చటాన్‌పల్లి ప్రాంతానికి పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

Published by
Mahesh

హైదరాబాద్: దిశ హంతకుల ఎన్‌కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి ప్రాంతాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం పరిశీలించింది. ఎన్‌కౌంటర్ పై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు ఎన్‌కౌంటర్ జరిగిన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. శనివారం ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న నలుగురు ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు.. చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద కాల్పులు జరిగిన ప్రదేశంలో పర్యటించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. అనంతరం, దిశ నిందితుల మృతదేహాలను భద్రపరిచిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. ఎన్‌కౌంటర్ లో మరణించిన నలుగురి మృతదేహాలను, పోస్టుమార్టం నివేదికలను కూడా పరిశీలించారు. ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పర్యటన నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణలోని చటాన్ పల్లి వద్ద దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ పోలీసులకు శుక్రవారం ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీచేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్చార్సీ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు ఆందజేయాలని పోలీసులను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది.

దిశ కేసులో షాద్ నగర్ సమీపంలోని చటాన్‌పల్లి ఫ్లైఓవర్ కింద మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును శుక్రవారం(డిసెంబర్ 6) తెల్లవారు జామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. కేసు సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం సంఘటనాస్థలానికి తీసుకెళ్లగా వారు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ ఘటన మొత్తాన్నీ జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుంది. మీడియాలో వచ్చిన కథనాలఆధారంగా కేసు స్వీకరించింది. వెటర్నరి డాక్టర్ దిశ అత్యాచారానికి, హత్యకు గురైన శంషాబాద్ తొండుపల్లి టోల్ గేట్ సమీపంలోని స్థలాన్ని, కాలిపోయిన స్థితిలో దిశ మృతదేహం లభించిన చటాన్ పల్లి ఫ్లైఓవర్ ప్రాంతాన్ని నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది. నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చే నివేదికకు ప్రస్తుతం పోలీసులు చెబుతోన్న కారణాలు, సంఘటనాలో గుర్తించిన ఆధారాలు, మీడియా కథనాలను క్రోడీకరించిన అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయనుంది.

This post was last modified on December 7, 2019 3:09 pm

Mahesh

Recent Posts

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More

May 11, 2024

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న… Read More

May 11, 2024

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More

May 11, 2024

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More

May 11, 2024

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More

May 11, 2024

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More

May 11, 2024

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More

May 11, 2024

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More

May 11, 2024

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

రాజ‌కీయాల్లో నేత‌ల ప్ర‌భావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది… Read More

May 11, 2024

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More

May 11, 2024

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More

May 11, 2024

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More

May 11, 2024

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More

May 11, 2024