‘న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు’

Published by
sharma somaraju

కర్నూలు: ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుందనీ, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని అన్న పేర్లు గతంలో ఏక్కడా వినలేదనీ బిజెపి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన వైసిపి ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ దృష్టిలో విశాఖనే రాజధాని అని బైరెడ్డి అన్నారు. మూడు రాజధానులు అనేది ఒక నాటకం, నయవంచన అని విమర్శించారు. జిఎన్ రావు కమిటీ నివేదిక అనేది ఒక ఫార్స్ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు నుండే వైజాగ్‌లో విజయసాయి రెడ్డి తిష్టవేసి కార్యక్రమాలను చక్కబెట్టారని బైరెడ్డి విమర్శించారు. ఏసి రూమ్‌లలో కూర్చుని రియల్టర్లు రాసి ఇచ్చిందే జీఎన్‌ రావు కమిటీ రిపోర్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయ రాజధాని అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. తల వైజాగ్‌కు ఇచ్చి, తోక మీద వెంట్రుక రాయలసీమకు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. కోస్తాంధ్రలో సీట్ల కోసమే నాడు జగన్ అమరావతికి  ఆమోదం తెలిపారని బైరెడ్డి అన్నారు.

అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టడానికి ఇదేమన్నా బొమ్మల కొలువా అని వ్యాఖ్యానించారు. ఒక సారి ఏర్పాటు అయిన రాజధానిని మరొక చోటకు తరలించాలనుకోవడం అవివేకమే అవుతుందన్నారు. ఇటువంటి నిర్ణయాలపై న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని అన్నారు. మంత్రివర్గ నిర్ణయం తరువాత ప్రభుత్వం విడుదల చేసే జివోలు, నిర్ణయాలపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఛాలెంజ్‌లు, పిటిషన్‌లు ఉంటాయని బైరెడ్డి చెప్పారు. ఇల్లు అలకగానే పండుగ కాదు, ముందుంది ముసళ్ల పండుగ అంటూ బైరెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలు వాయించే మేళానికి జగన్ అండ్ కంపెనీ డ్యాన్స్ ఆడాల్సి ఉంటుందని బైరెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు.

హైకోర్టు కాదు సుప్రీం కోర్టు ఇచ్చినా రాయలసీమ దరిద్రం పోదని అన్నారు. తమ ప్రాంతానికి నికర జలాలు, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు రావాలి, వలసలు అగాలి అప్పుడే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని బైరెడ్డి పేర్కొన్నారు.

 

 

This post was last modified on December 26, 2019 5:40 pm

sharma somaraju

Recent Posts

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవేళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధులతో కలిసి ఫుట్… Read More

May 12, 2024

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

Aparichithudu: గత కొంతకాలం నుంచి తెలుగు తమిళ భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో… Read More

May 12, 2024

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి… Read More

May 12, 2024

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక సోమవారం రోజున ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో చివరి రోజు అయిన… Read More

May 12, 2024

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెగా కుటుంబంలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో... అందరు… Read More

May 12, 2024

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాజకీయ నాయకులందరూ ఇండ్లల్లోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్… Read More

May 12, 2024

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయ‌న‌ను ఓడించాల‌నే వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే.… Read More

May 12, 2024

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More

May 12, 2024

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More

May 11, 2024

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More

May 11, 2024

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More

May 11, 2024

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024