Family Star: ఫ్యామిలీ స్టార్ ఎదుట భారీ టార్గెట్‌.. ఇంత‌కీ టాక్ ఎలా ఉందంటే..?

Published by
kavya N

Family Star: గీతగోవిందం వంటి సూపర్ హిట్ అనంతరం టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు పరశురాం పెట్ల కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష నిర్మించిన ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. వాసుకి, రోహిణీ హట్టంగడి, అభినయ, అజయ్ ఘోష్, జ‌గ‌ప‌తి బాబుతో స‌హా ఎంతో మంది న‌టులు ఈ చిత్రంతో ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించ‌గా.. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గెస్ట్ లో రోల్ లో మెరిసింది. గోపీ సుందర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు.

ఫ్యామిలీ స్టార్ టీజర్, ట్రైలర్ మరియు సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో భారీ అంచనాలు నడుమ తెలుగు మ‌రియు త‌మిళ భాష‌ల్లో నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ స్టార్ టాక్ ఎలా ఉంది..? అసలు ఈ మూవీ కి బిజినెస్ ఎంత జరిగింది..? హిట్ కొట్టాలంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత..? వంటి ఆస‌క్తిక‌ర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్‌లో కూడా రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వ‌స్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ అని.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప‌ర‌శురాం త‌మ స‌క్సెస్ కాంబోను మ‌రోసారి నిరూపించుకున్నార‌ని అంటున్నారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్ బాగా పండాయ‌ని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంద‌ని.. వీరిద్ద‌రి స్క్రీన్ ప్ర‌జెన్స్ ఆక‌ట్టుకుంద‌ని సినీ ప్రియులు చెబుతున్నారు. ప్ర‌స్తుత మిడిల్ క్లాస్ ప్రాబ్ల‌మ్స్‌ను ఫ‌న్నీ వేలో చ‌క్క‌గా చూయించార‌ని.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు హిట్ ఖాయ‌మ‌ని అంటున్నారు.

అయితే ఫ్యామిలీ స్టార్ పై మ‌రోవైపు నెగ‌టివ్ టాక్ కూడా గ‌ట్టిగానే స్ప్రెడ్ అవుతోంది. ఫ్యామిలీ స్టార్ మూవీ సీరియ‌ల్ లా ఉంద‌ని.. కొత్త‌ద‌నం ఏం లేద‌ని.. రొటీన్ స్టోరీ అంటూ ఎక్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని.. ప్రీ ఇంటర్వెల్ ముందు వరకు చాలా స్లోగా సీరియల్ గా ఉందంటూ చెబుతున్నారు. సెకండాఫ్ లో ఎమోష‌న్స్ బాగానే పండినా, ఏ మాత్రం ఇంప్రెసివ్‌గా లేదని.. అక్కడక్కడా కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయని చెప్పుకొస్తున్నారు. మ్యూజిక్ వ‌రెస్ట్ గా ఉంద‌ని, కామెడీ అంత‌టా వ‌ర్కౌట్ అవ్వ‌లేద‌ని అంటున్నారు. అంచ‌నాలు పెట్టుకుని సినిమాకు వెళ్తే క‌చ్చితంగా నిరుస్సాప‌డ‌తార‌ని అంటున్నారు.

ఇక ఫ్యామిలీ స్టార్ బిజినెస్ విష‌యానికి వ‌స్తే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు స‌రైన హిట్ ప‌డి చాలా కాల‌మే అయినా కూడా వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ. 43 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. దీంతో రూ. 44 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఫ్యామిలీ స్టార్ మూవీ నేడు బ‌రిలోకి దిగింది. ఇక మిక్స్డ్ టాక్ వ‌చ్చినా కూడా లాంగ్ వీకెండ్‌, ఉగాది పండుగ, స‌మ్మ‌ర్ హాలిడేస్ మ‌రియు పోటీగా మ‌రే పెద్ద‌ సినిమా లేక‌పోవ‌డంతో ఫ్యామిలీ స్టార్ బ్రేక్ ఈవెన్ సాధించ‌వ‌చ్చ‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

kavya N

Recent Posts

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More

May 18, 2024

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More

May 18, 2024

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024