SRIVARI TWIN BRAHMOTSAVAMS: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు .. కీలక నిర్ణయాలు వెల్లడించిన ఈఓ ధర్మారెడ్డి

Published by
sharma somaraju

SRIVARI TWIN BRAHMOTSAVAMS: అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జ‌రిగే రెండు బ్రహ్మోత్సవాలకు విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉంద‌ని, భ‌క్తుల సౌక‌ర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీ, తిరుప‌తి కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో ఈవో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జ‌రుగుతాయ‌ని చెప్పారు.

సెప్టెంబ‌రు 18న ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున శ్రీ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని తెలిపారు. సీఎం చేతుల‌ మీదుగా శ్రీ‌నివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల హాస్ట‌ల్ భ‌వ‌నం, తిరుమ‌ల‌లో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు. ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌రకు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌ సేవ‌లు జ‌రుగుతాయ‌ని చెప్పారు. గ‌రుడ‌ సేవను రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభించి భ‌క్తులంద‌రికీ ద‌ర్శ‌నం క‌ల్పిస్తూ నిదానంగా ముందుకు తీసుకెళ‌తామ‌ని తెలిపారు.

ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు

సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని, వారికి సంతృప్తిక‌రంగా వాహ‌న‌ సేవ‌ల ద‌ర్శ‌నంతో పాటు మూల‌మూర్తి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని ఈఓ చెప్పారు. బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని, స్వ‌యంగా వ‌చ్చే ప్రొటోకాల్ ప్ర‌ముఖులను మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని వివ‌రించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులు త‌దిత‌ర ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలను ర‌ద్దు చేసిన‌ట్టు వెల్ల‌డించారు. శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో ఆల‌యాలు నిర్మించిన‌ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార ప్రాంతాల్లోని భ‌క్తుల‌కు రోజుకు వెయ్యి మంది చొప్పున బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం చేయిస్తామ‌ని తెలిపారు. వీరికి ఉచితంగా ర‌వాణా, భోజ‌నం, బ‌స క‌ల్పిస్తామ‌న్నారు.

భక్తుల భ‌ద్ర‌త దృష్ట్యా సెప్టెంబ‌రు 22న గ‌రుడ‌ సేవ నాడు ఘాట్ రోడ్ల‌లో ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌ను ర‌ద్దు చేశామ‌న్నారు. జిల్లా యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌క్తుల‌కు ర‌వాణా, వైద్యం త‌దిత‌ర సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని తెలియ‌జేశారు. బ్ర‌హ్మోత్స‌వాల కోసం విభాగాల వారీగా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేప‌డ‌తామ‌ని చెప్పారు. భ‌క్తుల కోసం ప‌లు ప్రాంతాల్లో జ‌ర్మ‌న్ షెడ్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. తొమ్మిది రోజుల పాటు జ‌రిగే ఉత్స‌వాల్లో తొమ్మిది రాష్ట్రాల నుండి క‌ళాకారుల‌ను ఆహ్వానించి వాహ‌న‌ సేవ‌ల ఎదుట క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేస్తామ‌ని వివ‌రించారు. వాహ‌న‌సేవ‌ల ఎదుట ఏనుగులు, అశ్వాలు, వృష‌భాలు ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో పాల్గొంటాయ‌ని, వీటి నిర్వ‌హ‌ణ కోసం కేర‌ళ నుండి నిపుణులను ర‌ప్పిస్తున్నామ‌ని చెప్పారు. అట‌వీ శాఖ తిరిగి ఆదేశాలు జారీ చేసే వ‌ర‌కు న‌డ‌క మార్గాల్లో ఇప్పుడున్న నిబంధ‌న‌లు కొన‌సాగుతాయ‌ని తెలిపారు.

జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ గ‌తేడాది త‌ర‌హాలోని జిల్లాలోని అన్ని విభాగాల‌ను భాగ‌స్వాముల‌ను చేసి శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేస్తామ‌న్నారు. టీటీడీతో స‌మ‌న్వ‌యం కోసం న‌లుగురు అధికారుల‌ను ఇప్ప‌టికే ఏర్పాటు చేశామ‌ని, ఎక్సైజ్ చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. ట్యాక్సీల‌కు ధ‌ర‌లు నిర్ణ‌యించి స్టిక్క‌ర్లు అంటిస్తామ‌ని, రుయా ఆసుప‌త్రి, ఇత‌ర ప్రాంతాల నుండి వైద్యుల‌ను, మందుల‌ను అందుబాటులో ఉంచుతామ‌ని వివ‌రించారు.

ఎస్పీ శ్రీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ బ్ర‌హ్మోత్స‌వాలకు త‌గినంత మంది సిబ్బందితో పూర్తి భద్ర‌త క‌ల్పిస్తామ‌ని తెలిపారు. సీఎం ప‌ర్య‌ట‌న‌, గ‌రుడ సేవ‌, చ‌క్ర‌స్నానం రోజుల్లో ప్ర‌త్యేక భద్ర‌తా ఏర్పాట్లు చేప‌డ‌తామ‌న్నారు. శ్రీ‌వారి ఆల‌యం, మాడ వీధులు, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, ఔట‌ర్ రింగ్ రోడ్డు, అలిపిరి చెక్ పాయింట్ త‌దిత‌ర ప్రాంతాల్లో క‌ట్టుదిట్ట‌మైన భద్ర‌తా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. భ‌క్తుల ర‌ద్దీతో పాటు ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణకు ఏర్పాట్లు చేస్తామ‌ని తెలిపారు. తిరుప‌తి న‌గ‌రం శివార్ల‌లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహ‌నాల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తామ‌న్నారు. తిరుప‌తి కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ శ్రీ‌మ‌తి హ‌రిత మాట్లాడుతూ తిరుప‌తిలోని రైల్వే స్టేష‌న్‌, బ‌స్టాండు, భ‌క్తులు సంచ‌రించే అన్ని ప్రాంతాల్లో అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేసి మెరుగ్గా పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని తెలిపారు.

Tirumala: ఎస్వీ మ్యూజియానికి పురాత‌న వ‌స్తువులు అందజేత

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కూట‌మి… Read More

May 12, 2024

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జ‌ట్టుకు ఎంత‌టి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా… Read More

May 12, 2024

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్ లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్ర… Read More

May 12, 2024

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

Ravi Teja: చిత్ర పరిశ్రమలో కథలు ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. ఒక హీరో… Read More

May 12, 2024

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Big Breaking: ప్రస్తుత కాలంలో అనేక ప్రమాదాలు జరుగుతున్న సంగతి మనం చూస్తూనే ఉంటున్నాం. ఇక ఇటువంటివి సాధారణమైన మనుషులకి… Read More

May 12, 2024

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

Kona Venkat: బాపట్ల జిల్లాలో సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పై కేసు నమోదైంది. దళిత యువకుడిపై దాడి… Read More

May 12, 2024

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

Kriti Sanon: టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో కృతి స‌న‌న్… Read More

May 12, 2024

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవేళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధులతో కలిసి ఫుట్… Read More

May 12, 2024

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

Aparichithudu: గత కొంతకాలం నుంచి తెలుగు తమిళ భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో… Read More

May 12, 2024

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి… Read More

May 12, 2024

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక సోమవారం రోజున ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో చివరి రోజు అయిన… Read More

May 12, 2024

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెగా కుటుంబంలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో... అందరు… Read More

May 12, 2024

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాజకీయ నాయకులందరూ ఇండ్లల్లోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్… Read More

May 12, 2024

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయ‌న‌ను ఓడించాల‌నే వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే.… Read More

May 12, 2024