Vishwak Sen: టాలీవుడ్ లో ఉన్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. కేవలం నటుడి గానే కాకుండా దర్శకుడుగా, స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా సత్తా చాటుతున్న విశ్వక్ సేన్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు..? సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడు..? వంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. 1995 మార్చి 29న హైదారాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అతను జన్మించాడు. విశ్వక్ సేన్ తండ్రి కరాటే మాస్టర్ మరియు వ్యాపారవేత్త కాగా.. తల్లి గృహిణి. విశ్వక్ సేన్ కు ఒక సోదరి కూడా ఉంది. సికింద్రాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌లో విశ్వక్ సేన్ బాల్యం మొత్తం గడిచింది. విశ్వక్ సేన్ ఇంటిపైన కంప్యూటర్ శిక్షణా సంస్థను నడిపేవారు. దాంతో రెండో తరగతిలోనే అక్కడ కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకున్నారు.
ఆ తర్వాత యానిమేషన్ పై విశ్వక్ మనసు మళ్లింది. దాంతో ఓవైపు స్కూలింగ్ ను కంప్లీట్ చేస్తూనే మరోవైపు యానిమేషన్ పై పట్టు సాధించాడు. ఏషియాలోనే యంగెస్ట్ యానిమేటర్ గా తన పేరును నమోదు చేయించుకున్నాడు. ఆపై సినిమాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయిన విశ్వక్ సేన్.. తల్లిదండ్రుల అనుమతితో ముంబైలో శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ అనంతరం సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ ఎన్ని ఆడీషన్స్ ఇచ్చినా కూడా విశ్వక్ సేన్ కు ఛాన్సులు రాలేదు. అప్పుడే ఆయన తండ్రి న్యూమరాలజీ ప్రకారం దినేష్ నాయుడుగా ఉన్న పేరును విశ్వక్ సేన్ గా మార్చారు.
పేరు మార్చాక అనూహ్యంగా వెళ్ళిపోమాకే చిత్రంలో హీరోగా చేసే అవకాశం వచ్చింది. యాకూబ్ ఆలీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. 2017లో విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించకపోయినా.. ఉత్తమ నటుడిగా విశ్వక్ సేన్ సంతోషం ఫిలిం అవార్డ్ అందుకున్నారు. అయితే సినీ పరిశ్రమలో విశ్వక్ సేన్ ఇదే తొలి చిత్రం అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే విశ్వక్ సేన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ సినిమా చేశారు. 9వ తరగతిలో ఉండంగా జోష్ సినిమాకి హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ కి ఆడిషన్ కి వెళ్తే అక్కడ సెలెక్ట్ అవ్వలేదు. కానీ జగపతిబాబు హీరోగా చేసిన బంగారు బాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే ఛాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో హీరో చిన్నప్పుడు అతన్ని చెడగొట్టే బ్యాచ్ లో విశ్వక్ సేన్ ఒకడిగా నటించాడు. అందుకు గానూ ఒక రోజు షూటింగ్ లో పాల్గొంటే రూ. 900 రెమ్యునరేషన్ ఇచ్చారు. అదే సినీ పరిశ్రమలో విశ్వక్ సేన్ తొలి పారితోషికం. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రయత్నించినా అవకాశాలు రాలేదు. దాంతో యానిమేషన్ నేర్చుకున్నారు. ఆపై యాక్టింగ్ నేర్చుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వెళ్ళిపోమాకే అనంతరం ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమాదాస్ చిత్రాలు విజయం సాధించడంతో విశ్వక్ సేన్ కు మంచి గుర్తింపు వచ్చింది. 2019లో విడుదైలన ఫలక్‌నుమాదాస్ మూవీలో హీరోగానే కాకుండా డైరెక్టర్‌గా, రచయితగా, నిర్మాతగా కూడా పని చేసి విశ్వక్ సూపర్ సక్సెస్ అయ్యారు.
దాంతో అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిట్, పాగల్, అశోకవనంలో అర్జున కల్యాణం ఇలా వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవలె గామి మూవీ హిట్ అందుకున్న విశ్వక్.. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. అందులో మెకానిక్ రాకీ ఒకటి. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలకు సిద్ధంగా ఉంది.
This post was last modified on March 29, 2024 2:22 pm
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More