం చేయండి అని అంటారు. పద్మావతి విక్కీ ఇద్దరు, కొత్త బట్టలు కట్టుకొని పూజ చేయడానికి వస్తారు. మనసులో ఏమైనా అనుమానాలు ఉంటే అవన్నీ పక్కనపెట్టి మీరు శ్రద్ధగా పూజ చేయండి అని పంతులుగారు అంటారు. విక్కీ పద్మావతి తో పాటు ఇంట్లో అందరూ కూడా పూజలు కూర్చుంటారు. కృష్ణ ఫోన్ వచ్చిందని బయటికి వెళ్తాడు.

Brahmamudi December 06 Episode 272: కళ్యాణ్ పెళ్లి క్యాన్సిల్.. కనకం ప్లాన్ సక్సెస్.. కావ్యతో రాజ్ హనీమూన్..?

Nuvvu Nenu Prema Today Episode December 07 2023 Episode 487 Highlights

పద్మావతి సౌభాగ్యం..

ఇక పంతులుగారు పూజ జరిపిస్తూ విక్కీని కుంకుమ తీసి పద్మావతి నుదుటిన పెట్టమని చెప్తారు. విక్కీ అందుకు ఒప్పుకోక అలానే ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతసేపటికి విక్కి, జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసుకుంటూ పద్మావతి చేసిన గాయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కుంకుమ పెట్టకుండా చూస్తూ ఉంటాడు. అరవింద విక్కీ పంతులుగారు చెప్పారు కదా కుంకుమ పెట్టు అని అంటుంది. కానీ విక్కీ ఆలోచిస్తూనే ఉంటాడు ఆండాలు అందరూ చెప్తారు. అయినా విక్కీ మనసు మారదు ఇక పార్వతి బాబు నువ్వు చేసే, ఈ పూజ వల్ల పద్మావతి నువ్వు ఇద్దరు సంతోషంగా ఉంటారు. భర్త పెట్టే కుంకుమతోనే భార్య సౌభాగ్యం ఆధారపడి ఉంటుంది. ఆ నిండు మనసుతో పద్మావతి నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండేలాగా, మీరు మనసులో అనుకొని పద్మావతికి కుంకుమ పెట్టండి తను కూడా సంతోషిస్తుంది పద్మావతి సౌభాగ్యం ఎప్పుడు అలానే ఉంటుంది. అని పార్వతి చెప్పగానే విక్కీ, పద్మావతి వైపు చూస్తాడు. ఇక అందరూ బాధపడతారని అనుకొని, అరవింద వైపు కూడా చూసి అక్కని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అనుకొని, కుంకుమ పద్మావతి నుదుటిన పెడతాడు పద్మావతి చాలా సంతోషిస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode December 07 2023 Episode 487 Highlights

కృష్ణ మాటలు విన్న ఆర్యా..

ఇక కృష్ణ ఫోన్ వచ్చిందని మాట్లాడుకుంటూ బయటికి వెళ్తాడు వెనకాలే ఆర్య కూడా, వెళ్తాడు అప్పటికి ఆర్య కి కృష్ణ మీద అనుమానంగా ఉంటుంది. అసలు బావ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి అని కృష్ణకు తెలియకుండా కృష్ణుని ఫాలో అయ్యి వెనకాలే ఉండి వింటూ ఉంటాడు. కృష్ణ ఫోన్లో అసలు ఆ పద్మావతిని నేను దెబ్బ కొట్టాలనుకుంటుంటే ఆ పద్మావతి నాకు చిక్కటం లేదు. మనం అనుకున్నది ఏదీ జరగదేమో అని నాకు అనిపిస్తుంది. పద్మావతిని తక్కువ అంచనా వేయకు తను చాలా తెలివైనది. అందుకే కదా తనపై నాకు మనసై తనని పెళ్లి చేసుకోవడానికి అరవింద తో పెళ్లి అయినా కాలేదని చెప్పి నాకే బ్యాగ్రౌండ్ లేదని చెప్పి తన వాళ్ళని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. ఆ మాటలు విని ఆర్య ఆశ్చర్యపోతూ ఉంటాడు. కానీ పద్మావతి నా గురించి తెలుసుకొని నన్ను దూరం పెట్టి వికీకి దగ్గర కావాలని చూస్తోంది. ఆ కోపంతోనే నేను విక్కీ మనసు విరిగేలాగా పద్మావతి తో చనువుగా ఉన్నట్లు నటించాను. దాంతో విక్కి అపార్థం చేసుకొని అరవింద సంతోషానికి పద్మావతి అడ్డు రాకూడదని ఆరు నెలల ఒప్పందం పెట్టి, పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు ఇంకొక మూడు నెలల్లో ఆ ఒప్పందం పూర్తయి వాళ్ళిద్దరు విడిపోతారు. ఆలోగా నేను ఆస్తి మొత్తాన్ని సొంతం చేసుకుందామని చూస్తుంటే పద్మావతి విక్కి ని సొంతం చేసుకోవాలని చూస్తుంది. నాకు అడ్డు తగులుతుంది తన అడ్డు తొలగించుకున్నాకే నాకు మనశ్శాంతి. ఈ వ్రతం పూర్తయ్యేలోగా నేను అనుకున్నది చేయాలి అప్పుడే నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు.వెనక్కి తిరిగి చూసేసరికి ఆర్య అక్కడే ఉంటాడు. మొత్తం విన్నాడా ఏంటి అని అనుమాన పడతాడు.

