Nitin Gadkari: ఏపి సర్కార్ పై కేంద్ర మంత్రి గడ్కరీ ప్రశంసలు

Published by
sharma somaraju

Nitin Gadkari:  ఓ పక్క పార్టీ పరంగా బీజేపీ నేతలు రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వంపై రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నారు. కానీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న కేంద్ర మంత్రులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. తాజాగా కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. గత నెల రాష్ట్ర పర్యటనలకు విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ తర్వాత వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ విమర్శించారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవేళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుపతిలో రూ.2,900 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Nitin Gadkari

 

అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ రూ.500 కోట్లతో ఏపి ప్రభుత్వం – నేషనల్ హైవే సంస్థ మధ్య ఎంవోయూ కుదిరిందన్నారు. తిరుపతిలో ఇంటర్నేషనల్ సెంట్రల్ బస్ స్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ ఆర్కక్ టెక్ నిర్మాణం చేస్తామని అన్నారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర నిధులు రాబట్టడంలో పని తీరు కనబరుస్తున్నారని గడ్కరీ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు  మేజర్ పోర్టులను అభివృద్ధి చేస్తొందన్నారు. దేశంలోనే విశాఖపట్నం మేజర్ పోర్టు అని, దాని అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా ఏపీలో మరింత పారిశ్రామికాభివృద్ధి జరుగనుందని తెలిపారు. దేశంలో ఏడు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులు అభివృద్ది చేస్తున్నామని మంత్రి తెలిపారు.

కాగా తిరుపతి ఎంపీ గురుమూర్తి .. కేంద్ర మంత్రి గడ్కరీకి పలు విజ్ఞప్తులు చేశారు. రూ.500 కోట్లతో తిరుపతి బస్టాండ్ విస్తరణ చేయాలని గడ్కరీని కోరారు. కపిల తీర్ధం నుండి అంజిమేడు రోడ్డడు అభివృద్ధి చేయాలని కోరారు. తడ – శ్రీకాళహస్తి మద్య స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చాలనీ, తిరుపతి – తిరుత్తణి – చెన్నై జాతీయ రహదారిని సిక్స్ లైన్స్ జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.

NIA Court: హైదరాబాద్ సహా దేశ వ్యాప్త బాంబు పేలుళ్ల కేసులో నలుగురు ఉగ్రవాదులకు పదేళ్ల జైలు శిక్ష

sharma somaraju

Recent Posts

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్ లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్ర… Read More

May 12, 2024

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

Ravi Teja: చిత్ర పరిశ్రమలో కథలు ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. ఒక హీరో… Read More

May 12, 2024

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Big Breaking: ప్రస్తుత కాలంలో అనేక ప్రమాదాలు జరుగుతున్న సంగతి మనం చూస్తూనే ఉంటున్నాం. ఇక ఇటువంటివి సాధారణమైన మనుషులకి… Read More

May 12, 2024

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

Kona Venkat: బాపట్ల జిల్లాలో సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పై కేసు నమోదైంది. దళిత యువకుడిపై దాడి… Read More

May 12, 2024

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

Kriti Sanon: టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో కృతి స‌న‌న్… Read More

May 12, 2024

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవేళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధులతో కలిసి ఫుట్… Read More

May 12, 2024

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

Aparichithudu: గత కొంతకాలం నుంచి తెలుగు తమిళ భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో… Read More

May 12, 2024

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి… Read More

May 12, 2024

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక సోమవారం రోజున ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో చివరి రోజు అయిన… Read More

May 12, 2024

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెగా కుటుంబంలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో... అందరు… Read More

May 12, 2024

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాజకీయ నాయకులందరూ ఇండ్లల్లోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్… Read More

May 12, 2024

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయ‌న‌ను ఓడించాల‌నే వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే.… Read More

May 12, 2024

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More

May 12, 2024

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More

May 11, 2024