మాలా.. హెలెన్.. నర్గీస్.. వీళ్లెవరో తెలుసా?

Published by
Kamesh

న్యూఢిల్లీ: పైన చెప్పిన పేర్లన్నీ ఎక్కడో విన్నట్లు అనిపిస్తోందా? వాళ్లెవరో మీకు బాగా తెలిసినవాళ్లు అనుకుంటున్నారా? అలనాటి బాలీవుడ్ నటీమణులవి కావచ్చు గానీ, ఆ పేర్లు మాత్రం అత్యంత భయానకమైన తుపాన్లవి. ఒడిశా తీరాన్ని దాటి విధ్వంసం సృష్టించిన ఫొని తుపాను పేరును బంగ్లాదేశ్ సూచించింది. ఇపుడది ఆ దేశానికే వెళ్తోంది. ఫోని అంటే బంగ్లాలో పాము పడగ అని అర్థమని భారత వాతావరణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మొహాపాత్ర తెలిపారు. అసలు తుపానులకు ఈ పేర్లు ఎలా పెడతారో తెలుసా? ఒమన్ లోని మస్కట్ నగరంలో 2000 సంవత్సరంలో జరిగిన ప్రపంచ వాతావరణ సంస్థ సదస్సులో తుపానులకు పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో వచ్చేవాటికి ఈ పేర్లు పెడుతున్నారు. 2004 సెప్టెంబరు నుంచి ఉత్తర హిందూ మహాసముద్రంలో తుపానులకు సభ్యదేశాలన్నీ పేర్లను సూచించడం మొదలైంది.

బంగ్లాదేశ్, భారతదేశం, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్ లాండ్.. ఈ ఎనిమిది దేశాలు ముందుగానే కొన్ని పేర్లను ఎంపికచేసి ఇచ్చేస్తాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఆయా పేర్లను వరసుగా వచ్చే తుపానులకు పెడతారు. జాబితాలో తొలి పేరుగా బంగ్లాదేశ్ ‘ఒనిల్’ అనే పేరు చూసించింది. ఇది అరేబియన్ సముద్రంలో 2004 సెప్టెంబరు, అక్టోబరు నెలల మధ్య సంభవించింది. థాయ్ లాండ్ పేరుపెట్టిన ఫెథాయ్ తుపాను బంగాళాఖాతంలో మొదలై ఆంధ్రప్రదేశ్ లో గత డిసెంబరులో అల్లకల్లోలం సృష్టించింది. తర్వాత భారతదేశం పెట్టిన పేరు వాయు. ఇలా మొత్తం 8 దేశాలు కలిపి 64 పేర్లు సూచించగా వాటిలో 57 అయిపోయాయి. భారతదేశం సూచించిన పేర్లలో అగ్ని, జలి, బిజిలీ, ఆకాష్ లాంటి పేర్లుండగా శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లు మాలా, హెలెన్, నీలోఫర్ లాంటి పేర్లు సూచించాయి.

తుపానులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి వాటి పేర్లను మళ్లీ మళ్లీ పెట్టరు. ఒకవేళ ప్రజలు ఎవరైనా తుపానులకు పేర్లు సూచించాలనుకుంటే దానికి సంబంధించిన ప్రాథమిక నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని ఉత్తర హిందూ మహాసముద్రంలో తుపానులకు పేర్లు పెట్టే విషయంలో ఒక సర్క్యులర్ జారీచేశారు. పేరు చిన్నగా, అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. అవి సాంస్కృతికంగా సున్నితమైనవి కాకూడదు. ఎవరినీ కించపరిచే పేర్లు కాకూడదు. ఆ పేరును వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కు పంపచ్చు.

తుపానులకు పేర్లు పెట్టే విధానాన్ని తొలుత అమెరికాలో ప్రారంభించారని వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ తెలిపారు. అంతకంటే ముందు తుపాను తీరం దాటిన తర్వాత దానికి పేరు పెట్టేవారన్నారు. మొదట్లో అన్నీ ఆడపేర్లే పెట్టేవారని, తర్వాత ఒక పద్ధతి ప్రకారం పెట్టడం మొదలుపెట్టారని ఐఎండీ వివరించింది. 1900 చివరికి ముందు మగ పేర్లు రావడం మొదలయ్యాయి.

Kamesh

Share
Published by
Kamesh

Recent Posts

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024