Allu Arjun: లెజెండరీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారి మనవడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్.. భారీ బ్యాక్గ్రౌండ్ కు తోడు తనదైన ప్రతిభతో హీరోగా నిలదొక్కుకున్నాడు. అద్భుతమైన నటన, స్టైల్, డాన్సులతో టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయాలు వచ్చినప్పుడు విర్రవీగకుండా, పరాజయాలు పలకరించినప్పుడు కృంగిపోకుండా కెరీర్ ను చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగాడు. ప్రాంతీయ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. సక్సెస్ ఫుల్ హీరోగా, వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నాడు.
అటువంటి అల్లు అర్జున్ ఒకానొక సమయంలో ప్రముఖ హీరో శ్రీకాంత్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడని మీకు తెలుసా..? బహుశా అతని అభిమానులకు కూడా ఈ విషయం తెలిసుండదు. ఇంతకీ అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శ్రీకాంత్ మూవీ మరేదో కాదు పెళ్ళాం ఊరెళితే. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో శ్రీకాంత్, వేణు తొట్టెంపూడి హీరోలుగా నటించారు. సంగీత, రక్షిత హీరోయిన్లుగా చేస్తే.. సునీల్, జ్యోతి, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
తమిళ సూపర్ హిట్ మూవీకి చార్లీ చాప్లిన్ (2002)కి రీమేక్ ఇది. అల్లు అరవింద్, సి. అశ్వనీ దత్ కలిసి నిర్మించిన పెళ్ళాం ఊరెళితే చిత్రం 2003లో విడుదలై మంచి విజయం సాధించింది. ఉత్తమ వినోద చిత్రంగా సంతోషం ఫిల్మ్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. అయితే పెళ్ళాం ఊరెళితే సినిమాకు కొద్ది రోజుల పాటు అల్లు అర్జున్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేశాడట. అప్పటికీ ఇంకా అల్లు అర్జున్ హీరోగా ఇండస్ట్రీలోకి రాలేదు. కానీ తన డెబ్యూ మూవీ గంగోత్రికి సిద్ధం అవుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే సినిమాల గురించి అల్లు అర్జున్ కు ఒక అవగాహన రావాలని అల్లు అరవింద్ భావించారు. సరిగ్గా అదే సమయంలో ఆయన పెళ్ళాం ఊరెళితే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. పైగా ఎస్వీ కృష్ణా రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాలపై కృష్ణా రెడ్డికి ఎంతో నాలెడ్జ్ ఉంది. వర్క్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. క్రమ శిక్షణకు బ్రాండ్ అంబాసిడర్ ఆయన. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న అల్లు అరవింద్ తన కుమారుడిని ఎస్వీ కృష్ణా రెడ్డి వద్ద పెళ్ళాం ఊరెళితే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టారు.
అయితే ఎస్వీ కృష్ణా రెడ్డి యొక్క డెడికేషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసి అల్లు అర్జున్ మొదట చాలా భయపడ్డారట. క్రమంగా ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నారు. సినిమాలపై ఒక అవగాహన పెంచుకున్నారు. ఇక పెళ్ళాం ఊరెళితే సినిమాకు అల్లు అర్జున్ అసిస్టెండ్ డైరెక్టర్ గా పని చేశాడన్న విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణా రెడ్డి స్వయంగా బయటపెట్టారు.
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More