ఏపీలో అధికారం సులభం కాదు..!! రాం మాధవ్ వ్యాఖ్యల వెనుక..!!

Published by
DEVELOPING STORY

సోము వీర్రాజు వ్యాఖ్యలకు భిన్నంగా..ప్రతిపక్షం ఖాళీ

ఏపీకీ మూడు రాజధానులు అవసరమా..

 

ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2024లో ఏపీలో బీజేపీ కూటమి అధికారంలో వస్తుందని ఆయన ఏపీ అధ్యక్షుడి తరహాలో పార్టీ నేతల్లో ధీమా కల్పించే ప్రయత్నం చేసారు. కానీ, అదే వేదిక పై నుండి పార్టీ జాతీయ నేత రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో భిన్నాభిప్రాయాలకు వ్యక్తం అయింది. రాం మాధవ్ ఏపీలో బీజేపీ అధికారంలోకి రావటం అంత సులభమైన విషయం కాదంటూ కీలక వ్యాఖ్య చేసారు. ఇది జగన్ బలం పైన ఉన్న అంచనాలతోనే ఈ వ్యాఖ్యలు చేసారనే చర్చ మొదలైంది. అదే సమయంలో టీడీపీ పైన పరోక్షంగా మండిపడ్డారు. అసలు ఏపీలో ప్రతిపక్షం లేదని..ఖాళీగా ఉందంటూనే బీజేపీ ఆ పాత్ర పోషించాలని సూచించారు. మూడు రాజధానుల  పైనా రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలోనే ఒక్క రాజధాని ఉండగా..ఏపీకి మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. అయితే, అది రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పుకొచ్చారు. గతంలో ఒక్క రాజధాని విషయంలో జరిగిన అవినీతిని ప్రశ్నించిన బీజేపీ..మూడు రాష్ట్రాల పేరుతో జరిగే అవినీతిని ప్రశ్నించాలంటూ పిలుపునిచ్చారు.

Somu Veerraju takes charge in Amaravati

 

వీర్రాజు వ్యాఖ్యలకు భిన్నంగా..ఒకే వేదిక నుండి..

ఇతర పార్టీలకు భిన్నంగా బీజేపీ సమిష్టి నాయకత్వంలో పని చేస్తుందని ఆ పార్టీ జాతీయ నేత రాం మాధవ్ చెప్పుకొచ్చారు. కానీ, ఆయన అంతకు ముందు బీజేపీ ఏపీ నూతన చీఫ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఏపీలో 2024లో అధికారంలోకి వస్తామని వీర్రాజు చెప్పుకొచ్చారు. కానీ, రాం మాధవ్ ఆ వ్యాఖ్యలతో విభేదించారు. ఏపీలో అధికారంలోకి రావటం అంత సులభమైన విషయం కాదని సభా వేదికగా తేల్చి చెప్పారు. 2024లో అధికారంలోకి వస్తామనేది స్లోగన్ గా మారకూడదని..తిరిగి 2024లో అధికారంలోకి రాకపోతే..తిరిగి 2029 లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమనేది అప్పుడు స్లోగన్ గా మిగులుతుందని చెప్పడంతో బీజేపీ నేతలు కంగుతిన్నారు. రాం మాధవ్ ఉన్నదే చెప్పారనేది కొందరు బీజేపీ నేతలు ఆ వ్యాఖ్యలను సమర్ధించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కేవలం మాటలు చెప్పి చేతలకు దూరంగా ఉండకూడదనేది రాం మాధవ్ భావన అని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో ఏపీలో ప్రతిపక్షం లేదంటూ టీడీపీని రాజకీయంగా చాలా లైట్ గా తీసుకున్నట్లు వ్యాఖ్యలు చేసారు. అయితే, 2024లో అధికారం సాధ్యం కాదనే విషయాన్ని రాం మాధవ్ చెప్పకనే చెప్పారు. టీడీపీ ఉనికే లేదంటున్న రాం మాధవ్ ఏపీలో వైసీపీ బలంగా ఉందనే విషయం పరోక్షంగా అంగీకరించినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ సమయంలో రాం మాధవ్ వ్యాఖ్యలు బీజేపీ నేతలకు ఇబ్బంది కరంగా కనిపిస్తున్నాయి.

rammadhav hints not easy to win 2024

మూడు రాజధానుల పైనా ఇలా..

ఇక… రాం మాధవ్ ఏపీలో వివాదాస్పదంగా మారిన మూడు రాజధానుల అంశం పైనా కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో ఎక్కడా మూడు రాజధానుల కాన్సెప్ట్ లేదని..ఏపీలో మాత్రం దీనిని అమలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. రాజధానుల విషయంలో కేంద్రం రాజ్యంగ బద్దంగా వ్యవహరించి..రాష్ట్ర పరిధిలోనిదని తేల్చి చెప్పందని గుర్తు చేసారు. ఏపీ జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉన్న ఉత్తర ప్రదేశ్ లో ఒక్కటే రాజధాని ఉందని..ఏపీలో మాత్రం మూడు రాజధానులు చేస్తున్నారని తప్పు బట్టారు. యూపీలో ఒకటే రాజధానిగా ఉన్న లక్నో నుండి పాలన సాగటం లేదా అని ప్రశ్నించారు. గతంలో ఒక్క రాజధాని ఏర్పాటులో జరిగిన అవినీతి పైన పోరాటం చేసామని..ఇప్పుడు మూడు రాజధానుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అమరావతి రైతులకు న్యాయం జరిగేలా పోరాటాలు సాగించాలన్నారు. రాజధాని వ్యవహారం ప్రస్తుతం సబ్ జుడిస్ లో ఉందని..పార్టీ నేతలు ఆచి తూచి స్పందించాలని సూచించారు. మొత్తంగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానిని విశాఖ లో పరిపాలనా రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించాలని నిర్ణయించిన వైసీపీ ప్రభుత్వం..రాజకీయంగా బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ రాజధానుల విషయంలో చేసిన వ్యాఖ్యల పైన ఏ రకంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.

DEVELOPING STORY

Recent Posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More

May 11, 2024

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More

May 11, 2024

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More

May 11, 2024

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

రాజ‌కీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా ప‌ట్టొచ్చు. కానీ, అతిగా… Read More

May 11, 2024

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. వారికి ఉన్న అనుభ‌వం అంతా రంగ‌రిం చాల్సిన స‌మ‌యం ఎన్నిక‌ల వేళే.… Read More

May 11, 2024

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని ప్ర‌త్యక్షంగా.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కెలికేశారు. ఆయ‌న వ‌ల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకుంద‌నే… Read More

May 11, 2024

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More

May 11, 2024

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More

May 11, 2024

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

Aa Okkati Adakku: ఒకప్పుడు థియేటర్స్ లో విడుద‌లైన చిత్రాలను రెండు నెలలుకో లేదా మూడు నెలలకో టీవీలో చూసేవాళ్ళం‌.… Read More

May 11, 2024

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

Allu Arjun: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది… Read More

May 11, 2024

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More

May 11, 2024