`వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్`, `లౌక్యం`, `నాన్నకు ప్రేమతో`, `సరైనోడు`, `ధృవ` వంటి సూపర్ హిట్ మూవీస్‌లో అటు గ్లామరస్‌గా కనిపిస్తూనే ఇటు నటనతోనూ అందరి ప్రశంసలతో తెలుగు, హిందీ, తమిల్, భాషల్లో నటిస్తోంది పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా సూర్య హీరోగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ‘ఎన్.జి.కె.(నంద గోపాల కృష్ణ)’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ అందిస్తున్నారు. ఈ చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూ..
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి?
– `ఎన్.జి.కె` అనేది ఒక క్రిటికల్ థ్రిల్లర్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు వానతి. ఒక పొలిటికల్ సినారియోలో ఉన్న క్యారెక్టర్. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఒక మంచి లీడర్‌కు ఉండవలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆమె మైండ్‌లో ఎలా ఆలోచిస్తుంది అనేది ఆమెకు మాత్రమే తెలుసు. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ నేను ప్లే చేయలేదు.
దర్శకుడు శ్రీ రాఘవతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
-శ్రీ రాఘవ సర్‌తో పని చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన షూట్ చేసిన స్టైల్, క్యారెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన సెట్లో క్లాప్ ఉండనే ఉండదు. ఎందుకంటే క్లాప్ చూస్తే యాక్టర్స్‌కి డిప్రెషన్ వస్తుంది. ఎంత పెద్ద డైలాగ్ చెబుతున్నా సరే ఐస్ బ్లింక్ చేయకూడదు. నేననే కాదు అందరూ యాక్టర్స్‌కి ఇదే రూల్. అయన కాన్సెప్ట్ అర్ధం చేసుకోవడానికి మూడు రోజులు పట్టింది. అలాగే ఇంకో మూడు సెకండ్స్ రూల్ ఉంది. అదేంటంటే యాక్షన్ చెప్పిన తరువాత త్రీ సెకండ్స్ ఆగి డైలాగ్ చెప్పాలి. ఇద్దరు యాక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా త్రీ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్లీ డైలాగ్ చెప్పాలి. కారణాలేమైనా కావొచ్చు కానీ ఒక యాక్టర్‌కి ఇవి న్యూ వేవ్ ఆఫ్ షూటింగ్ అనే చెప్పాలి.
ఆ రూల్స్ ఎందుకని మీరు అడిగారా?
– అడిగాను ఒక యాక్టర్ డైలాగ్ చెపుతున్నపుడు ఐస్ బ్లింక్ చేస్తే పెద్ద స్క్రీన్ మీద ఆ డైలాగ్ ఆడియన్స్‌కి డిస్కనెక్ట్ అవుతుంది అని చెప్పారు. అలాగే ఎక్కువ బ్రీతింగ్ చేస్తే బాడీ మూమెంట్ అవుతుంది అలా చెయ్యొద్దు. అందుకనే ఆయన సినిమాలు చూస్తే ప్రతి క్యారెక్టర్ లోనూ ఒక రకమైన ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ తమ కళ్ళతోనే మాట్లాడగలవు. అందుకే ఆ పాత్రలు ఏమి ఆలోచిస్తున్నాయో ఎవ్వరికి తెలీదు అంత జాగ్రత్తగా ఉంటుంది. ఇక త్రీ సెకండ్స్ రూల్ ఎందుకంటే టేక్ చెప్పగానే డైలాగ్ చెప్తే మనం ఇప్పుడు డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉన్నాం అని తెలుస్తుంది. అలా కాకుండా ఒక త్రీ సెకండ్స్ వెయిట్ చేసి చెపితే ఆడియన్స్ అది ఫీల్ అవ్వరు అని చెప్పారు.
ఈ క్యారెక్టర్ కోసం ఏమైనా రీసెర్చ్ చేశారా?
