AP Elections: చంద్రబాబు × నిమ్మగడ్డ డ్రామానా..! నిజమేనా..!?

Published by
Muraliak

AP Elections : ఏడాదిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి.. ఎన్నికల కమిషన్ కు మధ్య జరిగిన యుద్ధం గురించి ప్రత్యేకించి చెప్పే పని లేదు. మొత్తంగా ఓ కొలిక్కి వచ్చి పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం నుంచి సహకారం అందటంలేదని గతంలో కోర్టుకు వెళ్లిన నిమ్మిగడ్డ రమేశ్ కుమార్ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన రెండు దశల పోలింగ్ లో చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రకటించారు. ప్రజలంతా శాంతియుత వాతావరణంలో, స్వేచ్ఛగా ఓట్లు వేసుకునేంతగా కలెక్టర్లు, ఎస్పీలు సాదారణ ఎన్నికలకు చేసినంతగా ఏర్పాట్లు చేసారని కొనియాడారు. ఈ ప్రకటన నిమ్మగడ్డపై విమర్శలు చేస్తున్న వైసీపీకి, ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించడంలో ఫెయిల్ అయిందంటున్న టీడీపీకి షాక్ ఇచ్చేవే అని చెప్పాలి.

how to believe chandrababu over nimmagadda

AP Elections నిమ్మగడ్డ మాటే రైటా..?

‘ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పని చేస్తుంది. ప్రజల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే.. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి, నిధులు వచ్చేందుకు ఈ ఎన్నికలు తప్పనిసరి’ అని ఎలక్షన్ కమీషనర్ గా నిమ్మగడ్డ మొదటి నుంచీ చెప్తున్న మాట. ఇప్పుడాయన తొలి రెండు దశల ఎన్నికల నిర్వహణపై చేస్తున్న ప్రకటనలు ఇందుకు ఊతమిస్తున్నాయి. మొదటి నుంచీ నిమ్మగడ్డ వ్యవహారాన్ని తప్పు పడుతున్న వైసీపీ తన విమర్శల ప్రవాహాన్ని కొనసాగిస్తోంది. ఇదే నిమ్మగడ్డను మొదటి నుంచీ వెనకేసుకొస్తున్న టీడీపీ ఇప్పుడు ఆయన్ను విమర్శిస్తోంది. అంటే.. నిమ్మగడ్డ నిజంగానే నిస్పక్షపాతంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారా..? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే 2020 మార్చిలో ఎన్నికలు వాయిదా వేయడం ఓ పార్టీకి కొమ్ముకాయడం కాదనే నమ్మాలా? సీఎం జగన్ చేసిన సామాజికవర్గ ఆరోపణలను చాలెంజింగ్ తీసుకునే నిమ్మగడ్డ తన అస్త్రశస్త్రాలను ఉపయోగించి ఎన్నికల కమిషన్ పవర్ చూపించారా? నేను రిటైర్ అయ్యేలోపు ఎన్నికలు నిర్వహించగలను అనే పట్టింపు.. ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమీషనర్ గా తన బాధ్యతను నిర్వర్తించేందుకే ముందుకెళ్లారా..? అనే ప్రశ్నలు రాకమానవు. కలెక్టర్లు, ఎస్పీలను మెచ్చుకున్నారంటే ప్రభుత్వాన్ని మెచ్చుకున్నట్టే.

వైసీపీకి షాకిచ్చేలా..

అయితే.. నిమ్మగడ్డ వ్యవహారాన్ని మొదటి నుంచీ.. ఇప్పటికీ విమర్శిస్తున్న వైసీపీ ఎలక్షన్ కమీషనర్ నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారంటే నమ్ముతుందా..? నిమ్మగడ్డను తొలగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి కొత్త ఎన్నికల కమీషనర్ ను కూడా నియమించేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని నిమ్మగడ్డను విమర్శించారు. ఎన్నికల కమీషనర్ గా వీరిపై చర్యలకు ఉపక్రమించారు. తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ఏకంగా జిల్లాల పర్యటన కూడా చేస్తూ ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేయడం, బీజేపీ నేతలను చంద్రబాబు ఆదేశాల మేరకే పార్క్ హయాత్ లో కలుసుకోవడం, ఈవాచ్ ను తీసుకురావడం, ఏకగ్రీవాలకు అడ్డు చెప్పడం.. వంటి ఆరోపణలను వైసీపీ చేసింది.. చేస్తూనే ఉంది. మంత్రులపై ఆయన ఆంక్షల నేపథ్యంలో ఆయనపై ఇద్దరు మంత్రులు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. కొడాలి నాని కూడా ఇందుకు సిద్ధమవుతున్నారు. ఇంత చేస్తున్న వైసీపీకి.. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయనే ప్రకటన షాక్ ఇచ్చేదే.

చంద్రబాబును నమ్మేదెలా..?

మరోవైపు చంద్రబాబు.. ఎన్నికల కమీషన్ పై ఫైర్ అవుతున్నారు. మొన్నటివరకూ ఎన్నికల్లో తమదే పైచేయి అన్న చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహణలో ఎన్నికల కమీషన్ ఫెయిల్ అయిందంటున్నారు. ‘ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుందనే భావనలో నిమ్మగడ్డ ఉన్నారు’ అని కూడా అన్నారు. చంద్రబాబు చేస్తున్న కామెంట్లను వైసీపీ నమ్మడం లేదు. తన వ్యక్తిగా ముద్రపడ్డ నిమ్మగడ్డను ఆ మచ్చ చెరిపేందుకే కంటితుడుపు విమర్శలు చేస్తున్నారనే ఆరోపిస్తున్నారు. మరో నెలలో రిటైర్ అయ్యే వ్యక్తిపై విమర్శలు చేసినంత మాత్రాన పోయేదేం లేదు కాబట్టే చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని అంటున్నారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను పంపాలని చంద్రబాబు లేఖ రాస్తే కేంద్రం పట్టించుకునే స్టేజిలో లేదు కాబట్టే నిమ్మగడ్డతో తమకు సంబంధం లేదని నమ్మించడానికే చంద్రబాబు తన మార్క్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని కూడా అంటున్నారు. మరోవైపు.. తన ఎదుగుదలకు వైఎస్ సహకారమే కారణమన్న నిమ్మగడ్డ వ్యాఖ్యలకు చంద్రబాబు హర్ట్ అయ్యారనే వార్తలు కూడా లేకపోలేదు. మొత్తంగా నిమ్మగడ్డపై ఏ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటున్నా.. ‘ఎన్నికల కమీషన్ నిస్పక్షపాతంగా వ్యవహరిస్తుంది’ అన్న నిమ్మగడ్డ అదే పని చేస్తున్నారు అనిపించేలా దూసుకెళ్తున్నారని చెప్పాలి.

Muraliak

Recent Posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న ‌యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More

May 18, 2024

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది.… Read More

May 18, 2024

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More

May 18, 2024

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More

May 18, 2024

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More

May 18, 2024

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Prasanna Vadanam: తెలుగు ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన న‌టుల్లో సుహాస్ ఒక‌రు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More

May 18, 2024

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More

May 18, 2024

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More

May 18, 2024

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More

May 18, 2024

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024