Chewing Gum : చిన్న పిల్లలను చూయింగ్ గమ్ తినవద్దని పెద్దలు వారిస్తూ ఉంటారు. మనం చిన్నప్పటి నుంచి చూయింగ్ గమ్ మింగేస్తే అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని ఎన్నో కథనాలు వినే ఉంటాం. ఈ విషయమై ఎన్నో రకాల అపోహలు ప్రజలలో ఉన్నాయి.
అందులోనూ ముఖ్యంగా చూయింగ్ గమ్ పొరపాటున మింగేస్తే అది కడుపులో పేగులకు చుట్టుకుపోతుందని కడుపులో అలాగే ఉండిపోతుందని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పి భయపెడుతూ ఉంటారు. ఇంతకీ అసలు చూయింగ్ గమ్ మింగేస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా??
సాధారణంగా చూయింగ్ గమ్ లు ఎలాస్టిక్ గుణం కలిగి ఉంటాయి కాబట్టి ఇవి త్వరగా అతుక్కుపోతాయి. మనం వాటిని గంటల తరబడి నమిలినా వాటి పరిమాణం లో ఏమాత్రం మార్పు రాకపోవడానికి కారణం అదే. నిజానికి చూయింగ్ గమ్స్ ని మన శరీరం అరిగించుకోలేదు. కానీ చూయింగ్ గమ్ పొట్టలోని చాలా కాలం ఉండిపోతుంది అనేది మాత్రం నిజం కాదు.
మనం తీసుకునే ప్రతి ఆహార పదార్దాన్ని అరిగించేందుకు మన పొట్ట జీర్ణాశయం ఎంజైమ్స్ ను విడుదల చేస్తుంది. ఆ ఎంజైమ్స్ మన పొట్టలోని ఆహారాన్ని అరిగించి పోషకాలుగా మర్చి రక్తంలోకి ప్రవేశింపజేసి శరీరానికి శక్తిని ఇస్తుంది. అలాగే అరగని కొన్ని ఆహార పదార్థాలు పేగుల ద్వారా మలం రూపంలో శరీరంలో నుంచి బయటకు వెళ్లిపోతాయి. సాధారణంగా చూయింగ్ గమ్ ని అరిగించుకునే శక్తి మన శరీరానికి లేకపోవడంతో చూయింగ్ గమ్ మిగిలిన జీర్ణం కాని ఆహారంతో పాటుగా మలం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది.
అయితే చూయింగ్ గమ్ కి ఇలా శరీరం నుంచి బైటకు వెళ్లడానికి కేవలం 12 నుంచి 48 గంటల సమయం పడుతుంది.. కొన్ని సందర్భాలలో రోజుల సమయం కూడా పట్టవచ్చు. అంతే తప్ప సంవత్సరాల పాటు చూయింగ్ గమ్ మన శరీరంలో నిల్వ ఉండదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా అనుకోకుండా చూయింగ్ గమ్ మింగినట్లైతే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే సరి….
This post was last modified on March 17, 2021 11:10 am
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More