NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అత్యధిక స్థానాలు గెలిచి… మళ్లీ దాడిలో పడేందుకు గులాబీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అటు పార్లమెంటు స్థానాలను ఎక్కువగా గెలుచుకొని… తెలంగాణ రాష్ట్రంలో తమ సత్తా చాటేందుకు భారతీయ జనతా పార్టీ తమ వ్యూహరచనలను అమలు చేస్తోంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్లమెంట్ ఎన్నికలను చాలా లైట్ తీసుకున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.

పార్లమెంట్ ఎన్నికల వాతావరణం, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టలేకపోతోంది. 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం… ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలను తేలిగ్గా తీసుకుంటోంది. గట్టి పోటీ ఇచ్చే చోట డమ్మీ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ పెడుతోందని తెలంగాణ రాష్ట్రంలో ఒక వార్త వైరల్ గా ఇచ్చే చోట డమ్మీ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ పెడుతోందని ఓ వార్త చెక్కర్లు కొడుతోంది.

ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం ఎంపీ అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. చాలా ఆలస్యంగా ఇక్కడ అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ విషయాన్ని పక్కకు పెడితే… అసెంబ్లీ ఎన్నికలలో భద్రాచలం మినహా ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అంటే ఖమ్మం జిల్లాలో చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ ఉందన్నమాట. ఇప్పుడే కాదు మొదటి నుంచి ఈ ఆనవాయితీ నడుస్తోంది.

ఇలాంటి చోట అగ్రనేతలు అయిన డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ ముగ్గురు అగ్ర నేతల డిమాండ్ల నేపథ్యంలో అభ్యర్థిని చాలా ఆలస్యంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. బట్టి విక్రమార్క తన సతీమణికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేయగా… తన తమ్మునికి ఇవ్వాలని పొంగులేటి అలిగి కూర్చున్నాడు. అటు తమ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిందేనని తుమ్మల నాగేశ్వరరావు తన డిమాండ్ ను అధిష్టానానికి తెలిపాడు.

కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ ముగ్గురు నేతల డిమాండ్లను పక్కకు పెట్టి… కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకువచ్చింది. ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి అవకాశం కల్పించారు. రఘురాం రెడ్డి కూడా పొంగులేటికీ బంధువే. కానీ తన తమ్మునికి రాలేదని పొంగులేటి ఇంకా అసంతృప్తి గానే ఉన్నారు. అటు బట్టి విక్రమార్క కూడా తన భార్యకు టికెట్ ఇవ్వలేదని… దీని అంతటికి కారణం పొంగిలేటి, తుమ్మల అని ఆగ్రహంతో ఉన్నారట. ఇదే ఫీలింగ్ బట్టి విక్రమార్కపై కూడా పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావుకు కూడా ఉందట. అతని వల్ల టికెట్ రాలేదని ఈ ఇద్దరు నేతలు భావిస్తున్నారట.

దీంతో… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి కోసం సరిగా ప్రచారం చేయడం లేదట. ఒకవేళ ప్రచారం చేసిన లేదా ఓ సమావేశం నిర్వహించిన… ఈ ముగ్గురు బడా లీడర్ల కార్యకర్తల మధ్య వివాదం రాజుకుంటుందట. కార్యకర్తలు, నేతలే కాకుండా ఈ ముగ్గురు లీడర్ల మధ్య కూడా కాస్త గ్యాబ్ పెరిగిందట. ఒకరి మాట ఒకరు వినడం లేదట. ఎవరి దారి వారిదే అన్నట్లుగా… వ్యవహరిస్తున్నారట. ఒకవేళ ఇదే పద్ధతిని ఈ ముగ్గురు లీడర్లు కొనసాగిస్తే… కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం నియోజకవర్గంలో ఎంపి స్థానం కోల్పోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికైనా అధిష్టానం ఈ విషయాన్ని గ్రహించి… ఈ ముగ్గురు లీడర్ల మధ్య ఉన్న యుద్ధ వాతావరణమాన్ని చల్లబరిచేలా చేయాలని అంటున్నారు.

Related posts

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?