Nuvvu Nenu Prema Today Episode December 07 2023 Episode 487 Highlights

కృష్ణ నిజస్వరూపం తెలిసిన ఆర్య..

ఇక కృష్ణ మాట్లాడిన మాటలన్నీ విని ఆర్య చాలా కోపంగా కృష్ణని, దుర్మార్గుడా నీలో ఇంత కుట్ర దాగుందా పైకి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు అని కాలర్ పట్టుకుంటాడు. నిన్నేం చేసినా పాపం లేదు అని అంటాడు వెంటనే కృష్ణ మొత్తం విన్నావన్నమాట, అని అనగానే నీ నిజ స్వరూపం తెలియక మా అక్కతో పాటు ఇంట్లో అందరూ కూడా నిన్ను దేవుడిలా చూశారు అయినా కానీ నువ్వు ఇంత మోసం చేస్తావా అని అంటాడు. అప్పుడే అరవింద వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది కృష్ణని, ఆర్య కోపాన్ని చూసి కృష్ణ నువ్వు నన్నేమీ చేయలేవు ఎందుకంటే నిజం తెలిసిన విక్కీ పద్మావతి లే నన్నేం చేయలేకపోయారు ఇక నువ్వు ఎంత పిల్లవాడివి అని అంటాడు. ఆ మాటలకు ఆర్యా కి ఇంకా కోపం వస్తుంది.

Krishna Mukunda Murari: కృష్ణకి పెళ్లయిందన్న విషయాన్ని మురారికి చెప్పిన భవాని.. ఆ మాటతో అందరి నోర్లు మూయించిన కృష్ణ..

కంకణ ధారణ..

ఇక పంతులుగారు విక్కీ పద్మావతి లని పూజ చేయిస్తూ కంకణం కట్టుకోండి ఒకరికొకరు అని అంటాడు. వాళ్లు కంకణం ఒకరికి ఒకరు కట్టుకుంటూ ఉండగా త్వరగా పూజ చేయించండి పంతులుగారు, ఇంతసేపు చేస్తారేంటి అని అంటుంది. చెప్పాను కదమ్మా ఈ పూజ అన్ని పూజలు లాంటిది కాదు ఇది చాలా ప్రత్యేకమైనది దంపతులు ఇరువురు చాలా శ్రద్ధగా భక్తితో చేసే పూజ అలా త్వరగా కానివ్వడానికి వీలు లేదు. తర్వాత పద్మావతి వికీ దూరంగా కూర్చుంటే మీరిద్దరూ పక్క పక్కన కూర్చోవాలి. దానికి కూడా ఒక అర్థం ఉంది మీరిద్దరూ కలిసి అర్ధనారీశ్వరుల్లాగా కూర్చోవడం వల్ల, మీరుసర్వకాల సర్వస్థలందు ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు ఉన్నారు అని మీరు చెప్పుకోవడానికి, మీరు ఒకరికి ఒకరు తోడు ఉండడానికి ఒకరికొక నీ ఒకరు అర్థం చేసుకోవడానికి ఈ పూజ మనం చేస్తున్నాము అని పంతులుగారు వివరంగా విక్కీకి పూజ గురించి చెప్తూ ఉంటాడు. ఇక ఇద్దరూ దూరంగా కాకుండా కొంచెం దగ్గరగా కూర్చుండి అని అంటాడు పంతులుగారు. ఇక పూజ మళ్లీ మొదలుపెట్టి చేస్తూ ఉంటారు. అరవింద కృష్ణ ని వెతుక్కుంటూ వస్తుంది.

కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన ఆర్య..

