NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. షర్మిల గెలిచిందేమీ లేదు కానీ… ఆమె నిత్యం చేస్తున్న కామెంట్స్ మాత్రం వివాదాలకు తెర లేపుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కడప నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వైయస్ అవినాష్ రెడ్డి పై షర్మిల పోటీ చేస్తున్నారు.

దీంతో అందరిచూపు కడప ఎంపీ ఎన్నికపైనే ఉంది. ఎలాగైనా గెలిచేందుకు వైఎస్ షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు, వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును, వైయస్ సునీతమ్మకు జరిగిన అన్యాయాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. అటు కడప నియోజకవర్గంలో ఎంపీ టికెట్ గెలిచేందుకు జగన్మోహన్ రెడ్డి తన స్థాయిలో ప్లాన్ రెడీ చేశారు. తన చెల్లిని ఓడించేందుకు స్వయంగా తన సతీమణి వైయస్ భారతిని బరిలోకి దింపారు.

పులివెందులతో పాటు కడప ఎంపీ టికెట్ గెలిపించే పనిని వైయస్ భారతికి అప్పగించారు. దీంతో అవినాష్ రెడ్డి కోసం గ్రౌండ్ స్థాయిలో వైయస్ భారతి ప్రచారం చేస్తున్నారు. దీంతో కాస్త డిఫెన్స్ లోకి పడిపోయిన వైయస్ షర్మిల… మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలకు తెర లేపారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడకూడదని ఎన్నికల అధికారులు స్పష్టంగా చెప్పినప్పటికీ…మళ్లీ అదే అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు షర్మిల. ఇక తాజాగా మరో వివాదానికి తెర లేపారు షర్మిల.

ఎన్నికల పోలింగ్ పూర్తికాగానే ఇండియాను వదిలి అవినాష్ రెడ్డి విదేశాలకు వెళ్తాడని బాంబు పేల్చారు షర్మిల. ఈ మేరకు పాస్పోర్టులు కూడా సిద్ధం చేసుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు వైయస్ భారతికి కూడా కౌంటర్ ఇచ్చారు షర్మిల. మొన్న ప్రచారంలో.. కడపలో సింగిల్ ప్లేయర్ అవినాష్ రెడ్డి అంటూ వైయస్ భారతి కామెంట్ చేశారు. అయితే దానికి షర్మిల తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. అందర్నీ గొడ్డలితో నరుక్కుంటూ వెళ్ళండి… అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అవుతారు అంటూ కౌంటర్ ఇచ్చారు షర్మిల.

ఇలా నిత్యం వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూరా కడప రాజకీయాలు నడుస్తున్నాయి. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును తెరపైకి తీసుకువచ్చి… అవినాష్ రెడ్డి ని ఓడించేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని షర్మిల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే అటు ఎన్నికల కంటే ముందు వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ కేసులో కాస్త ఊరట లభించింది. అలాగే వైయస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ కూడా లభించింది. ఈ రెండు అంశాలు వైయస్ అవినాష్ రెడ్డికి కాస్త అనుకూలిస్తున్నాయి.

తమ కుటుంబం ఎలాంటి అన్యాయం చేయలేదని… వైయస్ వివేకానంద రెడ్డి తనకు దేవుడు లాంటివాడు అంటూ అవినాష్ రెడ్డి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఇలా మొత్తానికి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూరానే వైఎస్ షర్మిల మరియు అవినాష్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. మరి వివేకానందారెడ్డి ఇన్సిడెంట్ ఏ అభ్యర్థికి అనుకూలిస్తుందో చూడాలి.

Related posts

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N