YS Viveka: వివేకా కేసులో ఇదే ఫైనల్..! ఆ ఒక్కరి చేతిలో సీబీఐ భవిత..!?

Published by
Srinivas Manem

YS Viveka: ఏపి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏకైక కేసు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ కేసు విషయంలో ఎవరు హత్య చేశారు..? ఎవరు చేయించారు..? ఎందుకు చేయించారు..?  అనే దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా సీబీఐ దర్యాప్తు జరుపుతున్న కేసుల్లో ఇదే అత్యంత క్లిష్టమైన కేసుగా భావించాల్సి వస్తుందేమో..! ఈ కేసులో ఒకే ఒక్క మలుపు.. ఒకే ఒక్క అవకాశం ఉంది. అసలైన నిందితులను నేరస్తులుగా నిరూపించాలి అంటే..అసలైన అనుమానితులను నిందితులుగా చేర్చి నేరస్తులుగా నిరూపించాలి అంటే.. సీబీఐకి ఒకే ఒక్క అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సీబీఐ వినియోగించుకుంటే ఈ కేసు సాల్వ్ అయినట్లే. లేకుంటే మూటా ముల్లే సర్దుకుని సీబీఐ ఢిల్లీకి చెక్కేయాల్సి ఉంటుంది. “మేము చేయలేము బాబోయ్” అని వదిలివేయాల్సి ఉంటుంది. ఆ ఒకే ఒక్క అవకాశం ఏమిటి..? తాజాగా విచారణలో జరుగుతున్న మలుపులు ఏమిటి..? అని పరిశీలన చేస్తే..

YS Viveka case cbi

 

YS Viveka: సీబీఐపై నే ఆరోపణలు

రీసెంట్ గా వివేకా పీఏ కృష్ణారెడ్డి సీబీఐ మీద ఆరోపణ చేస్తూ పులివెందుల కోర్టును ఆశ్రయించారు. వేరే వాళ్ల పేర్లు చెప్పాలంటూ సీబీఐ అధికారి తనపై ఒత్తిడి తెస్తున్నారనీ, దీనికి వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి మద్దతు ఇస్తున్నారని కృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. ఎంత విడ్డూరంగా ఆరోపణలు చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఓ పెద్ద నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి పోలీసులపై ఆరోపణలు చేయవచ్చు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైనే ఆరోపణలు చేయవచ్చు, ఎవరిపైనైనా కంప్లైంట్ చేసి తాత్కాలికంగా తప్పించుకోవచ్చు. దేశంలో ఉన్న వ్యవస్థల కారణంగా, చట్టాల్లో ఉన్న లొసుగుల కారణంగా ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ కేసులో అనుమానితులు ఎవరో తెలుసు.. నిందితులు ఎవరో తెలుసు. అనుమానితులను నిందితులుగా చూపించడం ఒక ప్రక్రియ. నిందితులను నేరస్తులుగా నిరూపించడం మరో ప్రక్రియ. అది సీబీఐ చేయాల్సిన పని. అందుకే ఇప్పుడు అనుమానితులను నిందితులుగా చూపించాలంటే సాక్షాలు, ఆధారాలు ఉండాలి. నిందితులను నేరస్తులుగా చూపించాలంటే ఈ సాక్షాలు, ఆధారాలు కోర్టు నమ్మాలి. దృవీకరించాలి. ఇక్కడే సీబీఐకి చెమటలు పడుతున్నాయి. అందుకే ఇవతల వైపు నుండి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎవరు ఈ కేసును ఛేదించాలని పోరాడుతున్నారో..?  తన తండ్రిని హత్య చేసినందుకు ఎవరు చంపారో..? పట్టుకోమని ఆ కూతురు అడగడం తప్పా..ఆ కూతురు మీద ఇన్ని ఆరోపణలు. ఓ పెద్ద నాయకుడి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేయడం తప్పా. సీబీఐ మీద పెద్ద ఆరోపణలు. ఇప్పుడు సీబీఐ ఏమి చేయాలి..? ఇటువైపు వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని విచారించాలి. ఏమో వీళ్లు సునీతా రెడ్డి, రాజశేఖరరెడ్డి నిజంగా బెదిరించారేమో..! వీళ్ల పైనా విచారణ జరిపించాలి. అలానే సీబీఐ వాళ్లు పది కోట్లు ఇస్తామన్న ఆరోపణపైనా విచారించాలి. ఫిర్యాదు వస్తే విచారించాల్సిందే ఇది మన వ్యవస్థలో ఉంది.

శివశంకరరెడ్డికి నార్కో పరీక్షలు జరిగితే..