ఇక ఆర్య కృష్ణ కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అరవింద వెతుక్కుంటూ వస్తుంది. అరవింద్ అని చూసుకోకుండా ఆర్య కృష్ణకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అందులో అరవింద దగ్గరికి వస్తుంది. నేను పద్మావతి అంతా మంచి వాడినైతే కాదు నీకు తగిన బుద్ధి చెప్తాను అని కృష్ణ తో ఆర్య అంటూ ఉంటాడు. అరవింద వచ్చి ఏంటి అంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు,అని అడుగుతుంది. ఇప్పుడే బావ గురించి నిజ స్వరూపం తెలిసింది అక్క అని అంటాడు కృష్ణ అనుమాన పడతాడు ఎక్కడ నిజం చెప్తాడు అని కానీ చెప్పకుండా, అదేం లేదక్కా బావని ఆట పట్టిస్తున్నాను అని అంటాడు వెంటనే కృష్ణ ఊపిరి పీల్చుకుంటాడు. అరవింద కూడా అక్కడ పూజ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి మీరిద్దరేంటి పదండి పూజ దగ్గరికి వెళ్దాం అని అంటుంది ఇక నువ్వెలా అక్క నేను వస్తాను అని అరవింద్ అని పంపించి కృష్ణకు మళ్ళీ వర్నింగ్ ఇస్తాడు ఆర్య. మీ అక్క నాకు ఏదైనా జరిగితే తట్టుకోలేదు అందుకే నేను అనుకున్నది చేస్తున్నాను అని అంటాడు కృష్ణ. పద్మావతి వాళ్ళ లాగా నాకు అంత ఓపిక లేదు నీ గురించి నేను ఎప్పుడైనా మా అక్క గురించి ఆలోచించకుండా బుద్ధి చెప్పొచ్చు దానికి నువ్వు జాగ్రత్తగా ఉండు అని గట్టిగా, వార్నింగ్ ఇచ్చేసి వెళ్లిపోతాడు. ఇక కృష్ణ నా పని పూర్తయిన తర్వాత వీడు అంతు తేల్చాలి అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema: పద్మావతి, విక్కీల మధ్య ప్రేమ చిగురించనుందా? పిల్లల కోసం అను ఆరాటం.. కుచల అనుమానం..

Nuvvu Nenu Prema Today Episode December 07 2023 Episode 487 Highlights
అందరినీ ఆశ్చర్యపరిచిన పద్మావతి..

ఇది పంతులుగారు పూజ చేయిస్తూ, హారతి ఇవ్వండమ్మా పూజ పూర్తయింది అని చెప్తాడు. ఇక పద్మావతి గత మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. విక్కీ తనకి తాళి కట్టడం ఆ తర్వాత తను నీళ్లలో పడితే విక్కీ రక్షించడం అప్పుడు పద్మావతి తన ప్రేమని నిజాన్ని విక్కి కి చెప్పడం, అయినా విక్కీ నమ్మకుండా పద్మావతిని అనుమానించడం. పద్మావతి అమ్మవారి దయతో ఒక దారి చూపించమని అడగడం, ఆరు నెలలో విక్కీ మనసు మార్చాలని పద్మావతి అనుకోవడం. ఇలా గతం మొత్తం గుర్తు చేసుకొని హారతి ఇవ్వండమ్మా అని పంతులుగారు మళ్లీ అనగానే, విక్కీ పళ్లెంలో హారతి వెలిగిస్తాడు. అలా కాదు సారు ఇచ్చేది నేను ఇస్తాను హారతి అని చేతిలో కర్పూరం బిళ్ళ పెట్టుకొని వెలిగించ మంటుంది. విక్కీ ఆశ్చర్యపోతాడు ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. పద్మావతి ఏం చేస్తున్నావ్ నువ్వు అని అంటాడు విక్కీ. ఇలా హారతి ఇస్తే ఆ స్వామి వారు సంతోషంతో తన అనుగ్రహాన్ని మనపై ఉండేలా చేస్తాడు. అంతేకాదు మన కాపురంలో ఎలాంటి పొరపాట్లు, రావు జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటాము. ఇవ్వనివ్వండి బాబు అంటారు పంతులుగారు. పద్మావతి చేతిలో హారతి వెలిగించుకొని దేవుడికి ఇస్తూ ఉంటుంది. అది చూసి విక్కీ ఆశ్చర్యపోతూ ఉంటాడు. వెనక బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్, వస్తూ ఉంటుంది. తన మనసులో ఉన్న అపార్ధాలు తొలగిపోయి నన్ను భారీగా స్వీకరించి నేను ఎప్పటికీ విడిపోకుండా తనతోనే కలిసి ఉండేలాగా అనుగ్రహించమని దేవుడికి మనసులో దండం పెట్టుకుంటూ చేతిలో హారతి ఇస్తూ ఉంటుంది పద్మావతి. పద్మావతి చేసిన పనికి విక్కీకి చాలా బాధేస్తుంది. చూస్తుంటే చూస్తూ ఉంటే విక్కీ మనసు మారేలా ఉందే ఇలా జరగకూడదు అని కృష్ణ మనసులో అనుకుంటాడు. చిలకమ్మా పద్మావతికి వాళ్ళ ఆయన అంటే ఎంత ప్రేమ ఉంది లేదంటే ఇలా ఎందుకు చేస్తుంది అని అంటుంది. ఇక పంతులుగారు మీ బంధానికి తిరుగులేదు మీరు ఎప్పటికీ విడిపోరు. మీరు సంతోషంగా ఉంటారు అని చెప్తే పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాలి సంతోషంగా ఉండడానికి వీల్లేదు ఏదో ఒకటి చేయాలి అని కృష్ణ మనసులో అనుకుంటాడు. ఇక పూజ పూర్తయినది. అందరూ అక్షింతలు వేసి దంపతులను ఆశీర్వదించండి అని అంటారు. ఇక అందరూ అక్షింతలు వేస్తారు. మీరు ఇంకా ప్రదక్షిణాలు చేసి రండి ఇంతటితో అయిపోతుంది అని అంటారు పంతులుగారు ఇక విక్కీ పద్మావతి అందరూ వెళ్తారు ప్రదక్షిణాలకి,

