లో బ్యాక్ పెయిన్ తో గత కొంతకాలం నుంచే ఇబ్బంది పడుతున్నవారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం వలన వారిలో వెన్నునొప్పి సమస్య మరింత పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే బెడ్ రెస్ట్ ను మూడురోజులకు మించి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంతగా శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తే సమస్య తీవ్రత తగ్గుతుందని వారంటున్నారు.వెన్నునొప్పికి సరైన మందు వ్యాయామమని గుర్తించాలి. నడక వంటి చిన్నపాటి వ్యాయామాలు వెన్నునొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి. ఐతే, మీ పరిస్థితిని బట్టి ఈ వ్యాయమాలుండాలి.
పరిమితంగానే వ్యాయామం చేయాలి.సింక్ దగ్గర సరైన పోజిషన్ లో నుంచోకపోవడంతో వెన్నుపై యాభైశాతం ఎక్కువ ఒత్తిడి పడటం జరుగుతుంది . సరైన పోశ్చర్ తో వెన్నుపై పడే ఒత్తిడిని తగ్గించడం సాధ్యం.సమస్యను తగ్గించాలంటే ముందుగా మీరు స్పెషలిస్ట్ ను సంప్రదించాలి. వారు మీ సమస్య తీవ్రతను అంచనా వేసి మీకు తగిన సూచనలు అందించి సమస్యను పరిష్కరించడంలో తోడ్పడతారు.అబ్డోమినల్ కండరాలను పటిష్టపరచడం ద్వారా చాలా మంది వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనంపొందగలుగుతున్నారు.ఫ్లెక్సిబిలిటీను పెంపొందించడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలపై అంటే తల నుంచి పాదాల దాకా సమాన బరువు పడుతుంది. దాంతో, ఒకే భాగంపై ఒత్తిడి పడటం తగ్గుతుంది.బరువైనవి ఎత్తేటప్పుడు అలాగే అధిక ఒత్తిడిని కలిగించేటటువంటి యాక్టివిటీస్ కి మాత్రమే బ్రేసెస్ ను పరిమితం చేయాలి. వీటిని పదిహేను నిమిషాలకు మించి వాడకూడదు.హీటింగ్ పాడ్స్ అలాగే కోల్డ్ ప్యాక్స్ వంటివి ఇటువంటి సమయంలో కచ్చితంగా సౌకర్యాన్ని కలిగిస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఐస్ , హీట్ లలో ఏది ఎక్కువ ఉపయోగకరమో చెప్పడం మాత్రం కష్టమే. చర్మాన్ని సంరక్షించుకుంటూ, వీటిలో ఏ పద్దతి సూట్ ఐతే ఆ పద్దతిని పాటించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రించేటప్పుడు మీ పొజిషన్ కూడా సరైన విధంగా ఉండాలి. మీ పొజిషన్ సరైన విధంగా లేనప్పుడు అలాగే మీరు నిద్రించే పరుపు వెన్నునొప్పికి కారకమైనప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుందని గమనించాలి.కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకుందాం .
వెల్లకిలా నిద్రించేవారు మోకాళ్ళకింద తలగడను పెట్టుకోవాలి. పక్కకు తిరిగి నిద్రించేవారు మోకాళ్ళ మధ్యలో తలగడను పెట్టుకోవడం ద్వారా వెన్నును న్యూట్రల్ పొజిషన్ లో ఉంచగలుగుతారు. బోర్లాతిరిగి పడుకునేవారు మెడపై అలాగే వెన్నుపై ఒత్తిడిపడుతుందని గ్రహించాలి.
స్మోకింగ్ వలన ఊపిరితిత్తులు పాడవుతాయన్న విషయం తెలిసినదే. ఐతే, స్మోకింగ్ అనేది వెన్నుసమస్యలను కూడా తీసుకువస్తుందని తెలుసుకోవాలి. కాబట్టి, స్మోకింగ్ కు దూరంగా ఉండటం వలన కూడా వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.డిప్రెషన్ అలాగే ఆందోళన వంటి సమస్యలున్నవారిలో వెన్నునొప్పి సమస్య కూడా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి, ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడండి.అనేక అధ్యయనాలు వెల్లడించిన విషయం ఏంటంటే, ధ్యానం, దీర్ఘ శ్వాస, యోగా వంటివి మనసును ప్రశాంతపరుస్తాయి. వెన్నునొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి, మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత వెన్ను నొప్పి బాధనుండి బయట పడవచ్చు .
This post was last modified on July 28, 2020 6:19 am
Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More
Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్‌కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More
Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More
Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More
Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More
Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More
ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More
రాజకీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవచ్చు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా పట్టొచ్చు. కానీ, అతిగా… Read More
ఎన్నికల సమయంలో నాయకులు ఆచి తూచి వ్యవహరించాలి. వారికి ఉన్న అనుభవం అంతా రంగరిం చాల్సిన సమయం ఎన్నికల వేళే.… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రత్యక్షంగా.. పరోక్షంగా సీఎం జగన్ కెలికేశారు. ఆయన వల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో బలం పుంజుకుందనే… Read More
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More
Aa Okkati Adakku: ఒకప్పుడు థియేటర్స్ లో విడుదలైన చిత్రాలను రెండు నెలలుకో లేదా మూడు నెలలకో టీవీలో చూసేవాళ్ళం.… Read More
Allu Arjun: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది… Read More
NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More