NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

Amit Shah Video Morphing Case: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు వ్యవహారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తొంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 1వ తేదీన విచారణ హజరుకావాలని వీరికి జారీ చేసిన సమన్లలో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి తన న్యాయవాది ద్వారా ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తొంది.

తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో మార్ఫింగ్ వీడియోలు పోస్టు చేయలేదని రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరో పక్క నోటీసులు అందుకున్న కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు నిన్న విచారణకు హజరు కాలేదు. సమయం కావాలని కోరినట్లుగా తెలుస్తొంది. ఈ క్రమంలో ఇవేళ టీపీసీసీ సోషల్  మీడియా ఇన్ చార్జి సతీష్ తో పాటు నవీన్, ఆస్మా తస్లీమాలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ అరెస్టులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరో పక్క ఇదే అంశంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోపై బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 469, 505(1) కింద కేసు నమోదు చేశారు. అమిత్ షా చేసిన ప్రసంగాన్ని కల్పితం చేసి మార్ఫింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారని ప్రేమేందర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీపీసీసీ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ లో కూడా వీడియోను పోస్టు చేశారని పేర్కొన్నారు.

అమిత్ షా వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి షరతులు లేకుండా ముస్లిం లకు కల్పించిన రిజర్వేషన్లు రద్దు చేస్తామని, వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందిస్తామని చెప్పారని, కానీ అమిత్ షా .. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్లుగా మార్ఫింగ్ చేసిన వీడియోను ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పై కేసు నమోదు చేయాలని కోరారు.

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

Related posts

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N