గుంటూరు సబ్‌జైలుకు ఎంపీ గల్లా!

Published by
Mahesh

అమరావతి: గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. సోమవారం అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన ఎంపీ గల్లా జయదేవ్‌కు మంగళగిరి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. మంగళగిరి మేజిస్ట్రేట్ బెయిల్ నిరాకరించడంతో పోలీసులు ఆయనను తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించారు.

ఎంపీ గల్లా జయదేవ్ అరెస్ట్‌తో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. సోమవారం అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన జయదేవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత జయదేవ్‌ను దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నరసరావుపేట.. అక్కడి నుంచి రొంపిచర్ల స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆయనపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. రొంపిచర్ల పోలీస్‌స్టేషన్‌ నుంచి గుంటూరుకు తీసుకువచ్చి అర్ధరాత్రి వరకు పోలీసుల వాహనంలోనే కూర్చోబెట్టారు. గల్లా జయదేవ్ అరెస్ట్ గురించి తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు,అనుచరులు.. ఆయన్ను తరలిస్తున్నా కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత అర్ధరాత్రి 12.30 గంటలకు జీజీహెచ్‌ వైద్యులతో జయదేవ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు హైడ్రామా కొనసాగింది. గల్లాను వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి మూడు గంటలకు మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. బెయిల్ కోసం ప్రయత్నించగా.. మంగళగిరి మేజిస్ట్రేట్ నిరాకరించారు. ఎంపీ గల్లాకి జనవరి 31వరకు రిమాండ్ విధించడంతో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు గుంటూరు సబ్ జైలుకి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు జైలు దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు. పోలీసుల తీరుపై గల్లా జయదేవ్ మండిపడ్డారు. తనపై పోలీసులు దాడి చేశారని.. తన చొక్కా చించేశారని.. తన ఒంటిపై ఉన్న దెబ్బల్ని కూడా చూయించారు. తన తాత బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్లారని.. తాను కూడా ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామికమైన నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లానన్నారు. అమరావతి కోసం తన పోరాటం కొనసాగుతుందని ఎంపీ స్పష్టం చేశారు

మరోవైపు ఎంపీ గల్లా జయదేవ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారని. దీంతో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. రాళ్ల దాడి చేసినవారిపై కేసులు నమోదు చేశామన్నారు. అసెంబ్లీ ముగిసే వరకు రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్టు ఎస్పీ విజయరావు వెల్లడించారు.

This post was last modified on January 21, 2020 10:58 am

Mahesh

Recent Posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More

May 8, 2024

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More

May 8, 2024

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More

May 8, 2024

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More

May 8, 2024

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More

May 8, 2024