NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi December 06 Episode 272: కళ్యాణ్ పెళ్లి క్యాన్సిల్.. కనకం ప్లాన్ సక్సెస్.. కావ్యతో రాజ్ హనీమూన్..?

Brahmamudi Today Episode December 06th 2023 Episode 272 Highlights

Brahmamudi December 06 Episode 272:  నిన్నటి ఎపిసోడ్ లో, దుగ్గిరాల ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కనకం ఎలాగైనా అప్పు కళ్యాణ్ కి దగ్గర చేయాలి అని అనుకుంటుంది. స్వప్నని ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోమని రుద్రాణి చెప్పినప్పుడు, కనకం తన మాటలతో మాయ చేసి, తన నటన విశ్వరూపం చూపించి, ఇంట్లో వాళ్ళని బురిడీ కొట్టి దుగ్గిరాల ఇంట్లో సెటిల్ అవుతుంది . కనకం దుగ్గిరాల ఇంట్లో ఉండడం అపర్ణకి రుద్రానికి ఇద్దరికీ ఇష్టం ఉండదు. ఇందిరా దేవి, కనకం ఇంట్లో ఉండడానికి ఒప్పుకోక ఒప్పుకోవడంతో చేసేదేం లేక, ఇద్దరూ సైలెంట్ అవుతారు. కనకం కళ్యాణ్ పెళ్లి చెడగొట్టడానికి పంతులు గారి దగ్గరకు వెళుతుంది. మీరు పెళ్లి క్యాన్సిల్ చేయకపోతే నాకు చావేగతి అని పంతుల్ని బెదిరిస్తుంది. కనకం చెప్పిన మాటలకు పంతులు బెదిరిపోయి పెళ్లి క్యాన్సిల్ చేయడానికి ఒప్పుకుంటాడు.

Brahmamudi Today Episode December 06th 2023 Episode 272 Highlights
Brahmamudi Today Episode December 06th 2023 Episode 272 Highlights

ఈరోజు ఎపిసోడ్ లో, కావ్య, అరుణ్ ని పట్టుకోవడానికి, బోర్డు మీద స్కెచ్ లు వేసి ప్లాన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ బోర్డు మీద చుక్కలు చూసి నీ ప్లాను బొగ్గు లాగా ఉంది. బోర్డు మీద చుక్కల ముగ్గు వేసావా అని అంటాడు. అరుణ్ గాడు తప్పించుకున్నాడు. కాదు కావాలనే ఎస్కేప్ అయ్యాడు. మిస్ అయ్యాడు అని కావ్య అంటూ ఉంటే ఆపుతావా నీ సిఐడి ఇన్వెస్టిగేషన్ అని అంటాడు రాజ్. ఇంట్లో అందరూ వాడి గురించి వదిలేసిన తర్వాత నువ్వు ముగ్గులు పిల్లి మొగ్గలు వేస్తూ కూర్చోడంలో అర్థమే లేదు అని అంటాడు.

Krishna Mukunda Murari: కృష్ణకి పెళ్లయిందన్న విషయాన్ని మురారికి చెప్పిన భవాని.. ఆ మాటతో అందరి నోర్లు మూయించిన కృష్ణ..

Brahmamudi Today Episode December 06th 2023 Episode 272 Highlights
Brahmamudi Today Episode December 06th 2023 Episode 272 Highlights

అరుణ్ దొరకాలి..

