Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

Published by
kavya N

Tollywood Actor: పైన ఫోటోలో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ఒక‌ప్పుడు సౌత్ లో స్టార్ హీరో అత‌ను. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు అత్యంత సుప్ర‌సిద్ధుడు. న‌టుడిగా మ‌రియు సింగ‌ర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయ్ అనే ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. పైగా ఈ రోజు అత‌ని బ‌ర్త్‌డే. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో గెస్ చేశారా.. మ‌న‌ సిద్ధార్థ్ అండి బాబు. బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సిద్ధార్థ్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1979 ఏప్రిల్ 17న తమిళనాడులోని మద్రాసులో తమిళం మాట్లాడే కుటుంబంలో సిద్ధార్థ్ జన్మించాడు. న్యూ ఢిల్లీలోని కిరోరి మాల్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా అందుకున్నాడు. ముంబైలోని ఎస్‌.పి. జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ నుండి తన ఎమ్‌బీఏ కంప్లీట్ చేశాడు. చిన్నతనం నుండే సినిమాల్లో కెరీర్‌ను కొనసాగించాలని భావించిన‌ సిద్ధార్థ్‌.. రచన మరియు దర్శకత్వంపై ప్రత్యేక ఆసక్తిని కనబరిచాడు. స్ట‌డీస్ పూర్తి చేసిన‌ తర్వాత యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర మరియు సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్‌ల వద్ద సిద్ధార్థ్ కొన్నాళ్లు శిష్యరికం చేశాడు. వారిద్ద‌రి స‌హాయంతోనే మణిరత్నం యొక్క కన్నతిల్ ముత్తమిట్టల్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ వ‌ర్క్ చేశాడు.

ఈ క్ర‌మంలోనే సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన చాలా మందితో సిద్ధార్థ్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. స్క్రిప్ట్ రైటర్ సుజాత ప‌ట్టుబ‌ట్ట‌డంతో బాయ్స్ మూవీకి సిద్ధార్థ్ ఆడిషన్ ఇచ్చాడు. అనూహ్యంగా అత‌ను సెల‌క్ట్ అయ్యాడు. శంక‌ర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2003లో విడుద‌లై భారీ విజయాన్ని అందుకుంది. దాంతో సిద్ధార్థ్ కు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో సిద్ధార్థ్ తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు. ప్ర‌భు దేవా తెర‌కెక్కించిన ఈ చిత్రం 2005లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. దాదాపు తొమ్మిది భాష‌ల్లో ఈ మూవీ రీమేక్ చేయ‌బ‌డింది.

2006లో వ‌చ్చిన బొమ్మరిల్లు కెరీర్ కు మ‌రో ట‌ర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమాతో సిద్ధార్థ్ స్టార్ అయిపోయాడు. ల‌వ్ బాయ్ ఇమేజ్ తో యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్!, ఓ మై ఫ్రెండ్, బావ‌, జబర్‌దస్త్ వంటి సినిమాలు చేశాడు. కానీ ఇవి ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. దాంతో చాలా ఏళ్ల నుంచి సిద్ధార్థ్ త‌మిళంలోనే సినిమాలు చేస్తూ కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు.

సిద్ధార్థ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. 2003లోనే అత‌ను ఓ ఇంటివాడు అయ్యాడు. న్యూ ఢిల్లీకి చెందిన మేఘన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సిద్ధార్థ్‌, మేఘ‌న దంప‌తుల‌కు ఒక కుమారుడు కూడా జ‌న్మించారు. అయితే పెళ్లై ఒక కొడుకు పుట్టినా కూడా సిద్ధార్థ్ ఇండ‌స్ట్రీకి చెందిన సోహా అలీ ఖాన్, శృతి హాసన్, సమంత ఇలా చాలా మంది హీరోయిన్ల‌తో ల‌వ్ ఎఫైర్లు న‌డిపించాడు. దాంతో 2006లో మేఘ‌న సిద్ధార్థ్ కు విడాకులు ఇచ్చింది. మేఘ‌న‌తో విడిపోయాక సిద్ధార్థ్ స‌మంత‌తో ఆల్మోస్ట్ పెళ్లి వ‌ర‌కు వెళ్లాడు. ఓ గుడిలో సమంతతో కలిసి సిద్దార్థ్ ప్ర‌త్యేక పూజలు కూడా చేశాడు. కానీ వీరు వివాహం చేసుకుండానే విడిపోయారు. ఇక ప్ర‌స్తుతం సిద్ధార్థ్ ప్ర‌ముఖ హీరోయిన్ అదితి రావు హైదరీతో రిలేష‌న్ లో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట‌.. త్వ‌ర‌లోనే మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కాబోతోంది.

https://www.instagram.com/worldofsiddharth/?hl=en

kavya N

Recent Posts

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ACB Raids On ACP: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ… Read More

May 21, 2024

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని సీఎం రేవంత్… Read More

May 21, 2024

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

AP Election 2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ చేసిందని, దీనిపై… Read More

May 21, 2024

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

ఏపీలో వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారుల సంస్థలు… Read More

May 21, 2024

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడంతో ఓ వ్యక్తి… Read More

May 21, 2024

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతి చెందారు.… Read More

May 21, 2024

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More

May 21, 2024

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More

May 21, 2024

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More

May 21, 2024

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Lavanya Tripathi: ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఓ రేంజ్ లో ఉంది. ఒకపక్క గొడవ పడుతూనే మరో… Read More

May 21, 2024

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Srimukhi: ప్రజెంట్ తెలుగులో పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సుమా అనంతరం అంతటిస్తాయి సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.… Read More

May 21, 2024

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Prabhas Kalki OTT: రిలీజ్ కి ముందే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్… Read More

May 21, 2024

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Dhe Promo: బుల్లితెరపై డి షో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి. తెలుగులో అత్యధిక సీజన్లో… Read More

May 21, 2024

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

South Actress: తల్లి ఒడిలో పడుకుని ఫోటోకు క్యూట్ గా పోజిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? సౌత్ ఫిల్మ్‌… Read More

May 21, 2024