సెలవుపై ఎల్వీ సుబ్రహ్మణ్యం?

Published by
Mahesh

అమరావతి: ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించి.. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా నియమించడంతో ఎల్వీ సుబ్రమణ్యం అలకవహించారు. ఆయన సెలవుపై వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ఉదయం భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్‌గా ఉన్న నీరబ్ కుమార్‌కు చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను ఎల్వీ సుబ్రమణ్యం అప్పగించారు. అనంతరం ఆయన బాపట్లలోని హెర్ఆర్డీ ఇన్ స్టిట్యూట్ డీజీగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ, కొత్త బాధ్యతలను స్వీకరించకుండానే ఎల్వీ సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 6 వరకూ ఎల్వీ సుబ్రహ్మణ్యం సెలవు పెట్టారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ పదవి నుంచి బదిలీ చేస్తూ నవంబర్ 4న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  సీఎంవోలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చినందుకు ఎల్వీపై బదిలీ వేటు పడినట్లు చర్చ జరుగుతోంది. బిజినెస్ రూల్స్‌ను సవరిస్తూ.. ప్రవీణ్ ప్రకాష్ జారీ చేసిన జీవోపై సీఎస్ అభ్యంతరం తెలిపారు. సీఎంవో పీఎస్ విషయంలో సీఎస్ వైఖరిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. సీఎంవో ఉత్తర్వులు తప్పుపట్టడం సరికాదని భావించిన ప్రభుత్వం.. తాజా పరిణామాలతో ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, షోకాజ్ నోటీసులు అందుకున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఎల్వీ సుబ్రమణ్యం పదవీకాలం మరో ఐదునెలల సర్వీసు ఉండగానే బదిలీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత సీనియర్ అయిన కొద్దిమంది ఐఏఎస్‌ల్లో ఒకరిని సీఎస్‌గా నియమిస్తుంటారు. కాబట్టి, ఈ హోదాలో వీరి పదవీకాలం చాలా తక్కువ ఉంటుంది. తన ప్రభుత్వం హయాంలో పనిచేసే ఐఏఎస్‌లను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. అయితే, ఆ బదిలీ ఉత్తర్వులు జారీ చేసేది మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే. అలాంటిది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. సీఎస్‌ను మార్చినప్పుడు లేదా కొత్త సీఎస్‌గా మరొకరు నియమితులైనప్పుడు మాత్రం ఆ ఉత్తర్వులను సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి జారీ చేస్తారు. ఇప్పుడు ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్ కూడా ఆ హోదాలోనే జీఓ జారీ చేశారు.

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అప్పటి ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఎన్నికల సంఘం నియమించింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యాన్నే సీఎస్‌గా కొనసాగించారు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు సీఎస్‌పై ప్రశంసలు గుప్పించారు. కానీ అనూహ్యంగా జగన్ సర్కారు ఆయన్ను ఎందుకు బదిలీ చేసిందనే ప్రశ్న రాజకీయ నేతలతోపాటు సామాన్యుల్లో సైతం తలెత్తుతోంది. కోరి తెచ్చుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు బదిలీ చేశారో చెప్పారంటూ విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. కీలక నిర్ణయాల విషయంలో సీఎం జగన్, సీఎస్ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తిందనీ, అందుకే ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేశారని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు.

This post was last modified on November 7, 2019 11:16 am

Mahesh

Recent Posts

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More

May 16, 2024

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More

May 16, 2024

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More

May 16, 2024

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More

May 16, 2024

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More

May 16, 2024

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి… Read More

May 16, 2024

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

Devara: మే 20వ తారీకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. బ్యాక్ టు బ్యాక్ హిట్… Read More

May 16, 2024