ఇక రాజ్ అలా నువ్వు ఒక్కదానివే వాడి గురించి ఆలోచించడంలో అర్థం లేదు అని అనగానే, వాడు హాస్పిటల్ లో లేడు ఇంట్లో లేడు, ఎక్కడా కూడా లేడు, ఫోన్ పని చేయట్లేదు అంటే కావాలని తప్పించుకుని తిరుగుతున్నాడనే కదా అర్థం అని కావ్య అంటుంది. ఇంక నువ్వు వాడి గురించి ఆలోచించడం మానేస్తావా మీ అక్కే వాడి గురించి మర్చిపోయి సంతోషంగా ఉంటుంది నువ్వేంటి అని అంటాడు రాజ్. వదిలేస్తే నింద నిజం అవుతుంది. మా అక్క మీద పడ్డానిందా అలానే ఉంటుంది అని అంటుంది కావ్య. అయినా మీకేమైంది అని అంటే నువ్వు ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది. నన్ను మనశాంతిగా పడుకొని అని అంటాడు అయితే అసలు కుదరదు. ఏంటి అని అంటాడు రాజ్. అదేనండి ఒక సాటి స్త్రీకి అన్యాయం జరిగితే దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీయ మగాడిగా మీరు సైలెంట్ గా ఉన్న, సాటి శ్రీ గా నేను మాత్రం ఊరుకోలేను అంత భయంకరమైన తప్పుచేసి వాడు తేలిగ్గా తిరుగుతున్నాడు. మా అక్క మీద వేసిన నింద పోగొట్టేలా చేస్తాను అని అంటుంది. వాడి గురించి మాట్లాడుతుంటే నా రక్తం మరిగిపోతుంది అని అంటుంది. నీ రక్త చరిత్ర ఆపవే అని అంటాడు. ఆపనండి ఆపకపోతే మీరు ఏం చేస్తారు అని,ఇక కావ్య అలానే మాట్లాడుతూ ఉంటే రాజ్ కి కోపం వచ్చి అక్కడే ఉన్న కావ్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బొమ్మని తీసి నువ్వు ఇప్పుడు గనక ఆపకపోతే ఈ బొమ్మ కింద పడేస్తాను అని బెదిరిస్తాడు. ఏం చేస్తున్నారండి మీరు అది మట్టి బొమ్మ, పడితే పగిలిపోతుంది అండి అని అంటుంది కావ్య. నాకు ఆ విషయం తెలుసు నువ్వు ఈ విషయం వదిలేస్తావా వదిలేయవా, వదిలేయకపోతే నేను ఈ బొమ్మని వదిలేస్తాను అని అంటాడు. నిజంగానే రాజ్ బొమ్మని కింద వదిలేసాడు అనుకోని పెద్దగా అరుస్తుంది కావ్య. రాజ బొమ్మ పట్టుకుంటాడు. ఏంటి గుండె పగిలిపోయిందా, ఇకముందు అరుణ్ గాడి ప్రస్తావన నా దగ్గర తీసుకొస్తే, ఈ బొమ్మ నిజంగానే పగలగొడతాను అని, ఆ బొమ్మ కావ్య చేతిలో పెట్టేస్తాడు. నాకు తెలుసు అండి మీరు నిజంగా చాలా మంచివారు. కొన్ని విషయాలు మండిగా ఉంటారు అంతే అని మనసులో అనుకుంటుంది కావ్య.

Nuvvu Nenu Prema: పద్మావతి, విక్కీల మధ్య ప్రేమ చిగురించనుందా? పిల్లల కోసం అను ఆరాటం.. కుచల అనుమానం..

Brahmamudi Today Episode December 06th 2023 Episode 272 Highlights
Brahmamudi Today Episode December 06th 2023 Episode 272 Highlights

కళ్యాణ్ అప్పు కి కాల్.. కనకం కామెడీ..

