అమరావతికి కేంద్రం అండదండలు!?

Published by
Siva Prasad

 

 

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి గత జూన్ నెలలో అధికారం లోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి కొనసాగింపు అనుమానంలో పడింది. ప్రభుత్వ వైఖరే దానికి కారణం. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజధాని తరలింపును అడ్డుకోవచ్చన్న భావన చాలమందిలో ఉంది. తాజా పరిణామాలు నిజంగానే బిజెపి చక్రం అడ్డం వేయవచ్చన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన భారతదేశం మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని చూపించకపోవడం కలవరం సృష్టించింది. దీనిని కేంద్రం సరిచేసి అమరావతి రాజధానిగా చూపిస్తూ కొత్త మ్యాప్ విడుదల చేయడం అమరావతి కొనసాగింపునకు సంకేతమని భావిస్తున్నారు.

గత ఆరు నెలలుగా రాష్ట్రప్రభుత్వంలో బాధ్యత గల మంత్రులు అనేక సందర్భాలలో అమరావతిపై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మునిసిపల్ పాలనాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి విషయంలో ఎంత కంగాళీ చేయవచ్చో అంత కంగాళీ చేశారు. రకరకాల వ్యాఖ్యలతో ఆయన రాజధాని విషయంలో విపరీతమైన అయోమయం సృష్టించారు.

మంత్రులూ, అధికారపక్షం శాసనసభ్యులూ తలొక రకంగా  మాట్లాడడం మరింత గందరగోళానికి దారి తీసింది. అమరావతి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని మంత్రులు చెబుతూ వచ్చారు. దానికి అర్ధం ఏమిటో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఈలోపు ప్రభుత్వం రాజధాని విషయంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి అంటూ జిఎన్ రావు కమిటీని నియమించింది. దానితో జగన్ ప్రభుత్వం అమరావతి  నుంచి రాజధాని తరలింపుకే సిద్ధపడుతోందన్న అభిప్రాయం బలపడింది.

ముఖ్యమంత్రి జగన్ మొదట్లో ఢిల్లీ పర్యటనకు  వెళ్లి ప్రధానిని కలిసినపుడు రాజధానికి నిధులు ప్రస్తుతం అక్కరలేదని చెప్పడం కూడా అనుమానాలను పెంచింది. తాజాగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అమరావతి తమ ప్రాధామ్యాలలో లేదని కుండ బద్దలు కొట్టారు.

వైసిపి ప్రభుత్వాన్ని ఈ విషయంలో అడ్డుకునే శక్తి టిడిపికి లేదని భావించిన రాజధాని ప్రాంతం రైతులు బిజెపిని ఆశ్రయించారు. ప్రధాని స్వయంగా శంఖుస్థాపన చేసిన నగరం నుంచి రాజధాని తరలిపోకుండా సెంటిమెంట్ కోసమైనా బిజెపి కేంద్రంతో పావులు కదిపిస్తుందని వారి ఆశ. దానికి తగ్గట్టుగానే రాజధానిని తరలించడం ఎవరి వల్లా కాదని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇటీవల ప్రకటించారు.

జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి దానిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత దేశపటంలో ఈ మార్పును ప్రతిఫలించేందుకు సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల కొత్త మ్యాప్ రూపొందించి విడుదల చేసింది. దానిలో అసలు నవ్యాంధ్ర రాజధానినే గుర్తించలేదు. దీని పర్యవసానంగా టిడిపి, వైసిపి మధ్య కొంత మాటలయుద్దం కూడా నడిచింది.  అమరావతిని టిడిపి ప్రభుత్వం నోటిఫై చేయని కారణంగానే ఇలా జరిగిందని వైసిపి ఆరోపించింది.

తాజాగా టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో ఈ విషయం ప్రస్తావించారు. వెంటనే హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించి అమరావతిని రాజధానిగా చూపిస్తూ ఇండియా మ్యాప్‌లు రూపొందించేలా  చూశారు. ఈ పరిణామం అమరావతి రాజధానిగా కొనసాగుతుందనడానికి సానుకూల సంకేతమని భావిస్తున్నారు.

 

This post was last modified on November 23, 2019 5:18 pm

Siva Prasad

Recent Posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కూట‌మి… Read More

May 12, 2024

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జ‌ట్టుకు ఎంత‌టి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా… Read More

May 12, 2024

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్ లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్ర… Read More

May 12, 2024

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

Ravi Teja: చిత్ర పరిశ్రమలో కథలు ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. ఒక హీరో… Read More

May 12, 2024

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Big Breaking: ప్రస్తుత కాలంలో అనేక ప్రమాదాలు జరుగుతున్న సంగతి మనం చూస్తూనే ఉంటున్నాం. ఇక ఇటువంటివి సాధారణమైన మనుషులకి… Read More

May 12, 2024

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

Kona Venkat: బాపట్ల జిల్లాలో సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పై కేసు నమోదైంది. దళిత యువకుడిపై దాడి… Read More

May 12, 2024

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

Kriti Sanon: టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో కృతి స‌న‌న్… Read More

May 12, 2024

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవేళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధులతో కలిసి ఫుట్… Read More

May 12, 2024

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

Aparichithudu: గత కొంతకాలం నుంచి తెలుగు తమిళ భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో… Read More

May 12, 2024

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి… Read More

May 12, 2024

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక సోమవారం రోజున ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో చివరి రోజు అయిన… Read More

May 12, 2024

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెగా కుటుంబంలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో... అందరు… Read More

May 12, 2024

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాజకీయ నాయకులందరూ ఇండ్లల్లోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్… Read More

May 12, 2024

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయ‌న‌ను ఓడించాల‌నే వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే.… Read More

May 12, 2024