అయితే ఇక్కడ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా సీబీఐ తేల్చిన దేవిరెడ్డి శివశంకరరెడ్డిని విచారిస్తే మొత్తం తేలిపోతుంది. నార్కో పరీక్షలకు సీబీఐ కోర్టు అనుమతి కోరింది. ఆ నార్కో పరీక్షలకు కోర్టు ఒప్పుకుంటే నార్కో పరీక్షలు జరిగితే.. దేవిరెడ్డి శివ శంకరరెడ్డి వద్ద ఉన్న మొత్తం వివరాలు బయటకు వచ్చేస్తాయి. అసలు ఏమి జరిగింది..? ఎవరు ప్లాన్ వేశారు..? ఎవరు చేశారు.. ? ఎంత సుపారీ ఇచ్చారు..? తెరవెనుక ఉన్న వ్యక్తులు ఎవరు..? వాళ్లు ఎందుకు ఈ హత్య చేయించారు..? ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఆయన వద్ద ఉందని సీబీఐ అనుమానిస్తోంది. అందుకే ఆయనకు నార్కో పరీక్షలకు అనుమతులు అడిగింది. అయితే నార్కో పరీక్షలకు నిందితుడు ఒప్పుకుంటే ఆ పరీక్షలు జరిగితే కేసు క్లోజ్ అయినట్లే. ఎవరు చేయించారో వాళ్లు కటకటాల వెనక్కు వెళతారు. కానీ ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే శివశంకరరెడ్డికి ఆరోగ్యం బాగోలేదని కడప జైలు నుండి రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి రిమ్స్ వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేయాలని చెప్పడంతో ఇన్ పేషంట్ గా శివశంకరరెడ్డి ఆసుపత్రిలో ఉన్నారు. తన ఆరోగ్య పరిస్థితి కారణంగా నార్కో పరీక్షలకు శివశంకరరెడ్డి అంగీకరించడం లేదు. మరో పక్క అధికార పార్టీ అండదండలు కూడా ఉండటంతో సీబీఐకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

Srinivas Manem

Recent Posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

ED Raids: సార్వత్రిక ఎన్నికల వేళ .. ఝార్ఖండ్ లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఇదంతా లెక్కల్లోకి… Read More

May 6, 2024

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

Brahmamudi:కావ్య,అప్పు ఇద్దరూ కలిసి రాజ్ డబ్బులు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే,… Read More

May 6, 2024

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

Nuvvu Nenu Prema:అరవింద, ఫంక్షన్ హడావిడి అయిపోయిన తర్వాత, తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నాకు చెప్పకుండా… Read More

May 6, 2024

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

కీల‌క‌మైన పార్ల‌మెంటు స్థానాలుగా ఉన్న అన‌కాప‌ల్లి-ఏలూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌చారం సాగుతోంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. నాయ‌కులు స్థానిక‌, స్థానికేత‌ర… Read More

May 6, 2024

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

Krishna Mukunda Murari: కృష్ణా, మురారి హాస్పటల్లో చూపించుకున్నాక తరువాత కృష్ణ సరోగసి మదర్ గురించి మురారిని తెలుసుకోమని చెబుతుంది… Read More

May 6, 2024

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ర‌వి ప్ర‌కాశ్‌! టీవీ 9 మాజీ కార్య‌నిర్వ‌హ‌ణాధికారిగా అంద‌రికీ సుప‌రిచితులే. ఆయ‌న తాజాగా ఆర్‌ పేరుతో డిజిట‌ల్ ఛానెల్ పెట్టుకుని..… Read More

May 6, 2024

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఎటు నిల‌వాలి? ఎటు వైపు ఓటేయాలి? అంటే.. ఇత‌మిత్థంగా చెప్ప‌లేని ప‌రిస్థితివ‌చ్చింది. ఎందుకంటే..… Read More

May 6, 2024

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

విశాఖ పార్ల‌మెంటు వేదిక‌గా ఈ సారి మంచి ర‌స‌వత్త‌ర పోరు చూడ‌బోతున్నాం అని ఆశ‌ప‌డిన పొలిటిక‌ల్ ప్రియుల‌కు ఎన్నిక‌లు దగ్గ‌ర… Read More

May 6, 2024

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

Amit Shah: ఏపీ రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టులపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి… Read More

May 5, 2024

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Escape Room 2 Review: సైకలాజికల్ అండ్ సర్వైవల్, మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ లోకి… Read More

May 5, 2024

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Aa Okkati Adakku Box Office Collections: అలానే నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్రం అంచనాలను… Read More

May 5, 2024

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు పడింది. డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని… Read More

May 5, 2024

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Romeo OTT:  రోమియో సినిమా రిలీజ్ కి ముందు మంచి ఏర్పడిన సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. ట్రైలర్ ఎంటర్టైనర్… Read More

May 5, 2024

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు గెలుపు కోసం.. వ్య‌య ప్ర‌యాస‌లకు ఓర్చుతున్నారు. రోజంగా ఎండ‌ను సైతం లెక్క‌చేయ‌కుండా తిరుగుతూనే ఉన్నారు. ప్ర‌జ‌ల‌కు… Read More

May 5, 2024