ఇక కళ్యాణ్ రేపు జరగబోయే నిశ్చితార్థం గురించి అప్పుకి చెప్పాలి అని బయటికి వచ్చి ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పు కావాలని ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. నా నిశ్చితార్థం గురించి చెప్పి సపరేట్ చేద్దామనుకుంటే కట్ చేసి నాకు షాక్ ఇస్తుంది ఏంటి అని అనుకుంటాడు. మళ్లీ మళ్లీ అప్పు కి కాల్ చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు చేసినా అప్పు ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఏమైంది బ్రో కి అని అనుకుంటూ ఉండగా అప్పుడే, కనకంఅక్కడికి వస్తుంది. కళ్యాణ్ మీరు మంచి టయానికి వచ్చారు ఆంటీ అని అంటాడు ఏంటి బాబు నిశ్చితార్థం పెట్టేసుకుంటున్నారా అని అంటుంది. నిశ్చితార్థం రాత్రిపూట ఎందుకు పెడతాం ఆంటీ అని అంటాడు ఏమో బాబు మీరు డబ్బు ఉన్నారు కదా అని అంటుంది. నా జాగ్రత్తలో నేనుండాలి కదా అని అంటుంది మీ జాగ్రత్తలు మీరు ఉండేది ఏంటి అని అంటాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు కళ్యాణ్. అంటే నేను లేకుండా నిశ్చితార్థం జరుగుతుందేమోనని అంటుంది కనకం. మీరు లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుందంటి అని అంటాడు కళ్యాణ్. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, అని కళ్యాణ్ అనగానే ఎందుకు బాబు అని అంటుంది మీ సీక్రెట్ తెలుసుకోవడానికి కాదు ఆంటీ అని అంటాడు కళ్యాణ్. నా దగ్గర సీక్రెట్స్ ఏముంటాయి బాబు అని, అంటుంది. అప్పు కి కాల్ చేద్దామని ఆంటీ నా ఫోన్లో నుంచి చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, మీ ఫోన్లో నుంచి, అప్పు కి ఫోన్ చేసి, రేపు నిశ్చితార్థం అని ఇక్కడికి రమ్మని చెప్తాను అని అంటాడు సరే అని ఫోన్ ఇస్తుంది తర్వాత గుర్తుకు వస్తుంది, అప్పుని నిశ్చితార్థం అని చెప్పకుండా ఇక్కడికి రమ్మని చెబుదామనుకున్నానే ఈ కళ్యాణ్ బాబు మొత్తం చెప్పేలా ఉన్నాడు అని బాబు ఫోన్ ఇట్ ఇవ్వు అని మళ్ళీ తీసేసుకుంటుంది. ఏమైందండీ ఫోన్ తీసుకున్నారు అని అంటాడు నువ్వు అప్పు నీ నిశ్చితార్థానికి పిలవాలి అనుకుంటున్నాం అంతే కదా, నేను ఇందాకే పిల్చేశాను రేపొద్దున వస్తానని కూడా చెప్పింది. ఓ వస్తానని చెప్పిందా మీతో అని అంటాడు. మరి నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని అంటాడు. రేపు ఉదయం ఇక్కడికి రాగానే అడగండి బాబు అని అంటుంది కనకం. గట్టిగా అడుగుతాను ఆంటీ అని కళ్యాణ్ అంటాడు. నాకు కావలసింది కూడా అదే కదా అని మనసులో అనుకుంటుంది.

Madhuranagarilo December 05 2023 Episode 227: సినిమాకు వెళ్దామని రెడీ అయిన రాధా పండు, శ్యామ్ సినిమాకి తీసుకు వెళ్తాడా లేదా?..

Brahmamudi Today Episode December 06th 2023 Episode 272 Highlights
Brahmamudi Today Episode December 06th 2023 Episode 272 Highlights

రుద్రాణి కి జలక్ ఇచ్చిన కనకం..

