జగన్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న పక్షాలు..!!

Published by
sharma somaraju

 

సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇన్నాళ్లు సంక్షేమ రధాన్ని పరుగులు పెట్టించారు. పరిపాలనా రధాన్ని పట్టాలు ఎక్కించారు. అక్కడక్కడా ఆరోపణలు, వివాదాలు, విమర్శలు వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అన్ని కలిసిన దాఖలాలు లేవు. జగన్ మాటకు ఎదురే లేకుండా రాష్ట్రంలో పరిపాలన సుభిక్షంగా సాగింది. అయితే జగన్ తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం వ్యతిరేక పక్షాలను ఏకం చేసేదిలా ఉంది. ఆ నిర్ణయం అమలు అయితే రైతులకు మేలు జరుగుతుందని వైసిపి ప్రభుత్వం చెబుతుండగా రైతులకు మేలు కంటే కీడే ఏక్కువ అని విపక్షాలు అన్నీ ఆరోపిస్తున్నాయి. అందుకే ప్రభుత్వంపై పోరాడటానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టే దిశగా విపక్షాలు అన్నీ అడుగులు వేస్తున్నాయి.

ap cm ys jagan

వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ అమలులో భాగంగా నగదు బదిలీ విధానానికి మీటర్లు బిగించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా నుండి ఉచిత విద్యుత్ మీటర్ల బిగించే కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, దానిని వ్యతికేకిస్తూ అక్కడి నుండే విద్యుత్ మీటర్లను పగులగొట్టే కార్యక్రమాలకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి కార్యక్రమానికి చేపడతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని నగదు బదిలీగా మార్చడం తగదని ఆయన అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లుగా కన్పిస్తోందని పేర్కొన్నారు. ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా సమైక్యపోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కరోన కేసుల ఉదృతికి ప్రదాన మంత్రి మోడీనే కారణమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. కరోనా పరిస్థితులను అడ్డుపెట్టుకొని బలవంతంగా విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని చూడటం తగదని వడ్డే అన్నారు.

విజయవాడలో వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాల నేతలు, సామాజిక ఉద్యమ కారులు, విశ్లేషకులతో చర్చా వేదిక నిర్వహించి దీనిపై ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ జి గంగాధర్, రైతు సంఘాల సమాఖ్య రాష్ట నాయకుడు ఏర్నేని నాగేంద్రనాధ్, ఏఐకెఎస్ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య , రాజకీయ విశ్లేషకులు సయ్యద్ రఫీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు వై కేశవరావు తదితరులు మాట్లాడుతూ నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ కు ఆయన తనయుడు జగన్ తూట్లు పొడవడం దుర్మార్ఘమైన చర్య అని అన్నారు. కరోనా సమయంలో ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా విద్యుత్ మీటర్లు బిగింపు ను పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. గతంలో విద్యుత్ మీటర్ల బిగింపును ఎన్ టి ఆర్ వ్యతిరేకించారని గుర్తు వారు చేశారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుగుణంగా మీటర్ల వ్యవస్థను ప్రవేశపెడితే దానిపై పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చిందని పేర్కొన్నారు. విద్యుత్ మీటర్ల బిగింపు చర్యలను ప్రభుత్వం తక్షణమే విడనాడాలని నేతలు డిమాండ్ చేశారు.

sharma somaraju

Recent Posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More

May 3, 2024

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More

May 3, 2024

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More

May 3, 2024

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

Madhuranagarilo May 3 2024 Episode 353:  రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More

May 3, 2024

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More

May 3, 2024

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More

May 3, 2024

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More

May 3, 2024

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు.… Read More

May 3, 2024

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు… Read More

May 3, 2024

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి డైమండ్ బజార్. నెట్ఫ్లిక్స్ లో బుధవారం అనగా… Read More

May 3, 2024

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Neethone Dance: బిగ్బాస్ రన్నర్ గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నట్టు అఖిల్. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్… Read More

May 3, 2024

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

Venkatesh-Roja: అత్యధిక చిత్రాల నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు రెండవ కుమారుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దగ్గుబాటి వెంకటేష్.. చాలా… Read More

May 3, 2024