‘అశోక్ ఎక్కడ ఉన్నాడో వారికి తెలుసు’

Published by
sarath

హైదరాబాద్‌: డేటా చోరీ వల్ల తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైసిపి కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సంబంధించిన డేటాను టిడిపి,చంద్రబాబు కలసి దొంగిలించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆడపిల్లలకు సంబంధించిన సమాచారం టిడిపి గుండాల దగ్గర ఉందని మండిపడ్డారు. మహిళల ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, ఫోన్‌ నంబర్లు తదితర వివరాలు దొంగల ముఠా వద్ద ఉన్నాయని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇ-ప్రగతి పోర్టల్ ను ఆధార్ కు లింక్ చేయడం ద్వారా ఎంతో సమాచారాన్ని రాబట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. జె.సత్యనారాయణ 2106లో ఆధార్ సంస్థ చైర్మన్ గా నియమితులైనప్పటి నుంచి ఎన్నికల వరకు కూడా ఈ తంతు నిరాటంకంగా కొనసాగిందని ఆయన ఆరోపించారు. ఇ-ప్రగతి నుంచి సేవామిత్రకు డేటా బదిలీ చేశారని విజయసాయి రెడ్డి చెప్పారు.

ఆరు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన వివరాలు, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వివరాలను చంద్రబాబు తన పార్టీ యాప్ లో పెట్టుకోవడం అందరూ గమనించాలని విజయసాయి రెడ్డి అన్నారు. దీనిపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సేవామిత్రను రూపొందించింది ఐటీ గ్రిడ్స్ అనీ, దీని యజమాని అశోక్ దాకవరంను పట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనీ విజయసాయి రెడ్డి తెలిపారు.

అశోక్ సేకరించిన సమాచారం ద్వారా ఎవరు ఎక్కడెక్కెడ ఉన్నారో ట్రాక్ చేసే అవకాశం ఉందని, బంధువుల స్నేహితుల ఫోన్ నెంబర్లు సేవామిత్రకు వెళ్తాయని ,ఫోన్ స్టోరేజి డేటా కూడా వారి వద్దకు వెళ్లి పోతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఫోన్ లో ఉన్న మైక్ ను కూడా తమ అదుపులోకి తీసుకుని ఇతరుల సంభాషణను రికార్డు చేసే వీలుందని వివరించారు.ఈ విధంగా చంద్రబాబునాయుడు ఐటీ గ్రిడ్స్ అశోక్ తో కలిసి దేశానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎంత ముప్పు తీసుకువచ్చాడో అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలకు అభద్రతా భావం కలిపించారని ఆయన పేర్కొన్నారు.

‘సేవామిత్ర యాప్‌తోనే టిడిపి ఎన్నికల్లో సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేల్లో ఎవరైతే టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారో.. వారి ఓట్లను తొలగించేందకు ఫామ్‌-7 దరఖాస్తులు చేశారు. ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ద్వారానే ఐటీ గ్రిడ్‌కు ప్రజల వ్యక్తిగత డేటా చేరింది. చంద్రబాబు, లోకేశ్‌లు అశోక్‌ అరెస్ట్‌ కాకుండా కాపాడుతున్నారు. అశోక్‌ ఏ తప్పు చేయకుంటే అజ్ఞాతంలోకి ఎందుకు వెళతారు?. టిడిపి ప్రభుత్వంఐపిఎస్ అధికారి బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది’ అని విజయసాయి రెడ్డి తెలిపారు. సిట్ దర్యాప్తు ఏమైంది అని ఆయన ప్రశ్నించారు.

బాలసుబ్రమణ్యం సతీమణికి గ్రీన్ ఆర్క్ సొల్యూషన్ ,ఓటిఎస్ ఐ అనే రెండు సంస్థలు ఉన్నాయనీ, ఈ సంస్థలకు ఆర్టీఏ వెబ్‌సైట్‌ సాంకేతిక బాధ్యతలను అప్పగించారనీ విజయసాయి రెడ్డి తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం రవాణాశాఖ కమిషనర్‌గా ఉండటం వల్లనే ఆ రెండు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 138 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభయ యాప్‌ పైలెట్‌ ప్రాజెక్టును తీసుకొచ్చారని, దీనికి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో, ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారో తెలపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

అశోక్ ఎక్కడ ఉన్నాడనేది చంద్రబాబు,లోకేష్ ,ఏబి వెంకటేశ్వరరావు,బాలసుబ్రమణ్యంలకు తెలుసని విజయసాయి రెడ్డి అన్నారు. ఇటీవల అశోక్‌ పలువురు హ్యాకర్లతో ఢిల్లీలో సమావేశమై.. కౌంటింగ్‌ రోజు ఎలా హ్యాక్‌ చేస్తే టీడీపీ అనుకూలంగా ఫలితాలు రాబట్టవచ్చనే అంశం మాట్లాడినట్టు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

This post was last modified on May 1, 2019 11:10 am

sarath

Recent Posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More

May 3, 2024

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More

May 3, 2024

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More

May 3, 2024

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

Madhuranagarilo May 3 2024 Episode 353:  రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More

May 3, 2024

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More

May 3, 2024

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More

May 3, 2024

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More

May 3, 2024

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు.… Read More

May 3, 2024

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు… Read More

May 3, 2024

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి డైమండ్ బజార్. నెట్ఫ్లిక్స్ లో బుధవారం అనగా… Read More

May 3, 2024

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Neethone Dance: బిగ్బాస్ రన్నర్ గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నట్టు అఖిల్. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్… Read More

May 3, 2024

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

Venkatesh-Roja: అత్యధిక చిత్రాల నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు రెండవ కుమారుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దగ్గుబాటి వెంకటేష్.. చాలా… Read More

May 3, 2024