ఇక రుద్రాణి కనకం తన గదిలోకి వచ్చి పడుకుంటుందేమోనని, తాళం వేసి, మేడ పైకి వెళ్ళిపోతుంది. కనకం రుద్రాణి గది దగ్గరికి వచ్చి, నాకు ఇప్పుడు వేసుకోవడానికి చీరలు లేవు కదా రుద్రాణి చీరలు వాడుకుందాం అని అనుకుంటుంది. వెంటనే రుద్రాణి రూమ్ దగ్గరికి వెళ్లి చూస్తుంది లాక్ వేసి ఉంటుంది. ఈ రుద్రాణి కావాలని లాక్కువేసిందేమో అని అనుకొని పిన్ని తాళం తీసి గదిలోనికి వెళుతుంది. ఇక రుద్రాణి మాత్రం, ఇదంతా ఏమీ తెలియక కనకం చాలాసేపు నా గది దగ్గరికి వచ్చి డోర్ రావట్లేదు కదా అని స్టోర్ రూమ్ లోకి వెళ్లి పడుకుంటుంది. ఇక తనకు మిగిలింది అదే కదా అని అనుకుంటుంది. ఇప్పుడే వెళ్తే దొరికిపోతాను మళ్ళీ అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది కనుక ఒక గంట ఆగి వెళ్దాం అని అనుకుంటుంది రుద్రాణి.కానీ కనకం తెలివి, తక్కువ అంచనా వేస్తుంది రుద్రాణి. కనకం చక్కగా, రుద్రాణి గదిలోకి వెళ్లి రుద్రాణి చీరలు కాకుండా తన నైటీ తీసుకొని, కనకం వేసుకుంటుంది. చాలాసేపు అయింది ఈ కనకం వెళ్లిపోయి ఉంటుంది అని అనుకోని రుద్రాణి కిందకి వస్తుంది. వచ్చేసరికి డోర్ లాక్ తీసి ఉంటుంది. ఇదేంటి నేను డోర్ వేసి వెళ్ళాను కదా ఎవరు ఓపెన్ చేశారు అని లోపలికి వెళ్లి చూసి షాక్ అవుతుంది. అప్పటికే కనకం లోపలికి వెళ్లి తన నైటీ వేసుకుని ఉంటుంది. రుద్రాణి కనకంతో కబోర్డ్ లో ఖాళీగా కనిపిస్తున్నాయని, నాకు చెప్పకుండా నా నైటీ వేసుకుంటావా, దొరికితే నగలు కూడా వేసుకునేటట్టు ఉన్నావు అని అంటుంది. నగలు ఉన్నాయా ఎక్కడ ఉన్నాయి అని అంటుంది. రుద్రానికి చాలా కోపం వస్తుంది. నువ్వు నా గదిలో పడుకోవడానికి వీల్లేదు నేను నిన్ను భరించలేను నువ్వు కావాలంటే స్వప్న గదిలోకి వెళ్లి పడుకో అని అంటుంది. ఊరుకోండి రుద్రాణి గారు మీరు మరీను, భార్యాభర్తలు అన్నాక చెట్లు ముచ్చట్లు ఉంటాయి వాళ్ళ గదిలోకి నేను ఎలా వెళ్లి పడుకుంటాను మీరంటే ఏకాకి మనిద్దరం కలిసి పడుకోవచ్చ, రండి పడుకుందాం అని అంటుంది. ఆ మాటలకు రుద్రానికి ఇంకా కోపం వస్తుంది. ఈ నైటీ ఇలా ఉంది ఏంటండీ దీన్ని ఎలా ముడి వేసుకోవాలి అని అడుగుతుంది. నాలుగు తాళ్లు కలిపి ముడి వేసుకో అని అంటుంది కావాలని రుద్రాణి. ఓ సంతే నా అని కనకం కూడా, నైటీ కొన్న తాళ్లన్నీ కలిపి ముడి వేసుకుంటుంది ఈ కనకాన్ని తక్కువ అంచనా వేశాను అని అనుకుంటుంది రుద్రాణి.

Brahmamudi Today Episode December 06th 2023 Episode 272 Highlights
Brahmamudi Today Episode December 06th 2023 Episode 272 Highlights
కళ్యాణ్ ఇంటికి అప్పు రాక..

