టిటిడిపై జగన్ దృష్టి

Published by
sharma somaraju

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు డైరెక్టర్‌ల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. బోర్డు డైరెక్టర్‌ల నియామకానికి సంబంధించి  టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బుధవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

జూన్ 22వ తేదీన వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్‌గా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి రెండు మాసాలు దాటినప్పటికీ పాలకమండలి సభ్యుల నియామకం జరగకపోవడంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొన్నది.

టిటిడి బోర్డులో చోటు కోసం నేతల నుండి పోటీ ఎక్కువగా ఉండటంతో డైరెక్టర్‌ల ఎంపిక ఆలస్యమవుతోందని భావిస్తున్నారు. సిఎంతో టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి నేడు ప్రత్యేకంగా భేటీ కావడంతో డైరెక్టర్‌ల ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో నియామకాలు పూర్తి చేసే అవకాశం ఉందని  భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా టిటిడి పాలకమండలిలో తెలంగాణ కోటాలో చోటు కోసం పలువురు నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌‌తో తెలంగాణ సిఎం కెసిఆర్‌కు సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన ద్వారా టిటిడి బోర్డులో చోటు దక్కించుకునేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావులతో పాటు ఒకరిద్దరు టిఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు కూడా టిటిడి డైరెక్టర్ పదవులను ఆశిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024