Heavy Rains: వరద బీభత్సంతో నీట మునిగిన గ్రామాలు.. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతు

Published by
sharma somaraju

Heavy Rains: భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటితో కృష్ణా, గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భూపాలపల్లి జిల్లా మొరంచవాగు ఉగ్రరూపం దాల్చడంతో మోరంచపల్లి గ్రామం మొత్తం నీట మునిగింది. ఊరంతా నీట మునగడంతో గ్రామంలోని ప్రజలు బిల్డింగ్ లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మొరంచవాగు ఉధృతికి ఇళ్లలో సామాగ్రి తడిసి గ్రామస్తులు అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతంగా మారాయి.

 

గ్రామంలో పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి .. విషయాన్ని మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. హెలికాఫ్టర్ సౌకర్యం కల్పించాలని కోరారు. సీఎం కేసిఆర్ సైతం గ్రామంలో పరిస్థితి గురించి ఆరా తీశారు. వరద ఉదృతితో అల్లాడుతున్న గ్రామస్తులు తమ ప్రాణాలు  రక్షించాలంటూ  అధికారులకు ఫోన్ లు చేస్తున్నారు. గ్రామానికి చెందిన పలువురు వరద లో గల్లంతు అయ్యారు. ఓ లారీ వరదల్లో చిక్కుకుపోవడంతో డ్రైవర్ సాయిం కోసం వేడుకుంటున్నాడు.  ఇప్పటికే రెస్క్యూ టీమ్ లు గ్రామానికి బయలుదేరాయి. అధికారులు ములుగు నుండి బోట్లు తెప్పించారు. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది నీటిలో మునిగిన ఇళ్లలో చిక్కుకున్న వారిని కాపాడే పనిలో నిమగ్నమైయ్యారు.

 

ఎమ్మెల్యే గండ్ల వెంకట రమణారెడ్డి  మాట్లాడుతూ ప్రభుత్వం పరిస్థితి సమీక్షిస్తున్నట్లు చెప్పారు. బోట్ల ద్వారా కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మరో పక్క పెద్దపల్లి జిల్లాలో మంథని మండలంలో భారీ వర్షాల కారణంగా మానేరు వాగు పొంగి పొర్లుతోంది. వరద నీరు చుట్టుముట్టడంతో గోపాల్ పూర్ ఇసుక క్వారీలో పది మంది కార్మికులు చిక్కుకున్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

MLA Gandra Venkata Ramana Reddy

 

కాగా ములుగు జిల్లా బూరుగుపేట మారేడుగొండ చెరువుకు గండి పడటంతో ఒకే కుటుంబానికి ముగ్గురు వరదలో కొట్టుకుపోయారు. బండ్ల సారయ్య అనే వ్యక్తి మృతదేహాం లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం కుమ్మరిపాడు వదద్ పాములేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఒక మహిళ గల్లంతు అయ్యింది. వరదలో చిక్కుతున్న గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tragedy: ఎమ్మెల్యే ఇంట విషాదం

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

Devara: ఎన్టీఆర్ "దేవర" మూవీ నుంచి విడుదలైన 'ఫియర్ సాంగ్' యూట్యూబ్ లో అనేక రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ… Read More

May 31, 2024

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల అంశంపై తీర్పు రేపటి వాయిదా

AP High Court: పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అంశంపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిసాయి. రేపు సాయంత్రం ఆరు గంటలకు… Read More

May 31, 2024

Vistara Bomb Threat: శ్రీనగర్ వెళ్తున్న విస్తారా విమానానికి బూటకపు బాంబు బెదిరింపు .. ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రభావం

Vistara Bomb Threat: ఆకాశంలో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు ఘటన కలకలం రేపింది. బాంబు బెదిరింపు నేపథ్యంలో శ్రీనగర్… Read More

May 31, 2024

Sheep Scam: గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్

Sheep Scam: తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులను శుక్రవారం ఏసీబీ… Read More

May 31, 2024

AB Venkateswararao: పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. చివరి రోజు సంచలన వ్యాఖ్యలు

AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలో పదవీ విరమణ చేశారు. విజయవాడ… Read More

May 31, 2024

ఎయిరిండియాకు నోటీసులు జారీ చేసిన డీజీసీఏ

విమానాలు విపరీతంగా ఆలస్యం కావడంతో పాటు ప్రయాణీకుల సంరక్షణలో విఫలమైనందుకు ఎయిరిండియాకు శుక్రవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్… Read More

May 31, 2024

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

Superstar Krishna: నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సూప‌ర్ స్టార్ కృష్ణ… Read More

May 31, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ కు స్టార్ మా గుడ్ న్యూస్ వినిపించింది. రిషి అలియాస్ ముఖేష్… Read More

May 31, 2024

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

Buchi Babu Sana: ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చిబాబు సనా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుచ్చిబాబు తండ్రి పెద్దకాపు… Read More

May 31, 2024

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Krishna Mukunda Murari: అచ్చమైన తెలుగు అందం మరియు అందులోనూ అద్భుతమైన టాలీవుడ్ నటి అలాగే బిగ్ బాస్ షోలోను… Read More

May 31, 2024

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

Sivakarthikeyan: శివ కార్తికేయన్.. సౌత్ లో ఉన్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరు. హీరో గానే కాకుండా నిర్మాతగా,… Read More

May 31, 2024

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

Balakrishna-Anjali: ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతిథిగా వచ్చిన నటసింహం… Read More

May 31, 2024

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Family Stars promo: ఫ్యామిలీ స్టార్స్ గేమ్ షో తో సుడిగాలి సుదీర్ హూస్ట్ గా ఈటీవీలోకి రీ ఎంట్రీ… Read More

May 31, 2024

Amit Shah: తిరుమల శ్రీవారి అభిషేక సేవలో అమిత్ షా దంపతులు

Amit Shah: మరో నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో రాజకీయ ప్రముఖులంతా దైవ దర్శనం చేసుకుంటున్నారు.… Read More

May 31, 2024