ఇక కనకం బట్టలు తీసుకొని, అప్పు కల్యాణ వాళ్ళ ఇంటికి వచ్చి బయట నిలబడి కనకానికి ఫోన్ చేస్తుంది. కనకం మేడ మీద నుంచి దిగి వస్తు, రాజ్ ఇందిరా దేవి మాట్లాడుకోవడం వింటుంది. పంతులుగారు దారిలో ఉన్నారు వస్తున్నారు అని రాజ్ చెప్పడం వింటుంది. కనకం అప్పు దగ్గరికి వెళ్లి లోపలికి రా అని అంటుంది. నేను లోపలికి రాను, ఈ బట్టలు బ్యాగు తీసుకో అని అప్పు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి కళ్యాణ్ వస్తాడు. ఏంటి బ్రో, సర్ప్రైజ్ ఇచ్చావు నాకు, నువ్వొస్తావని నేను అనుకోలేదు. నాకు అనామికకు ఈరోజు పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు నువ్వు ఉండాలి అనుకున్నాను వచ్చావు అని అంటాడు కళ్యాణ్ అప్పుతో, ఆ మాటలకు అప్పు చాలా బాధపడుతుంది నేను ఇక నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. బలవంతంగా కళ్యాణ్ అపోని లోపలికి తీసుకువెళ్తాడు ఇంతలో పంతులుగారు వస్తారు. ఇక మళ్లీ పంతులు గారితో, కనకం తను రాసిన సూసైడ్ లెటర్ ని విషం బాటిల్ ని చూపిస్తుంది. అది చూసి పంతులుగారు నాకు గుర్తుందమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను అని లోపలికి వెళ్తాడు.

పెళ్లి క్యాన్సిల్..

ఇక పంతులుగారు ముహూర్తం పెట్టడానికి అంతా రెడీ చేసుకుంటూ ఉంటాడు కనకం చాలాసేపటి నుంచి పంతులు గారిని చూస్తూ ఉంటుంది పంతులుగారు కూడా కనకాన్ని చూసి భయపడుతూ ముహూర్తం పెడుతూ ఉంటాడు. ఇదంతా రుద్రాణి గమనించి ఈ పంతులు ఏంటి ప్రతిసారి కనకం వైపు చూస్తున్నాడు కొంపదీసి కనకానికి లైన్ వేస్తున్నాడు అని అనుకుంటుంది. రుద్రాణి పంతులు గారితో, మా అబ్బాయి పెళ్లి ముహూర్తం సరిగా పెట్టకే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు మా వాడికైనా మీరు మంచి ముహూర్తం చూసి పెట్టండి అని అంటుంది. ఇప్పుడు పెట్టే ముహూర్తం కూడా అలాంటిదే తల్లి అని మనసులో అనుకుంటాడు పంతులు. ఇంట్లో అందరూ, తొందరగా మంచి ముహూర్తం పెట్టండి పంతులుగారు అని అడగగానే పంతులు అబ్బాయి జాతకం అమోఘంగా ఉంది. కానీ అమ్మాయి జాతకంలో అని, చెప్తూ ఉంటాడు.

రేపటి ఎపిసోడ్ లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు.అప్పుడే అక్కడికి వచ్చినా కళ్యాణ్ ని చూసి ధాన్యలక్ష్మి ఇన్ని ఘోరాలు జరుగుతాయి అని తెలిసిన తర్వాత కూడా పెళ్లి చేయడం ఎందుకు ఆపేస్తే మంచిది అని అంటుంది. కళ్యాణ్ కి కోపం వచ్చి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతూ ఉండగా, కావ్య అడ్డుపడి, చెవి కళ్యాణ్ మీ అన్నయ్య నా జాతకాలు అసలు చూడలేదు మేము హ్యాపీగా ఉన్నామా లేదా చెప్పు అని అంటుంది. మొన్న నన్ను సర్ప్రైజ్ అని చెప్పి మీ అన్నయ్య హనీమూన్ తీసుకెళ్తాను అని ప్లాన్ చేశాడు తెలుసా అని అంటుంది. ఆ మాటలకు ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri