అసెంబ్లీలో మాటల యుద్ధం

Published by
sharma somaraju

అమరావతి: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ అధికార, విపక్ష సభ్యుల వాగ్వివాదానికి దారి తీసింది. అధికార పక్ష సభ్యులు గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని  ఆరోపిస్తే విపక్ష సభ్యులు ప్రతివిమర్శలు చేశారు.

గవర్నర్ ప్రసంగంలో అభివృద్ధి, సంక్షేమం వివరాలు ఏమిలేవనీ, రాజధాని అమరావతి నిర్మాణలపై ఒక్క ముక్క చెప్పలేదని  టిడిపి నేత అచ్చెన్నాయుడు అన్నారు. పట్టిసీమ వృధా ప్రాజెక్టు అయితే మోటార్లు ఆన్ చేయడం మానండి అని అచ్చెన్నాయుడు అన్నారు. మోటార్లు ఆన్ చేయడం మానేస్తే రైతులకు ఎంత ఆగ్రహం వస్తుందో మీరే చూస్తారని అచ్చెనాయుడు పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ఖర్చుపైనే కాదు, ప్రయోజనాలపైనా మాట్లాడాలని అచ్చెన్నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 70శాతం పూర్తి చేశామనీ, మిగిలిన 30శాతం పనులు త్వరగా పూర్తి చేయాలని అచ్చెన్నాయుడు కోరారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి తన ప్రసంగంలో గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రకృతి సంపదను టిడిపి ప్రభుత్వం నాశనం చేసిందని గోవర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదని గోవర్థన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందనీ, పేదవారికి ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మించలేదని గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీ విషయంపై గోవర్థన్ రెడ్డి  మాట్లాడుతూ తనిఖీలు చేయకుండా ఉండటానికి చంద్రబాబు ఏమన్నా చట్టానికి అతీతుడా అని ప్రశ్నించారు.

మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తన ప్రసంగంలో నీరు చెట్టు ప్రాజెక్టులో, ధర్మపోరాట దీక్షల పేరుతో, పోలవరం నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీ నుండి కేవలం 23మందే గెలిచారనీ ‘ఆలీబాబా 23దొంగలు’ అని అనిల్ అన్నారు.  దీనిపై టిడిపి సభ్యుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఐదేళ్లలో సమర్థవంతమైన పాలన అందించిందనీ, కొన్ని కారణాల వల్ల ఓడిపోయామని అచ్చెన్నాయుడు అన్నారు. ఏమి తెలియని అనిల్ కుమార్ ఇప్పుడు మంత్రి అయి చంద్రబాబుకే ఇరిగేషన్ పాఠాలు చెబుతుంటే బాధేస్తోందని అచ్చెన్నాయుడు అన్నాడు. దీనికి అనిల్ కుమార్ స్పందిస్తూ తనకేం తెలియకున్నానేర్చుకుంటాననీ, మంగళగిరిని మందలగిరి అని కూడా పలకలేని వాడిని కాదని సెటైర్ వేశారు. కనీసం ఎన్నికల్లో గెలవలేని వ్యక్తిని మంత్రిగా చేసిన ఘనత టిడిపిదేనని అనిల్ నారా లోకేష్‌ను ఉద్దేశించి అన్నారు.

ప్రతిపక్షంలో కూర్చున తరువాతైనా మాజీ మంత్రి అచ్చెన్నాయుడులో మార్పు వస్తుందని అనుకున్నాము కానీ ఇప్పటికీ ఆయనలో మార్పు రాలేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు పట్టుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత టిడిపి ప్రభుత్వానిదేనని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో సర్పంచ్‌లను కాదనీ జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇచ్చారనీ అందుకే ప్రజలు తమకు 151 సీట్లు ఇచ్చారని అన్నారు. గత ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు అప్పు చేశారనీ బుగ్గన ఆరోపించారు. పట్టిసీమలో 400కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాగ్ వెల్లడించిందని బుగ్గన అన్నారు. పట్టిసీమ బదులు పోలవరం పనులు వేగవంతం చేస్తే ఇప్పటికే పూర్తి అయ్యేదని బుగ్గన అన్నారు. టిడిపి హయాంలో అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్లు తప్ప మరొకటికాదని బుగ్గన ఎద్దేవా చేశారు.

వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ విపక్షం నుండి సద్విమర్శలు చేస్తే స్వాగతిస్తామనీ, అంతుచూస్తామంటూ మాట్లాడితే మాత్రం ఊరుకునేలేదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేల గురించి అంబటి మాట్లాడుతూ గెలిచేది తామే రాసుకో రాసుకో అని చెప్పిన వారెవరూ ఇక్కడ లేరు, ఒక్క అచ్చెన్నాయుడే ఉన్నారు. ఆయనా రేపుండరు అనగా అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటమి సర్వసాధారణమనీ, ఓటమి పాలైన వారు అసమర్థులు కారని అచ్చెన్నాయుడు అన్నారు. సభలో లేని వారి పేర్లు ప్రస్తావించడం ఏమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

This post was last modified on June 17, 2019 3:12 pm

sharma somaraju

Recent Posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న… Read More

May 11, 2024

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More

May 11, 2024

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More

May 11, 2024

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More

May 11, 2024

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More

May 11, 2024

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More

May 11, 2024

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More

May 11, 2024

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

రాజ‌కీయాల్లో నేత‌ల ప్ర‌భావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది… Read More

May 11, 2024

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More

May 11, 2024

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More

May 11, 2024

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More

May 11, 2024

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More

May 11, 2024

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More

May 11, 2024