Krishna: బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ నిర్మాణం ఎన్టీఆర్ గారు కన్న కల. విశ్వామిత్ర తనకు నచ్చిన పాత్ర అని.. ఆయన ఆ కథతో సినిమా చేయాలని చెబుతూ ఉండేవారట. సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఎన్టీఆర్ ఆ కలను వదిలిపెట్టలేదు. విశ్వామిత్రుడు ప్రథమపుత్రుడు ఆంధ్రుడు కాబట్టి అప్పటికి మన దేశానికి ఆంధ్రప్రదేశ్ అని పేరు వచ్చిందని ఆయన చెబుతూ ఉండేవాడు. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన కొంతకాలం తర్వాత ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ షూటింగ్ ప్రారంభించాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సినిమాల్లో నటించడం ఏంటని విమర్శలు వినిపించిన ఆయన అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఇక బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రారంభోత్సవానికి జాతీయస్థాయి రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. మీనాక్షి శేషాద్రి మేన కాగా ఎంపికయ్యారు. ఇందులో బాలయ్య హరిశ్చంద్రుడిగా, దుశ్చంతుడి గా ఈ మూవీలో రెండు పాత్రలు పోషించాడు. తెలుగు తో పాటు హిందీలో కూడా ఈ చిత్రం నిర్మాణం ప్రారంభించారు ఎన్టీఆర్.
ఇక్కడే ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ పాలనను ఆయన ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొన్ని చిత్రాలు నిర్మించారు. హీరో కృష్ణ నటించిన సినిమాలు అధిక స్థానం విజయవంతం అయ్యాయి కూడా. ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రానికి పోటీగా 1989లో కృష్ణ హిందీలో ఒక చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే ఎన్టీఆర్, కృష్ణ మధ్య వార్ నడుస్తుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తాను పోటీ చేస్తానని కృష్ణ జిల్లాకు కానీ, గుంటూరు జిల్లాకు లేదా ఎన్టీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నుంచే పోటీ చేయడానికి రెడీ అని హీరో కృష్ణ ప్రకటించారు. హిందీ సినిమా కోసం అమితాబ్ ని సంప్రదించారు కృష్ణ. అయితే అప్పటికే ఆయన చాలా సినిమాలు ఒప్పుకునే బిజీగా ఉన్నాడు.
అందుకే ఈ సినిమాలో నటించలేనని కృష్ణ గారికి చెప్పేశాడు అమితాబ్. ఎన్టీఆర్ కి పోటీగా వచ్చే చిత్రంలో అమితాబ హీరోగా నటిస్తేనే దానికి దీటుగా ఉంటుందని.. తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అమితాబ్‌ని ఒప్పించాడు కృష్ణ. ఇక ఆ సమయంలో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ నిర్మిస్తున్న బ్రహ్మర్షి విశ్వమిత్రా హిందీ వర్షన్ ని దెబ్బతీయడానికి కృష్ణ తీసే ఈ సినిమాకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మద్దతు పలికింది. సాంఘిక కధానంతో రూపొందించుకుంటున్న ఈ చిత్రాన్ని పద్మాలయ స్టూడియోలో తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాన్ని 1989 శాసనసభ ఎన్నికల నాటికి విడుదల చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేశారు. రాజకీయాలతో పాటు బిజీగా ఉండడం వల్ల ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. దీంతో బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ విడుదలను వాయిదా వేశారు.
ఇక ఆ సినిమా అప్పట్లో విడుదల కాదని అందరూ అనుకున్నారు. హీరో కృష్ణ కూడా అలాగే అనుకుని తాను తీయాలనుకునే హిందీ సినిమాని డ్రాప్ చేసుకున్నాడు. అందరి ఊహలకు మరియు అంచనాలకు భిన్నంగా వ్యవహరించడం ఎన్టీఆర్ కి బాగా అలవాటు. బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాన్ని 1991లో విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకుని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆ ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేశారు. ప్రారంభం నుంచే ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉండడంతో బయ్యర్లు సినిమా కొనడానికి పోటీ పడ్డారు. అంతకు ముందు ఏ సినిమా కొనని హయ్యస్ట్ రికార్డ్ ధరకు బ్రహ్మర్షి విశ్వామిత్రను కొన్నారు బయ్యర్లు. ఇక ఈ చిత్రానికి పోటీగా విడుదల చేయడానికి నిర్మాతలు కాస్త వెనకడుగు వేశారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత నటించిన చిత్రం కావడంతో దీనికి అంత క్రేజ్ వచ్చింది. ఇక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
YSRCP MLA: వైసీపీ ఎమ్మెల్యే, మాచర్ల అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల… Read More
ACB Raids On ACP: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ… Read More
CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని సీఎం రేవంత్… Read More
AP Election 2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ చేసిందని, దీనిపై… Read More
ఏపీలో వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారుల సంస్థలు… Read More
Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడంతో ఓ వ్యక్తి… Read More
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతి చెందారు.… Read More
Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More
Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More
Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More
Harom Hara Release Date: హరోం హర మూవీ సుదీర్ బాబు కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ గారు… Read More
Lavanya Tripathi: ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఓ రేంజ్ లో ఉంది. ఒకపక్క గొడవ పడుతూనే మరో… Read More
Srimukhi: ప్రజెంట్ తెలుగులో పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సుమా అనంతరం అంతటిస్తాయి సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.… Read More
Prabhas Kalki OTT: రిలీజ్ కి ముందే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్… Read More
Dhe Promo: బుల్లితెరపై డి షో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి. తెలుగులో అత్యధిక సీజన్లో… Read More