Aparna Das: ఒకప్పుడు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకునేందుకు మక్కువ చూపేవారు కాదు. ఎందుకంటే అప్పట్లో వివాహం తర్వాత హీరోయిన్లకు ఇండస్ట్రీలో కెరీర్ ఉండేది కాదు. సహాయక పాత్రల కోసమే వారిని తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. చాలా మంది హీరోయిన్లు పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత కూడా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు తారలు ఒక వయసు రాగానే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మరొక బ్యూటీ చేరేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ నటి అపర్ణ దాస్ చిన్న వయసులోనే ఓ ఇంటిది కాబోతోంది.
అపర్ణ దాస్ మలయాళ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. అలాగే తమిళ్, తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. 1995 ఒమన్ లోని మస్కట్ లో స్థిరపడిన మలయాళ కుటుంబంలో అపర్ణ జన్మించింది. కాలేజీ రోజుల్లో అపర్ణ మోడలింగ్ లోకి ప్రవేశించింది. పలు సంస్థలకు మరియు పత్రికలకు మోడల్ గా వర్క్ చేసింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఓ సంస్థలో ఆమె అకౌంటెంట్‌గా కొద్ది రోజులు ఉద్యోగం చేసింది. 2018లో సత్యన్ అంతికాడ్ రూపొందించిన సెటైరికల్ కామెడీ చిత్రం న్జన్ ప్రకాశన్ తో అపర్ణ సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో గుర్తింపులేని పాత్రలో నటించింది.
2019లో మనోహరం అనే చిత్రంలో వినీత్ శ్రీనివాసన్ సరసన కథానాయికగా నటించింది. తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించి వెండితెరపై గుర్తింపు సంపాదించుకుంది. 2022 బీస్ట్ మూవీతో అపర్ణ కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించాడు. ఇందులో హోం మినిస్టర్ కుమార్తె మరియు ఒక ఐపీఎస్ ట్రైనీ పాత్రలో అపర్ణ కనిపించింది. 2023లో వచ్చిన దాదా మూవీతో అపర్ణకు బిగ్ బ్రేక్ వచ్చింది.
గణేష్ కె. బాబు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో కవిన్ మరియు అపర్ణా దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన దాదా మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో అపర్ణ భారీ క్రేజ్ సంపాదించుకుంది. అపర్ణ తెలుగులో ఒక సినిమా చేసింది. వైష్ణవ్ తేజ్ హీరోగా గత ఏడాది విడుదలైన ఆదికేశవ చిత్రంలో అపర్ణ ఓ కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆనంద్ శ్రీబాల అనే మలయాళ మూవీలో అపర్ణ దాస్ యాక్ట్ చేస్తోంది.
ఇదిలా ఉంటే.. మరికొన్ని గంటల్లో అపర్ణ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. 2024 ఏప్రిల్ 24న ప్రముఖ మలయాళ నటుడు దీపక్ పరంబోల్ ను అపర్ణ వివాహం చేసుకోబోతోంది. 28 ఏళ్లకే ఏడడుగులు వేయబోతోంది. హీరోయిన్ అపర్ణ చేసిన డెబ్యూ మూవీ మనోహరంలో దీపక్ కూడా నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇప్పుడు అపర్ణ మరియు దీపక్ తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లబోతున్నారు. పెద్దల అంగీకారంతో రేపు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అపర్ణ దాస్ హల్దీ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More