టీడీపీ ఎమ్మెల్సీలకు వైసీపీ వల?!

Published by
Mahesh

అమరావతి: ఏపీలో శాసన మండలిని రద్దు చేసే దిశగా జగన్ సర్కారు అడుగులేస్తున్న వేళ.. ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలకు అధికార పార్టీ వల విసురుతోందని తెలుస్తోంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించడంతో మండలి రద్దు దిశగా సీఎం జగన్ సంకేతాలిచ్చారు. శాసన మండలిని కొనసాగించాలా? రద్దు చేయాలా? అనే విషయమై ఏపీ అసెంబ్లీలో సోమవారం చర్చించనున్నారు. అయితే, మండలిలో బలం పెంచుకోవడం కోసం వైసీపీ ఇతర పార్టీల ఎమ్మెల్సీలకు గాలం వేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రయత్నాలతో మండలిలో వైఎస్సార్సీపీకి మెజార్టీ వస్తే.. అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్‌ను తొలగించాలని.. తర్వాత అధికార పార్టీ సభ్యుణ్ని చైర్మన్ చేయాలనేది వ్యూహంగా కనిపిస్తోంది.

మరోవైపు టీడీపీ శాసనసభాపక్ష సమావేశానికి అయిదుగురు ఎమ్మెల్సీలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీడీపీకి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత వైసీపీలో చేరగా.. శివనాగిరెడ్డి జగన్ సర్కారుకు మద్దతు ఇచ్చారు. తాజాగా టీడీఎల్పీ సమావేశానికి అయిదుగురు ఎమ్మెల్సీలు దూరంగా ఉండడటం హాట్ టాపిక్ గా మారింది. వీరు అధికార పార్టీతో టచ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వ్యక్తిగత కారణాలతో సమావేశానికి హాజరు కావడం లేదని శత్రుచర్ల, కేఈ ప్రభాకర్‌, సరస్వతి, శమంతకమణి, తిప్పేస్వామి పార్టీ నాయకత్వానికి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు తమ ఎమ్మెల్సీలకు గాలం వేస్తుండటంతో టీడీపీ అప్రమత్తమైంది. చంద్రబాబు పార్టీ ఎమ్మెల్సీలతో ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీలతో నిరంతరం మాట్లాడుతూ.. వారు చేజారిపోకుండా చూసే బాధ్యతలను పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడికి చంద్రబాబు అప్పగించారు.

ఇదిఇలాం ఉంటే.. సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను.. అసెంబ్లీతోపాటు శాసన మండలిలో ఆమోదింపజేసుకోవాలని అధికార వైసీపీ భారీ ప్లాన్ వేసిందని ప్రతిపక్షం అంటోంది. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్సీకి రూ.5 కోట్లు, కీలక పదవి ఇస్తామని వైఎస్సార్సీపీ ఆశ చూపుతోందని ఆరోపిస్తోంది. అంతేకాదు మండలిలో బలం పెంచుకోవడం కోసం వైసీపీ తమ పార్టీ ఎమ్మెల్సీలకు గాలం వేస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ ప్రయత్నాలతో మండలిలో వైఎస్సార్సీపీకి మెజార్టీ వస్తే.. అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్‌ను తొలగించాలని.. తర్వాత అధికార పార్టీ సభ్యుణ్ని చైర్మన్ చేయాలనేది వైసీపీ ప్లాన్ అని ప్రతిపక్ష నేతల ఆరోపణ.

మూడు రాజధానుల బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుకు శాసనమండలిలో మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. మండలిలో రూల్ 71 కింద చర్చకు టీడీపీ నోటీసు ఇవ్వగా.. మండలి చైర్మన్ షరీఫ్ చర్చకు అనుమతించారు. జనవరి 22న సభలో వాడీ-వేడిగా చర్చ జరిగిన తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో టీడీపీ పైచేయి సాధించగా.. ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్సీలు మాత్రం షాకిచ్చారు. శాసనమండలిలో రూల్‌ 71పై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 13 ఓట్లు వచ్చాయి. 9 మంది తటస్థంగా ఉన్నారు. వీరిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాగిరెడ్డి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటేశారు.

ఇప్పటికే కొందరు ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారనే ప్రచార జోరుగా సాగుతోంది. వైపీపీ నేతల వ్యూహం గమనిస్తే..మండలి రద్దుపైన చివరి నిమిషం వరకు ఖాయమనే ప్రచారం సాగిస్తూ.. తమ పని పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. మండలిలో ప్రస్తుతం టీడీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. దీనికి ఇంకా కొనసాగించ కూడదని అధికార పార్టీ గట్టి పట్టదలతో కనిపిస్తోంది. కీలకమైన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపటం ద్వారా..ప్రభుత్వం మండలిలో టీడీపీ తీరును చాలా సీరియస్ గా తీసుకుంది. మండలి రద్దు దిశగా అడుగులు వేసి..పరిస్థితిని తమ కంట్రోల్ లోకి తెచ్చుకొనే వ్యూహం అమలు చేస్తోంది. మండలి రద్దు ఖాయమని చెబుతూనే.. కొందరిని తమ దారిలో తెచ్చుకోవాలని ప్రణాళిక వేస్తోంది. టీడీపీలో చీలక వచ్చి..ఎమ్మెల్సీలు అధికార పార్టీలో చేరకున్నా..ప్రత్యేక గ్రూపుగా సభలో గుర్తింపు పొందేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ గ్రూపు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా సభలో టీడీపీ మెజార్టీకి గండి కొట్టటంతో పాటుగా తాము అనుకున్న విధంగా సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసిన బిల్లుల పైన మరో వ్యూహంతో ముందుకెళ్లాలని జగన్ సర్కార్ భావిస్తోంది.

This post was last modified on January 26, 2020 7:18 pm

Mahesh

Recent Posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న… Read More

May 11, 2024

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More

May 11, 2024

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More

May 11, 2024

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More

May 11, 2024

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More

May 11, 2024

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More

May 11, 2024

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More

May 11, 2024

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

రాజ‌కీయాల్లో నేత‌ల ప్ర‌భావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది… Read More

May 11, 2024

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More

May 11, 2024

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More

May 11, 2024

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More

May 11, 2024

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More

May 11, 2024

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More

May 11, 2024