పెద్ద త‌ల‌నొప్పి త‌ప్పించుకున్న ‌జగ‌‌న్‌… కానీ తేడా వ‌స్తుందా?

Published by
sridhar

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పెద్ద వివాదానికి తెర ‌దించేశారు.

దీర్ఘ‌కాలంగా జ‌రుగుతున్న ర‌చ్చ‌కు చెక్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో సెగలు పుట్టిస్తున్న గ‌న్న‌వ‌రం రాజకీయ రగడను స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ అధినేత‌, సీఎం జగన్ ప‌రిష్క‌రించారు.

గ‌న్న‌వ‌రంలో గ‌రంగ‌రం

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన వల్ల‌భ‌నేని వంశీ అనంత‌రం వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ నిర్ణ‌యం ప‌ట్ల వైసీపీలో ఉన్న కొంద‌రు నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి కొత్త చేరికల వల్ల లు అలకలు ఉన్నా గన్నవరంలో అవి గ్రూపులు కట్టి తారాస్థాయికి చేరుకున్నాయి. వ‌ల్ల‌భ‌నేని వంశీ గత ఐదేళ్ల హయాంలో ఉన్నపుడు వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టారని అతనితో కలిసి పనిచేసేది లేదని వంశీపై పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంక‌ట్రావు నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని జగన్‌కు కూడా ఆయన చెప్పేసి నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటూ జగన్ ఇచ్చిన కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ పని చేసుకుంటున్నారు.

వంశీ పంచాయ‌తీ పెట్టారే

ఇదే స‌మ‌యంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సాయంతో సీఎం జగన్ కు దగ్గరయ్యేందుకు
టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో తానే వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ అని ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఇటీవల యార్లగడ్డ, దుట్టా వర్గాలకు వంశీ వర్గాలు తగువులాట పంచాయితీ రోడ్డెక్కింది. దీనితో జగన్ నేరుగా గన్నవరం వివాదం దృష్టిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పుట్టినరోజు వేడుకలను జరగనీయకుండా పోలీసులు ఆయన అభిమానులను అడ్డుకోవటం, నోటీసులు ఇవ్వటంతో మరోసారి ఫైరయ్యారు.. యార్లగడ్డ వెంకట్రావు. వంశీపై ఓ రేంజిలో విమర్శల వర్షం కురిపించిన యార్లగడ్డ బహిరంగ వేదికపైనే వంశీ తీరును ఎండగట్టారు.

జ‌గ‌న్ భ‌లే మేనేజ్ చేసేశారే

గన్నవరంలో వైసీపీ శ్రేణులను వంశీ పెడుతున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకెళ్ళాలని యార్లగడ్డ, దుట్టా వర్గాలు నిర్ణయించాయి. దుట్టా తన వర్గంతో కలిసి వైవీ సుబ్బారెడ్డిని కలిసి వంశీ తీరుపై ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే సీఎం జగన్ అటు వంశీ, ఇటు యార్లగడ్డ ఇద్దరి చేతులు కలిపి.. కలిసి పనిచేయలని సంకేతాలను ఇచ్చారు. పునాదిపాడులో జరిగిన జగనన్న విద్యాకానుక ప్రారంభంలో యార్లగడ్డను చూసిన సీఎం జగన్ వెంటనే వంశీని పిలిపించి.. చేతులు కలిపించారు. త‌ద్వారా కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో అన‌వ‌స‌ర వివాదాల‌కు చెక్ పెట్టారు. అయితే, ఎవరెన్ని చెప్పినా గన్నవరంలో వంశీతో కలిసి పనిచేయమని చెబుతున్న యార్లగడ్డ వెంకట్రావు ఇప్పడైనా మెత్తబడతారా ? వంశీ, యార్లగడ్డ వర్గాలు ఎంతవరకు కలిసి పనిచేస్తాయనేదే ప్రశ్నను కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ జోక్యం చేసుకున్నందున అంతా స‌ద్దుమ‌ణిగిపోతుంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

 

This post was last modified on October 8, 2020 10:26 pm

sridhar

Share
Published by
sridhar

Recent Posts

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024