– రీసెర్చ్ అంటూ ఏమి చేయలేదు. అలాగని మనం ముందే ప్రిపేర్డ్‌గా వెళ్లినా సరే దర్శకుడు మనల్ని వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాడు. అందుకే ప్రతి రోజు ఒక బ్లాంక్ మైండ్‌తో షూట్‌కి వెళ్లే దాన్ని. అప్పుడే ఆయన చెప్పింది మనం జాగ్రత్తగా చేయగలం. అందుకే ప్రతి ఒక్కరు ఒకసారైనా శ్రీ రాఘవ దర్శకత్వంలో పని చేస్తే వాళ్ళ పెర్ఫామెన్స్ ఎన్హన్స్ చేసుకోవచ్చు. నాకు అలాంటి అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
సూర్యతో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు కదా ఎలా అనిపించింది?
– వెరీ నైస్. సూర్యగారు ఎక్స్ట్రీమ్లీ స్వీట్. అంత పెద్ద స్టార్ అయినా కూడా చాలా డీసెంట్‌గా ఉంటారు. సూర్యసర్ కన్నా ముందే నేను షూట్‌కి వెళ్ళాను. నీకు ఓకే నా నాకే కష్టం అవుతోంది నీకు తమిళ్ రాదు కదా యాక్టింగ్ ఏమైనా ఇబ్బంది అవుతోందా? అని అన్నారు. అంత జాగ్రత్తగా చూస్తారు. అయన సెట్లో ప్రతి ఒక్కరు బావుండాలి అనుకుంటారు.
సాయి పల్లవి మీ కాంబినేషన్లో సీన్స్ ఉన్నాయా?
– ఉన్నాయండి. ఈ సినిమాలో మా ఇద్దరి కాంబినేషన్లో నాలుగైదు సీన్లు ఉన్నాయి. సాయి పల్లవి కూడా చాలా బాగా చేసింది. ఆమె కూడా చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్..
యువన్ శంకర్ రాజా మ్యూజిక్ గురించి?
– ఇది ఒక ఇంటెన్స్ ఉన్న పొలిటికల్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమాలో ఒకే పాట ఉంది. అది నాకు సూర్య సర్కి మధ్య ఉండే రొమాంటిక్ సాంగ్. ఆ సాంగ్‌కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది.
తెలుగులో ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నారు?
– ప్రతేకమైన రీజన్ అంటూ ఏమి లేదు. ఒక సంవత్సరంలో 365 డేస్ ఉంటాయి. అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నపుడు కొంచెం గ్యాప్ రావడం సహజమే.. అలాగే ఈ సంవత్సరంలో నావి అన్ని భాషలలో కలిపి ఆరు సినిమాలు విడుదలవుతాయి.
ఈ మధ్య అజయ్ దేవగణ్ ఒక ప్రెస్ మీట్లో బాలీవుడ్ ఫ్యూచర్ రకుల్ అన్నారు కదా?
– అవును. ఈ మధ్యే నేను అజయ్ దేవగణ్ కలిసి నటించిన ‘దే దే ప్యార్ దే’ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. ఆ సినిమాలో నా క్యారెక్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సినిమా కోసమే దాదాపు ఆరు నెలలు కష్టపడి చేశాను. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ పొటెన్షియల్ ఏంటో నాకు తెలుసు. కానీ ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని ఇండస్ట్రీల నుండి ఫోన్ చేసి అభినందిస్తున్నారు. అలాగే ఆ ఆర్టికల్ నిజమైతే చాలా బాగుంటుంది.(నవ్వుతూ)
`మన్మధుడు 2` షూటింగ్ ఎలా ఉంది?
– చాలా బాగుంది. నాగ్ సర్‌తో కలిసి నటించడం చాలా కొత్త ఎక్స్పీరియన్స్. సినిమా స్టోరీ అయితే నేను రివీల్ చేయలేను కానీ నా క్యారెక్టర్ చాలా యంగ్ రోల్. సినిమా చాలా బాగా వస్తోంది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. అంటూ ఇంటర్వ్యూ ముగించింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More
AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More
YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More
Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More
Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్‌కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More
Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More
Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More
Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More
Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More
ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More
రాజకీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవచ్చు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా పట్టొచ్చు. కానీ, అతిగా… Read More
ఎన్నికల సమయంలో నాయకులు ఆచి తూచి వ్యవహరించాలి. వారికి ఉన్న అనుభవం అంతా రంగరిం చాల్సిన సమయం ఎన్నికల వేళే.… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రత్యక్షంగా.. పరోక్షంగా సీఎం జగన్ కెలికేశారు. ఆయన వల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో బలం పుంజుకుందనే… Read More
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More