బ్రహ్మరధం పట్టారు!

Published by
Siva Prasad

Photo Courtesy: Ysr Congress party

అమరావతి:  నవ్యాంధ్రలో ప్రజలు ఇచ్చిన తీర్పును వైసిపి ఆధినేత జగన్మోహన రెడ్డి కూడా బహుశా ఊహించి ఉండరు. తన విజయం గురించి ఆయనకు ఎప్పుడూ అనుమానం లేదు, తనను నిన్న మొన్న కలిసిన సన్నిహితులతో కూడా ఆయన 30 తేదీన ప్రమాణస్వీకారం అని చెప్పారు. అయితే గురువారం ఇవిఎంలను తెరిస్తే కనబడిన మద్దతు మాత్రం ఆయన ఊహల్లో కూడా ఉండిఉండదు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌కు బ్రహ్మరధం పట్టారు. కావాలి జగన్, రావాలి జగన్ అని  ఆ పార్టీ సృష్టించిన స్లోగన్‌కూ జనం మనస్సుల్లో ఉన్న ఆకాంక్షకూ సరిపోయింది. వైసిపి గుర్తు ఫ్యాన్ ఇంత సునామీ ఎలా సృష్టించగలిగింది? టిడిపి పరాజయం పాలయినా మరీ ఇంత అవమానకరమైన  ఓటమి ఎక్కడ ప్రాతిపదిక ఏర్పడింది?

ఈ సునామీ ఉధృతి తగ్గిన తర్వాత, పూర్తిగా వోటింగ్ సరళి తేలిన తర్వాత లోతైన విశ్లేషణలు ఎటూ వస్తాయి. ఇప్పటికిప్పుడు విశ్లేషించదలిస్తే మాత్రం జగన్‌కు ఒకసారి అవకాశం ఇవ్వాలన్న మాట జనంలో చొచ్చుకువెళ్లిందని చెప్పాలి. వైసిపికి ఎన్నికల సలహాదారుగా  వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించింది.

ఎన్నికల ముందు జగన్ చేసిన పాదయాత్రను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆయన 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల దూరం నడిచారు. దారిలో ఆయన పలకరించిన జనం, కలిసిన జనం ఎంతోకొంత ప్రభావితం కాకపోతే ఎన్నికలలో ఇలాంటి ఫలితం సాధ్యం కాదు. ప్రజప్రస్థానం పేరిట 2004 ఎన్నికల ముందు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలానే పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను గెలిపించారు. 2009 సెప్టెంబర్‌లో హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించేనాటికి వైఎస్ విశేషమైన ప్రజాభిమానాన్ని గడించారు. తనకంటూ వ్యక్తిగతంగా ఒక వోటుబ్యాంకు తయారుచేసుకున్నారు. ఆ అభిమానం చాలావరకూ చెక్కుచెదరకుండా ఉందని ఈ విజయం ద్వారా అర్ధమవుతున్నది.

అటు అధికారం నిలుపుకోవడానికి పోరాడిన చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి కూడా ఎంతోకొంత జగన్ విజయానికి తోడ్పడింది. గత అయిదేళ్లలో టిడిపి శాసనసభ్యులు కొందరు విపరీతంగా అవినీతికి పాల్పడిన విషయం ప్రజలలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు కూడా దానిని అరికట్టలేకపోయారు. ఎమ్మెల్యేలు మూటకట్టుకున్న అవినీతి ఎన్నికలలో ఇబ్బంది కలిగిస్తుందని ఆయన ఊహించారు. అందుకే తనను చూసి వోటు వేయాలని ఆయన ప్రజలను ప్రచారంలో కోరారు. ప్రజలు అందుకు సిద్దంగా లేరని రుజువయింది. టిడిపి హయాంలో కొన్ని సామాజిక వర్గాలు ఆ పార్టీకి దూరమ్యయాయి. ఒకే సామాజికవర్గం పెత్తనం ఎక్కువ అయిందన్న భావన క్రమేపీ బాగా బలపడింది. ఇటీవలి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్‌లో టిడిపి అభ్యర్ధులకు వ్యతిరేకంగా అన్నిసామాజికవర్గాలూ ఏకం అయ్యాయి. ఇప్పుడు ఎపిలో కూడా దాదాపుగా అదే జరిగిందని ఆనుకోవాలి. పసుపు కుంకుమ వంటి పధకాలు గట్టెక్కిస్తాయన్న ఆశ కూడా గల్లంతవడం చూస్తే మరోటి అనుకునేందుకు లేదు.

జనసేన స్థాపించి రంగంలోకి దిగిన సినీస్టార్ పవన్ కల్యాణ్ ఎవరి వోట్లు చీలుస్తారన్న విషయమై చాలా చర్చ జరిగింది. టిడిపితో పాటు వైసిపికి కూడా జనసేన వల్ల నష్టం ఉంటుందని చాలామంది భావించారు. కానీ టిడిపికే నష్టం జరిగినట్లు కనబడుతోంది. ఏయే సీట్లలో ఎంతమేరకు అనేది వోటింగ్ వివిరాలు వచ్చిన తత్వాత మాత్రమే తేలుతుంది. మొత్తం మీద వైసిపి గుర్తు ఫ్యాన్ నవ్యాంధ్రలో సునామీ సృష్టించింది.

 

 

This post was last modified on May 24, 2019 10:55 am

Siva Prasad

Recent Posts

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More

May 11, 2024

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న… Read More

May 11, 2024

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More

May 11, 2024

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More

May 11, 2024

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More

May 11, 2024

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More

May 11, 2024

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More

May 11, 2024

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More

May 11, 2024

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

రాజ‌కీయాల్లో నేత‌ల ప్ర‌భావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది… Read More

May 11, 2024

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More

May 11, 2024

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More

May 11, 2024

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More

May 11, 2024

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More

May 11, 2024