రివెంజ్ తీర్చుకున్న ఆర్య..

ఇక ఆర్య అరవింద కృష్ణ పంతులుగారు అక్కడ ఉంటారు. ఆర్య ఇందాక మా పద్మావతి పూజ చేసినట్టు ఎవరైనా హారతి చేతిలో పెట్టుకొని వెలిగిస్తే వాళ్ల కోరికలు తీరతాయి కదా అని అంటాడు. ఆ కచ్చితంగా అని అంటారు పంతులుగారు. అయితే మా బావ కూడా చేతిలో కర్పూరం పెట్టుకొని హారతి ఇవ్వచ్చన్నమాట అని అంటాడు ఆర్య. దేనికి రా అని అంటుంది అరవింద. బావ మనసులో ఇలానే హారతి ఇవ్వాలి అని ఉంది బయటపడట్లేదు, నేను అని అంటాడు కృష్ణ ఆ నువ్వే బావ అని అంటాడు ఆర్య. నీకు మా అక్క అన్న దాని కడుపులో బిడ్డ నా చెప్పలేనంత ప్రేమ కదా వాళ్ల కోసం నువ్వు ఏదైనా చేస్తావు కదా, వాళ్ల కోసం ప్రాణాలు ఇవ్వమన్నా హ్యాపీగా ఇచ్చేస్తావు కదా, మరి అక్క కోసం పుట్టపోయే బిడ్డ బాబు కోసం నువ్వు ఈ మాత్రం చేయలేవా, అని ఆర్య అనగానే అరవింద వద్దు లేరా అని అంటుంది. అలా అనకూడదు అక్క ఇది బావ ముక్కు తీర్చకపోతే నీకు గాని బిడ్డకు గాని ఏమైనా అయితే, బావ తట్టుకోలేడు అక్క ప్రాణంతో బతకగలడా అసలు నువ్వు లేకపోతే, చేతుల హారతి ఇవ్వాలన్నది ఆయన కోరిక తీర్చనివ్వక రా బావ నువ్వు రా అని కావాలనే కృష్ణని దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. మొక్కుని పోస్ట్ ఫోన్ చేయకూడదు బావ కంప్లీట్ చేయాల్సిందే నేను చేయిస్తాను కదా అని, అంతా మంచే జరుగుతుంది బావ హారతివ్వు నువ్వు ముందు, దేవుడు నిన్ను కరుణిస్తాడు చూడు అని అంటాడు ఆర్య. కావాలనే కృష్ణని ఇబ్బంది పెట్టడానికే ఆర్య చేతిలో కర్పూరం వెలిగిస్తాడు. కృష్ణకి చాలా నొప్పిగా చాలా బాధగా ఉంటుంది. వెంటనే అరవిందా నొప్పిగా ఉందా అండి అని అనగానే, ఏం కాలేదు లే అక్క మీరు బాగుండడమే కదా బావగారికి కావాల్సింది. కృష్ణ మనసులో, నీ సంగతి తర్వాత చెప్తాను రా అని అనుకుంటాడు.

రేపటి ఎపిసోడ్ లో అరవింద విక్కీ దగ్గరికి వచ్చి, ఈ వెన్నపూస పద్మావతి చేతికి రాయి కొంచెం చల్లబడుతుంది అని అంటుంది. వెన్నపూస పద్మావతి చేతికి రాస్తూ ఉంటాడు అప్పుడే పద్మావతి చూసి, నా మీద మీకు ఎంత ప్రేమ ఉన్నది సారు అని మనసులో అనుకుంటుంది పద్మావతి నిద్రపోతుందని విక్కీ వెళుతూ ఉండగా పద్మావతి విక్కీని, పిలుస్తుంది ఏంటా అని విక్కీ వెనక్కి తిరిగేసరికి పద్మావతి నేనంటే మీకు ఎంత ప్రేమ సారు అని ముద్దు పెడుతుంది. విక్కీ అలానే చూస్తూ ఉంటాడు.

bharani jella

Recent Posts

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024