తెలంగాణ‌లో ర‌చ్చో ర‌చ్చ .. చంపేసే స్థాయికి రాజ‌కీయాలు

Published by
sridhar

రాజ‌కీయాలు అంటే హుందాగా ఉండాలి అని ఆశించే ప‌రిస్థితి ఎప్పుడో దాటిపోయింది. ఒక‌వేళ‌ ఇప్పుడు ఎవ‌రైనా అలా ఆలోచిస్తే వారిది అమాయ‌క‌త్వ‌మే! అంతే క‌దా మ‌రి!

 

తాజాగా ఓ తెలంగాణ నేత‌ను చంపేస్తామ‌ని బెదిరించార‌ట‌. వాళ్లెవ‌రో కాదు సొంత పార్టీ వాళ్లే అని డౌట్ ఉంద‌ట. తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పంచాయతీ ఇలా రంజుగా మారింది. పీసీసీ ఛీఫ్ ప‌ద‌వికి రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయిందనే ప్రచారం జరగడంతో కొత్త కొత్త లెక్క‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

వీహెచ్ సంచ‌ల‌నం … నిన్ను చంపేస్తాం

పీసీసీ చీఫ్ ప‌ద‌వి విష‌యంలో రేవంత్ రెడ్డి కి , సీఎల్పీ నేత భట్టి విక్ర‌మార్క‌కు మధ్యనే ప్రధాన పోటీ ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీలో సీనియర్లు అంతా ఒక అభిప్రాయంతో ఉన్నారని , రేవంత్ కి పార్టీ పగ్గాలు ఇస్తే…సీనియర్లు ఉంటారా..? బయటకు వెళ్తారా. ? అనే చర్చ జరుగుతోంది. అయితే , తాజాగా పార్టీ సీనియ‌ర్ హన్మంత రావు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. రేవంత్ కి పదవి ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు. అయితే ఇలా వీహెచ్ మీడియా ముందుకు వచ్చారో లేదో ఆయనకి బెదిరింపు కాల్స్ మొదలయ్యాయట‌. రేవంత్ గురించి మాట్లాడితే చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అసభ్య పదజాలంతో గుర్తు తెలియని వ్యక్తి దూషించినట్టు చెబుతున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో విహెచ్ ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ రాజ‌కీయం మ‌రి ఈ రేంజ్‌లో ఉంటుందా? అంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

ఢిల్లీలో ఏం జ‌రుగుతోంది ?

మ‌రోవైపు ఢిల్లీలో పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. రైతు ర్యాలీకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు కొద్దీ మంది ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , రేవంత్ టీం లోని కొందరు నాయకులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఒకటి…రెండు రోజుల్లో పీసీసీ చీఫ్ ప్రకటన అధికారికంగా రాబోతుందని చర్చ జరుగుతున్న క్రమంలో అందరూ ఆఖరి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే పదవుల కూర్పుకు సంబందించి… పార్టీ నాయకులు ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు. నేపథ్యంలో ఎవరికి పీసీసీ ఇస్తారు. .? ఎవరిని నచ్చ చెప్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

This post was last modified on December 26, 2020 9:36 am

sridhar

Recent Posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024