కమల్ హాసన్ పై చెప్పుల దాడి

Published by
Kamesh

చెన్నై: సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్.. నాథూరాం గాడ్సేపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై చెప్పులతో దాడి జరిగింది. తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరాంకుంద్రం అసెంబ్లీ నియోజకవర్గ ప్రచారంలో ఉండగా ఈ ఘటన జరిగింది. స్వతంత్ర భారత దేశంల తొలి ఉగ్రవాది అయిన గాడ్సే ఒక హిందువని ఆయన ఇంతకుముందు వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమాన్ సేన సభ్యులు కలిపి మొత్తం 11 మందిపై చెప్పులు విసిరారని పోలీసులకు ఫిర్యాదు అందింది. కమల్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతుండగా వాళ్లు ఆయనపై చెప్పులు విసిరారు. చెప్పులు నేరుగా ఆయనకు తగల్లేదు గానీ, జనంలో పడిపోయాయని పోలీసులు చెప్పారు.

మహాత్మాగాంధీని చంపిన గాడ్సేపై కమల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అరవకురిచిలో ఆదివారం ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది ముస్లిం ప్రాబల్య ప్రాంతం కాబట్టి నేనీ విషయం చెప్పడం లేదు. కానీ గాంధీ విగ్రహం వద్ద నిలబడి చెబుతున్నా. స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి తీవ్రవాది హిందువు. అతడి పేరు నాథూరాం గాడ్సే. అక్కడే అది మొదలైంది’’ అన్నారు. ఆదివారం నాడు అవరకురిచి, తిరుప్పరాంకుంద్రం సహా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక ఉంది. ఈ ఎన్నికల్లో కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) తరఫున అభ్యర్థులు బరిలో ఉన్నారు.

కాగా, కమల్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఖండించారు. ‘‘కమల్ వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఆయన హిందూ ఉగ్రవాదం గురించి మాట్లాడారు. మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇలా మాట్లాడి ఆయన మత ఘర్షణలను రెచ్చగొడుతున్నారు. ఎన్నికల సంఘం కమల్ హాసన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె ట్వీట్ చేశారు. తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ కూడా కమల్ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించి, ఆయన నాలుక కోసేయాలన్నారు. ఉగ్రవాదానికి మతం లేదని వాళ్లు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు కారని అన్నారు. కమల్ వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీసు కేసు నమోదైంది. అయితే తాను చెప్పింది చారిత్రక సత్యమని కమల్ అన్నారు. తాను ఒక మతాన్ని గురించి ఎలా చెబుతానని అడిగారు. మద్రాస్ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు.

Kamesh

Recent Posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More

May 18, 2024

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More

May 18, 2024

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More

May 18, 2024

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024