దేశంలో ఆర్ధిక మాంద్యం లేదట!

Published by
Mahesh

న్యూఢిల్లీ: భారత దేశంలో ఆర్ధిక మందగమనం లేదట. ఈ మాట చెప్పింది మరెవరో కాదు స్వయాన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఇందుకు సాక్ష్యం ఇటివల విడుదలైన సినిమాలే కారణమని ఆయన చమత్కరించారు. అక్టోబర్‌ 2న విడుదలైన మూడు సినిమాలు రూ.120 కోట్ల వసూళ్లు రాబట్టడంతో ఇక దేశంలో ఆర్ధిక మాంద్యం ఎక్కడుందని ప్రశ్నించారాయన. దేశంలో ఆర్ధిక మందగమనం లేదనడానికి సినిమాల కలెక్షన్లే నిదర్శమని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం శనివారం ముంబై వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బేసిగ్గా నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్. వాజపేయి హయాంలో ఐబీ మంత్రిగా సినీ ఫీల్డ్​ను దగ్గర్నుంచి చూశా. దేశంలో మూవీ మార్కెట్​ జోరుగా సాగుతోంది. మొన్న గాంధీ జయంతి నాడు నేషనల్​ హాలిడే. ఆ ఒక్కరోజే బాలీవుడ్​లో విడుదలైన మూడు పెద్దసినిమాలు 120 కోట్ల కలక్షన్లు వచ్చాయని నా ఫ్రెండ్స్​ చెప్పారు. సినిమాలే ఇంత బాగా ఆడుతున్నప్పుడు ఇక ఆర్థిక మాంద్యం ఎక్కడిది? ఎకానమీపై ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు”అని మంత్రి రవిశంకర్​ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎలెక్ట్రానిక్స్ పరిశ్రమ, తయారి పరిశ్రమ, ఐటి ఇండస్ట్రీ, ముద్ర ఋణాలు, వాణిజ్యం, సేవల విభాగాలు చక్కగానే పనిచేస్తున్నాయని ఉటంకించారు. అదికాకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలో భారత్ ప్రపంచంలో 11 వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఫ్రాన్స్ ను సైతం తలదన్ని ప్రపంచ స్థాయిలో ఐదవ ఆర్ధిక శక్తిగా నిలిచిందని చెప్పారు.

ఇక నేషనల్ శాంపిల్ సర్వే అఫీస్ డాటాపై మాట్లాడుతూ, తాము ఇచ్చిన 10 రకాల గణాంకాలను ఎక్కడా నివేదికలో చూపించ లేదన్నారు. ‘ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదు. కొంత మంది వ్యక్తులు వ్యూహాత్మకంగా తప్పదారి పట్టిస్తున్నారు’  అని రవిశంకర్ అన్నారు. ఎన్ఎస్ఎస్ఓ  మన దేశ నిరుద్యోగం గత నలభై ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయిందంటున్నారు. అది 2017-18 సంవత్సరానికి 6.1 గా ఉందని ఒక ప్రముఖ ఆర్ధిక పత్రిక బిజినెస్ స్టాండర్డ్ ను ఉటంకిస్తూ.. 1972-73 సంవత్సరంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉండేదని, 2011-12 ఆర్ధిక సంవత్సరాలకు అది 2.2% మాత్రమేగా రికార్డైదని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

అక్టోబర్‌ 2న సైరా, వార్‌, జోకర్‌ .. మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు కలిపి రూ. 120 కోట్ల వసూళ్లు రాబట్టాయి. భారత దేశవ్యాప్తంగా ఆర్ధిక మందగమనం అనేక రంగాలను కుదేలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ప్రభుత్వం దీన్ని అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. పన్నులు తగ్గించడంతో పాటు, బ్యాంకుల విలీనం లాంటి ప్రక్రియలను చేపట్టింది. అయితే జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయినవేళ కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

This post was last modified on October 13, 2019 2:57 pm

Mahesh

Recent Posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More

May 11, 2024

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More

May 11, 2024

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More

May 11, 2024

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

రాజ‌కీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా ప‌ట్టొచ్చు. కానీ, అతిగా… Read More

May 11, 2024

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. వారికి ఉన్న అనుభ‌వం అంతా రంగ‌రిం చాల్సిన స‌మ‌యం ఎన్నిక‌ల వేళే.… Read More

May 11, 2024

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని ప్ర‌త్యక్షంగా.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కెలికేశారు. ఆయ‌న వ‌ల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకుంద‌నే… Read More

May 11, 2024

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More

May 11, 2024

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More

May 11, 2024

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

Aa Okkati Adakku: ఒకప్పుడు థియేటర్స్ లో విడుద‌లైన చిత్రాలను రెండు నెలలుకో లేదా మూడు నెలలకో టీవీలో చూసేవాళ్ళం‌.… Read More

May 11, 2024

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

Allu Arjun: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది… Read More

May 11, 2024

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More

May 11, 2024